వీవర్స్ సర్వీస్ సెంటర్‌లో


Thu,December 7, 2017 02:53 AM

ఢిల్లీలోని వీవర్స్ సర్వీస్ సెంటర్ ఐటీఐ ఉత్తీర్ణుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:

వీవర్స్ సర్వీస్ సెంటర్ అనేది టెక్స్‌టైల్ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుత పోస్టులు గ్రూప్ సీ నాన్ గెజిటెడ్ పోస్టులు. దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.
-జూనియర్ ప్రింటర్ - 2 ఖాళీలు
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు
-అర్హతలు: పదోతరగతితోపాటు టెక్స్‌టైల్ ప్రింటింగ్ లేదా స్క్రీన్ ప్రింటింగ్/ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ లేదా బ్లాక్ ప్రింటింగ్ ట్రేడ్‌లో ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
-పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,400/-
-కార్పెంటర్ - 3 పోస్టులు
-అర్హతలు: పదోతరగతితోపాటు ఐటీఐ/డిప్లొమాలో కార్పెంటర్ ట్రేడ్‌లో ఉత్తీర్ణత. కార్పెంటరీ/లూమ్ సెట్టింగ్‌లో కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు.
-పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/-
-అటెండెంట్ - 3 ఖాళీలు
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు.
-అర్హతలు: పదోతరగతితోపాటు ఐటీఐలో టెక్స్‌టైల్ డైయింగ్/ ప్రింటింగ్ లేదా ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/-
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 45 రోజుల్లో పంపాలి.
-దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: డైరెక్టర్, వీవర్స్ సర్వీస్ సెంటర్,
-బీ-2, వీవర్స్ కాలనీ, భారత్‌నగర్, ఢిల్లీ - 110052
-వెబ్‌సైట్: www.handlooms.nic.in

517
Tags

More News

VIRAL NEWS

Featured Articles