విలక్షణ కోర్సులు c/o ఐఎస్‌ఐ


Wed,January 10, 2018 12:42 AM

నేటి విద్యార్థుల్లో భిన్నమైన ఆలోచనలు, అభిరుచులు ఎక్కువ. అందరికి భిన్నంగా ఏదో ఒకటి చేయాలన్న తపన బలంగా కనిపిస్తున్నది. అందుకోసమే చాలామంది ఉన్నత విద్య, వృత్తి విషయాల్లో కఠిన సవాళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు. అలాంటివారికోసం దేశంలో కొన్ని సంస్థలు/కాలేజీలు పేరెన్నికగన్నవి. స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, క్యూ. ఎకనామిక్స్, క్యూఎంఎస్, క్రిప్టాలజీ వంటి కోర్సుల్లో రాణించాలనుకొనేవారి కోసం ప్రముఖ ఆర్థికవేత్త మహలనొబిస్ ప్రారంభించిన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ) అత్యుత్తమ మజిలీగా కొనసాగుతున్నది. ఐఎస్‌ఐలో పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది. నిపుణ పాఠకుల కోసం...

ఐఎస్‌ఐ:

కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో మహలనొబిస్ 1920లో చిన్న స్టాటిస్టికల్ ల్యాబొరేటరీని ప్రారంభించారు. ఈ ల్యాబ్ క్రమంగా 1931లో ఐఎస్‌ఐగా రూపాంతరం చెందింది. చిన్నచిన్నగా పురోగమించి ప్రస్తుతం కలకత్తా, న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ల్లో ప్రధాన క్యాంపస్‌లతోపాటు మరికొన్ని నగరాల్లో కేంద్రాలను కలిగి జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా కేంద్రం గుర్తించింది. దేశ, విదేశాల్లోని పలు విశ్వవిద్యాలయాలు ఎంఓయూలు చేసుకుంటున్నాయి. ఇక్కడ చదివిన విద్యార్థులకు అంతర్జాతీయ సంస్థ లు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భారీ వేతనాలతో కొలువులు ఇస్తున్నాయి.

సంస్థ ప్రత్యేకతలు

-మొదటి మెకానికల్ హ్యాండ్ కంప్యూటింగ్ మెషిన్
-మొదటి అనలాగ్ కంప్యూటర్
-మొదటి పంచ్‌డ్ కార్డ్ స్టోరింగ్ మెషిన్
-మొదటి సాలిడ్ స్టేట్ కంప్యూటర్ ఇన్ ఇండియాలను ఈ సంస్థ జాదవ్‌పూర్ యూనివర్సిటీతో కలిసి రూపొందించింది.
ISIInstitute

కోర్సులు - కాలవ్యవధి:

-మూడేండ్ల డిగ్రీ కోర్సులు: బీ.స్టాట్ (ఆనర్స్)- కోల్‌కతా, బీ.మ్యాథ్ (ఆనర్స్) - బెంగళూరు.
-రెండేండ్ల పీజీ కోర్సులు: ఎం.స్టాట్ (ఢిల్లీ, చెన్నై). ఎం.మ్యాథ్ (కోల్‌కతా), ఎంఎస్

(క్వాంటిటేటివ్ ఎకనామిక్స్) (కోల్‌కతా, ఢిల్లీ). ఎంఎస్ (లైబ్రేరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్) (బెంగళూరు). ఎంఎస్ (క్వాలిటీ మేనేజ్‌మెంట్ సైన్స్) (బెంగళూరు, హైదరాబాద్). ఎంటెక్ (సీఎస్), ఎంటెక్ (క్రిప్టాలజీ అండ్ సెక్యూరిటీ), ఎంటెక్ (క్వాలిటీ, రిలియబిలిటీ, ఆపరేషన్స్ రిసెర్చ్)- కోల్‌కతా.
-పార్ట్‌టైం(ఎస్‌క్యూసీ-బెంగళూరు,హైదరాబాద్)
-పీజీ డిప్లొమా ఇన్ స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ అనలిటిక్స్ (ఏడాది)- తేజ్‌పూర్
-పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఏడాది) - గిరిధ్
-పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ అనలిటిక్స్ (ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐఎం కలకత్తా. ఐఎస్‌ఐ సంయుక్తంగా నిర్వహిస్తాయి) రెండేండ్లు - కోల్‌కతా
-జేఆర్‌ఎఫ్/ఎస్‌ఆర్‌ఎఫ్ - కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, తేజ్‌పూర్.
ఎంపిక: పై కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐఎస్‌ఐ దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తుంది. వీటిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హతలు: డిగ్రీ కోర్సులకు ఇంటర్‌లో మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులుగా చదివి ఉండాలి. పీజీ కోర్సులకు స్టాటిస్టిక్స్‌లో మూడేండ్ల బ్యాచిలర్ డిగ్రీ / బీఈ/బీటెక్ లో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివినవారు లేదా బీమ్యాథ్. పీజీడిప్లొమా ఇన్ స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ అనలిటిక్స్ ఉత్తీర్ణులు.
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నంతోపాటు పలు నగరాల్లో పరీక్షను నిర్వహించనున్నారు.
-అడ్మిషన్ టెస్ట్: మే 13 (ఆదివారం)

ముఖ్యతేదీలు:

-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం
-చివరితేదీ: మార్చి 9
-ఫీజు చెల్లించడం ప్రారంభం: ఫిబ్రవరి 9 నుంచి
-ఫీజు చెల్లించడానికి చివరితేదీ: మార్చి 11
-వెబ్‌సైట్: https://www.isical.ac.in

క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు వచ్చిన సంస్థలు:

-ఏఐజీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ఏఎన్‌జెడ్, యాక్సిస్ బ్యాంక్, ఏబీ ఇన్‌వెబ్, బార్క్ ఇండియా, బ్లాక్‌రాక్, క్యాపిటల్ వన్, సిటీబ్యాంక్, క్రిసిల్, సిబిల్, సిటీకార్పొరేషన్, క్యుమినిస్ ఇండియా, డెలాయిట్, డా.రెడ్డీస్ ల్యాబ్, ఎర్నెస్ట్ & యంగ్, ఫికో, ఐబీఎం, ఐసీఐసీఐ, జేపీ మోర్గాన్, కేపీఎంజీ, టీసీఎస్ ఇన్నోవేషన్ ల్యాబ్, యూహెచ్ గ్రూప్, వాల్‌మార్ట్ ల్యాబ్, టీసీఎస్ అనలిటిక్స్, రెడ్‌బస్, రిలయన్స్, సామ్‌సంగ్, స్టాండర్డ్ చార్టెడ్, మైక్రోసాఫ్ట్, నోవార్టిస్, నారాయణ హృదయాలయ, జెన్‌డ్రైవ్ తదితర కంపెనీలు.

1131
Tags

More News

VIRAL NEWS

Featured Articles