ఆర్మీ స్కూల్స్‌లో టీచర్స్


Wed,December 6, 2017 03:24 AM

-మొత్తం ఖాళీల సంఖ్య - 1000కి పైగా
-టీజీటీ, పీజీటీ, పీఆర్‌టీ పోస్టులు ఉన్నాయి.

Technoఎవరు అర్హులు?
-పీజీటీ - సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. 50 శాతం మార్కులతో బీఈడీ ఉత్తీర్ణత.
-టీజీటీ - సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. కనీసం 50 శాతం మార్కులతో బీఈడీ ఉత్తీర్ణత.
-పీఆర్‌టీ - కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, బీఈడీ/రెండేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: 2018, ఏప్రిల్ 1నాటికి ఫ్రెషర్స్‌కు 40 ఏండ్లు మించరాదు. అనుభవం ఉన్నవారికి 57 ఏండ్లు మించరాదు. (గత 10 ఏండ్లలో కనీసం 5 ఏండ్లు టీచింగ్‌లో అనుభవం ఉండాలి)
-టీజీటీ/పీఆర్‌టీ పోస్టులకు సీటెట్/టెట్ తప్పనిసరిగా క్వాలిఫై అయి ఉండాలి. సీటెట్/టెట్ క్వాలిఫై కానివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారిని తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు.

PGTసబ్జెక్టులు-ఖాళీలు
-పీజీటీ: ఇంగ్లిష్, హిందీ, హిస్టరీ, జాగ్రఫి, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ, సైకాలజీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మాటిక్స్, హోంసైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్.
-టీజీటీ - ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, హిస్టరీ, జాగ్రఫి, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ.
-ఎంపిక: మూడు దశల్లో చేస్తారు.
-స్టేజ్ - 1లో స్క్రీనింగ్ పరీక్ష. దీన్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి స్కోర్ కార్డులు ఇస్తారు. ఇవి మూడేండ్లపాటు వ్యాలిడిటీ కలిగి ఉంటాయి. స్టేజ్ -1లో అర్హత సాధించినవారిని మిగిలిన దశలకు అనుమతిస్తారు.
-స్టేజ్ -2 ఇంటర్వ్యూ: దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
-స్టేజ్ -3: టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీని ఈ దశలో పరీక్షిస్తారు. లాంగ్వేజ్ టీచర్లు, రాతపరీక్షలో 15 మార్కులకు ఎస్సే, కాంప్రహెన్షన్స్ ఇస్తారు. వీటితోపాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ను నిర్వహిస్తారు.
-స్క్రీనింగ్ టెస్ట్: 2018, జనవరి 15 - 17 మధ్య నిర్వహిస్తారు.
-పరీక్ష మల్టిపుల్ చాయిస్ (ఆబ్జెక్టివ్) విధానంలో ఉంటుంది.
-పీజీటీ/టీజీటీ పరీక్ష కాలవ్యవధి 3 గంటలు. పీఆర్‌టీకి 90 నిమిషాలు.
-పీజీటీ/టీజీటీ, పీఆర్‌టీ పరీక్షను 90 మార్కులకు నిర్వహిస్తారు.
-పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కులు కోతవిధిస్తారు.
-ప్రతి విభాగంలో కనీసం 50 శాతం మార్కులు వస్తే క్వాలిఫైగా పరిగణిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు: రూ. 500/-
-చివరితేదీ: డిసెంబర్ 27 (సాయంత్రం 5 గంటల వరకు)
-అడ్మిట్ కార్డులు: 2018, జనవరి 5 నుంచి
-పరీక్షతేదీ: 2018, జనవరి 15 - 17 మధ్య
-పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 77 ఉన్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్.
-ఫలితాల వెల్లడి: 2018, జనవరి 27
-వెబ్‌సైట్: www.awesindia.com or aps-csb.in

-1000కి పైగా పోస్టులు
-టీజీటీ, పీజీటీ/పీఆర్‌టీ పోస్టులు
-2018, జనవరి 15- 17 మధ్య పరీక్ష
-జనవరి 27న ఫలితాల వెల్లడి
ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ పరిధిలో దేశవ్యాప్తంగా 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ నడుస్తున్నాయి. వీటిలో సుమారు 8వేల మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఏటా వెయ్యికిపైగా ఖాళీలు ఏర్పడుతాయి. ఈ స్కూల్స్ అన్నీ సీబీఎస్‌ఈ అఫిలియేషన్స్‌తో నడుస్తున్నాయి. వీటన్నింటిని ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. ఆర్మీలో పనిచేసేవారి పిల్లల కోసం అత్యాధునిక సౌకర్యాలు, ప్రొఫెషనల్ టీచర్లతో వీటిని నిర్వహిస్తున్నారు.
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

1061
Tags

More News

VIRAL NEWS

Featured Articles