ఎన్‌సీఆర్‌ఐలో డాక్టోరల్ ఫెలోషిప్‌లు


Sat,January 13, 2018 03:18 AM

హైదరాబాద్‌లోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌సీఆర్‌ఐ) 2018-19 విద్యాసంవత్సరానికిగాను డాక్టోరల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం రూరల్ స్టడీస్‌లో పరిశోధనలు చేసే పీహెచ్‌డీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: ఎన్‌సీఆర్‌ఐ అనేది కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ పరిధిలో పనిచేస్తుంది.
-ప్రోగ్రామ్: డాక్టోరల్ ఫెలోషిప్
-ఫెలోషిప్ వ్యవధి: మూడేండ్లు
-ఫెలోషిప్: రూ. 16,000/- (కంటింజెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి రూ. 15,000/- అదనంగా చెల్లిస్తారు)
-పరిశోధన విభాగాలు: రూరల్ కమ్యూనికేషన్, రూరల్ మేనేజ్‌మెంట్, రూరల్ సోషల్ వర్క్, రూరల్ సోషియాలజీ, రూరల్ టూరిజం, రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, రూరల్ ఎడ్యుకేషన్ తదితర రూరల్ స్టడీస్ అంశాలు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో పరిశోధనలకు ఏదైనా విద్యాసంస్థలో పీహెచ్‌డీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సంబంధిత మాస్టర్ డిగ్రీలో 55 శాతం (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. నెట్/స్లెట్, ఎంఫిల్ లేదా యూనివర్సిటీ నిర్వహించే రిసెర్చ్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో అర్హత సాధించాలి.
-వయస్సు: 40 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో లేదా ఈ-మెయిల్ ద్వారా. పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తు నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి పర్సనల్ అధికారికి పంపాలి.
-చిరునామా: The Member-Secretary,National Council of Rural Institutes,Shakar Bhavan, Fatehmaidan Road,Basheerbagh, Hyderabad 500004
-దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 25
-ఈ-మెయిల్:fellowship.ncri@gmail.com
-వెబ్‌సైట్: www.ncri.in.
NCRI

433
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles