ఇండియన్ ఆయిల్‌లో జేఈఏలు


Wed,January 10, 2018 12:29 AM

-రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 100 మార్కులకు ఉంటుంది. సంబంధిత సబ్జెక్ట్ నుంచి 75 మార్కులు, జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్‌ల నుంచి 25 మార్కులు.
-ఈ ఆబ్జెక్టివ్ పరీక్షకు 90 నిమిషాల సమయం కేటాయించారు.
-నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) బరౌని రిఫైనరీ నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (జేఈఏ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
iocrefrecruit

వివరాలు:

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఇండియాలోని ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీల్లో అతిపెద్ద వాణిజ్య సంస్థ.
-మొత్తం ఖాళీల సంఖ్య: 58 పోస్టులు
-విభాగాలు: కెమికల్, పవర్ & యుటిలిటీస్, ఫైర్ అండ్ సేఫ్టీ, ఎలక్ట్రికల్, క్వాలిటీ కంట్రోల్, మెటీరియల్స్, స్టాఫ్ నర్స్
-జూ. ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ప్రొడక్షన్)- 30
-అర్హత: కెమికల్/రిఫైనరీ & పెట్రోకెమికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా లేదా బీఎస్సీ (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ)లో ఉత్తీర్ణత.
-జూ. ఇంజినీరింగ్ అసిస్టెంట్ (పీ & యు)- 6
-అర్హత: మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత. పదోతరగతితో ఐటీఐ (ఫిట్టర్)తోపాటు బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి లేదా బీఎస్సీ (పీసీఎం)తోపాటు అప్రెంటిస్‌షిప్ చేసి ఉండాలి.
-జూ. కంట్రోల్ రూమ్ ఆపరేటర్/అసిస్టెంట్-8
-అర్హత: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమాలో ఉత్తీర్ణత.
-జూ. క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ (క్యూ సీ)- 4
-అర్హత: బీఎస్సీ (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ)లో ఉత్తీర్ణత.
-జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ఫైర్&సేఫ్టీ)-1
-అర్హత: మెట్రిక్యులేషన్+నాగ్‌పూర్ ఎన్‌ఎఫ్‌ఎస్సీచే సబ్ ఆఫీసర్స్ కోర్సు లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంస్థ సూచించిన నమూనాలో ఫిజికల్ కొలతలను కలిగి ఉండాలి.
-జూనియర్ మెటీరియల్ అసిస్టెంట్-1
-అర్హత: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-జూనియర్ నర్సింగ్ అసిస్టెంట్ (స్టాఫ్ నర్స్)- 1
-అర్హత: నాలుగేండ్ల బీఎస్సీ (నర్సింగ్) లేదా నర్సింగ్ & మిడ్‌వైఫరీ లేదా ఓ అండ్ జీలో మూడేండ్ల డిప్లొమాలో ఉత్తీర్ణత.
గమనిక: పైన అన్ని పోస్టులకు జనరల్, ఓబీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం.
-వయస్సు: 18 నుంచి 26 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 11,900-32,000/-
-ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా. రాత పరీక్షలో సంస్థ నిర్ణయించిన కనీస మార్కులను సాధించాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 20
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీలకు చివరితేదీ: జనవరి 31
-రాతపరీక్ష తేదీ: ఫిబ్రవరి 4
-ఫలితాలు విడుదల: ఫిబ్రవరి 12
-వెబ్‌సైట్: www.iocrefrecruit.in

925
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles