TSPSC-TRT - అసివిటాస్ అనేదిఏ భాషా పదం?


Wed,December 6, 2017 02:54 AM


1. పరిసరాల విజ్ఞానం ద్వారా పిల్లలు అలవర్చుకోవాల్సినవి?

1) పరిసరాల గురించి తెలుసుకోవడం
2) పరిసరాల ద్వారా అభ్యసనం
3) పరిసరాల పరిరక్షణ చేయడం 4) పైవన్నీ

2. సాంఘికశాస్త్రంలోని అంశాలను సూక్ష్మీకరించడం ద్వారా ఏర్పడింది?

1) చరిత్ర 2) సామాజిక శాస్ర్తాలు
3) పరిసరాల విజ్ఞానం 4) పౌరశాస్త్రం

3. సాంఘికశాస్త్రం విద్యా ప్రణాళికలో ఒక ముఖ్యమైన అంశమని గుర్తించినవారు?

1) ఈశ్వరీబాయి కమిటీ 2) కొఠారి కమిషన్
3) సెకండరీ విద్యా కమిషన్
4)1986 జాతీయ విద్యా విధానం

4. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం?

1) 1915 2) 1918 3) 1914 4) 1920

5. మానవాభ్యుదయ విధానానికి తోడ్పడే శాస్త్రం అని దేనిని పిలుస్తారు?

1) చరిత్ర 2) మనోవిజ్ఞాన శాస్త్రం
3) తత్వశాస్త్రం 4) సాంఘిక శాస్త్రం

6. ప్రాథమిక ప్రాథమికోన్నత స్థాయిలో పరిసరాలపట్ల సాంఘిక అంశాలపట్ల అవగాహన, భూగోళం, చరిత్ర, పౌరనీతి, ఆర్థికాంశాలపట్ల పరిచయం కలిగించాలని చెప్పినవారు?

1) 1952 సెకండరీ విద్యా కమిషన్
2) 1964-66 కొఠారి కమిషన్
3) 2005 ఎన్‌సీఎఫ్ 4) 1986 ఎన్‌పీఈ

7. ఎల్‌ఈపీ అంటే?

1) లెర్నింగ్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు
2) లెర్నింగ్ ఎవల్యూషన్ ప్రోగ్రామ్
3) లెర్నింగ్ ఎన్‌హాన్స్‌మెంట్ ప్రోగ్రామ్
4) లర్నింగ్ ఎవల్యూషన్ ప్రాజెక్టు

8. బోధనాభ్యసన ప్రక్రియలో పరిసరాన్ని ఒక ఆయుధంగా స్వీకరించి బాల్యంలోనే సత్పరులకు కావాల్సిన హితబోధన, దేశభక్తి ప్రేరేపించేదిగా ఉండాలని తెలిపినవారు?

1) కొఠారి కమిషన్
2) నూతన జాతీయ విద్యావిధానం-2015
3) సెకండరీ విద్యా కమిషన్
4) ఎన్‌సీఎఫ్-2005

9. కింది ఏ రెండు తరగతులకు సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాలు లేవు?

1) 1, 3 2) 3, 4 3) 1, 2 4) 2, 3

10. మానవ సమాజ అభ్యున్నతికి, తోటి మానవుల సముదాయంతో కలిసి జీవించే విధానాన్ని, తోటి మానవుల సమాఖ్యతో కలిసి జీవించే విధానాన్ని తన అభ్యున్నతికి సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష అంశాల పట్ల అవగాహన పెంపొందించేదే సాంఘికశాస్త్రం అని నిర్వచించినవారు?

1) అమెరికా సంయుక్త రాష్ర్టాల విక్టోరియా స్కూల్ బోర్డు 2) అమెరికా సంయుక్త రాష్ర్టాల సాంఘిక విజ్ఞాన కమిటీ
3) అమెరికా సంయుక్త రాష్ర్టాల పునర్‌వ్యవస్థీకరణ సమాఖ్య
4) అమెరికా సంయుక్త రాష్ర్టాల జాతీయ విద్యా సంఘం

11. మానవ సంఘాన్ని అభివృద్ధి చేసి తీర్చిదిద్దగలిగిన, ప్రత్యక్ష సంబంధం కలిగిన విషయాలు, సాంఘిక వర్గంలోని ఒక మానవుని నిర్మాణాత్మక సభ్యుడిగా చేసే విషయాలు సాంఘికశాస్త్ర పరిధిలోకి వస్తాయని చెప్పినవారు?

1) అమెరికా సంయుక్త రాష్ర్టాల జాతీయ విద్యా సంఘం
2) అమెరికా సంయుక్త రాష్ర్టాల పునర్‌వ్యవస్థీకరణ సమాఖ్య
3) అమెరికా సంయుక్త రాష్ర్టాల సాంఘిక విజ్ఞాన కమిటీ
4) అమెరికా సంయుక్త రాష్ర్టాల విక్టోరియా స్కూళ్ల బోర్డు

12. విద్యార్థి, అతని పరిసరాల్లోగల సంస్థలతోను, వ్యక్తులతోను, సృజనాత్మకమైన స్నేహపూర్వక కార్యక్రమంలో ఏర్పర్చుకొనే సంబంధ బాంధవ్యాలను సాంఘిక శాస్త్రం అధ్యయనం చేస్తుందని చెప్పినవారు?

1) మైఖిలీన్ 2) జేఎఫ్ ఫారెస్టర్
3) ఈవీ వెస్లీ 4) హేమింగ్స్

13. కిందివాటిలో లక్ష్మణస్వామి విద్యా కమిషన్ నిర్వచనానికి సంబంధం లేనిది?

1) సాంఘికశాస్త్రం అనే పదం నూతనమైంది
2) భూగోళం, చరిత్ర, పౌర, అర్థ శాస్ర్తాల సంప్రదాయక భూమికను పూర్తి చేస్తుంది
3) సాంఘికశాస్త్ర అంశాలను వేర్వేరుగా బోధిస్తేనే సాంఘిక సమస్యలపట్ల అంతర దృష్టి ఏర్పడుతుంది
4) విద్యార్థుల్లో సామాజికపరమైన స్నేహం, సోదరభావం, సహకార తత్వం, దయ, సానుభూతి పెంపొందిస్తుంది.

14. విద్యార్థుల్లో కీలకాంశాలు భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర, రాజ్యాంగంపట్ల గౌరవ భావన, విలువలు, సంప్రదాయాల పరిరక్షణ, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, సంక్షేమ విధానం, చిన్న కుటుంబ భావన మొదలైన విషయాలపట్ల చైతన్యం తీసుకువచ్చేదే సాంఘిక శాస్త్రం అని చెప్పినవారు?

1) జేఎఫ్ ఫారెస్టర్ 2) ఎన్‌పీఈ-1986
3) ఎన్‌సీఎఫ్-2005 4) కొఠారి కమిషన్

15. తపాలా వ్యవస్థ, బ్యాంకింగ్, రైల్వే, విమాన, నౌకాయాన సంపద, విద్య, వైద్యశాలలు మొదలైనవి?

1) భౌతిక పర్యావరణంలో భాగం
2) జైవిక పర్యావరణంలో భాగం
3) సాంఘిక పర్యావరణంలో భాగం
4) సాధారణ పర్యావరణంలో భాగం

16. విద్యార్థులకు పరిసరాల విజ్ఞానం ద్వారా పెంపొందించే జ్ఞానం అవగాహన, వినియోగం, నైపుణ్యాలు, క్రియాశీలత, సృజనాత్మకత మొదలైన వాటిని సహజంగా విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత శక్తులను బయటకు తీయడానికి వారివారి సామర్థ్యాల ఆధారంగా విద్యాబోధన జరగాలని తెలిపినవారు?

1) యశ్‌పాల్ కమిటీ 2) 1986 ఎన్‌పీఈ
3) ఆర్‌హెచ్ దవే 4) కొఠారి కమిషన్

17. సమాజంలో వ్యక్తిగా ఆ సమాజ కార్యకలాపాలను అధ్యయనం చేయడానికి ఉపయోగపడేది?

1) సాంఘికశాస్త్రం 2) సామాన్యశాస్త్రం
3) సామాజికశాస్త్రం 4) భౌతిక రసాయనశాస్ర్తాలు

18. సామాజికశాస్ర్తాల ఆధారంగా విద్యార్థి బాధ్యతాయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జీవన నైపుణ్యాలు, విలువలు నేర్చుకోవడానికి ప్రతిపాదించిన అంశాలు వేటిలో ఉన్నాయి?

1) చరిత్ర 2) పౌరశాస్త్రం
3) సాంఘికశాస్త్రం 4) అర్థశాస్త్రం

19. చరిత్ర, భూగోళం, పౌర విజ్ఞానం, అర్థశాస్త్రం మొదలైన అంశాలను సంప్రదాయ రీతిలో తెలిపే శాస్త్రం?

1) సామాజికశాస్ర్తాలు 2) సాంఘిక శాస్త్రం
3) ఆత్మవిశ్వాసం 4) సమాజశాస్త్రం

20. సామాజిక శాస్ర్తాలు వాస్తవంగా ఏ రూపంలో ఉన్నాయి?

1) సూక్ష్మరూపం 2) స్థూలరూపం
3) 1, 2 4) అతిసూక్ష్మరూపం

21. సామాజిక శాస్ర్తాల్లో వివిధ అంశాలు సాంఘిక శాస్త్రంలో కింది విధంగా ఉన్నాయి?

1) స్థూలంగా 2) సూక్ష్మంగా
3) 1, 2 4) అతిసూక్ష్మంగా

22. సాంఘికశాస్త్రంలోని భూగోళం, చరిత్ర, పౌర, అర్థశాస్ర్తాలు?

1) విడివిడిగా ఉన్నాయి
2) వేటికవి ప్రత్యేకంగా ఉన్నాయి
3) పరస్పర ఆధారంగా ఉన్నాయి
4) ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి.

23. సాంఘికశాస్ర్తాన్ని బోధించే ఉపాధ్యాయుడు తన బోధనలో..

1) చరిత్ర, పౌర, భూగోళ, అర్థశాస్త్ర అంశాలను స్థూలంగా బోధించాలి
2) చరిత్ర, పౌర, భూగోళ, అర్థశాస్త్ర అంశాలను విడివిడిగా బోధించాలి
3) చరిత్ర, పౌర, భూగోళ, అర్థశాస్త్ర అంశాలను సంయుక్తంగా బోధించాలి
4) చరిత్ర, పౌర, భూగోళ, అర్థశాస్త్ర అంశాలను సంబంధం లేకుండా బోధించాలి.

24. దేశభక్తి, సహజీవనం, సోదరభావం, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహకార భావన, శాంతియుత జీవనాన్ని పెంపొందించే విజ్ఞానం అవగాహన, నైపుణ్యాలను కలిగించేవి?

1) సామాజికశాస్ర్తాలు 2) సమాజశాస్త్రం
3) పౌరశాస్త్రం 4) సాంఘికశాస్త్రం

25. మానవ సంబంధాల గురించి ఎప్పటికప్పుడు కొత్త అంశాలు కనుక్కోవడం ప్రధానంగా వేటి ఉద్దేశం?

1) సాంఘికశాస్త్రం 2) సామాజికశాస్ర్తాలు
3) సమాజశాస్త్రం 4) భౌతిక, భాషాశాస్ర్తాలు

26. విషయ జ్ఞానాన్ని ఉపయోగించే విధానాన్ని తెల్పడానికి ప్రాధాన్యం ఇచ్చేది?

1) చరిత్ర 2) సాంఘికశాస్త్రం
3) సామాజికశాస్ర్తాలు 4) సమాజశాస్త్రం

27. మానవ జ్ఞానాభివృద్ధికి తోడ్పడేది?

1) సాంఘికశాస్త్రం 2)మనోవిజ్ఞానశాస్త్రం
3) సామాజికశాస్ర్తాలు 4) సమాజశాస్త్రం

28. కిందివాటిలో సామాజికశాస్ర్తాలకు సంబంధించింది?

1) సామాజికశాస్ర్తాలు నూతనంగా ఏర్పడిన శాస్ర్తాలు
2) సామాజికశాస్ర్తాలు పరిశోధన, అన్వేషణ ఫలితంగా ఏర్పడ్డాయి.
3) సామాజికశాస్ర్తాలు జ్ఞానాన్ని ఆచరించడానికి ప్రాధాన్యం ఇస్తాయి
4) సామాజికశాస్ర్తాలు మానవ సంబంధాల అధ్యయానికి సంబంధించిన శాస్ర్తాలు

29. మానవ సంబంధాలను కనుగొన్న అంశాలను శ్రద్ధగా చదవడం దేని ముఖ్య లక్ష్యం?

1) చరిత్ర 2) సామాజికశాస్ర్తాలు
3) పౌరశాస్త్రం 4) సాంఘికశాస్త్రం

30. ఏఎంసీ అంటే?

1) అకడమిక్ మేనేజ్‌మెంట్ కమిటీ
2) అకడమిక్ మానిటరింగ్ కమిటీ
3) అకడమిక్ మార్జినల్ కమిటీ
4) అకడమిక్ మేనేజ్‌మెంట్ కౌన్సిల్

31. సాంఘికశాస్త్రం-సామాన్యశాస్త్రం అంశాలను కుదించి ప్రాథమిక తరగతులకు 1 నుంచి 5 వరకు పరిసరాల విజ్ఞానం సిలబస్ రూపకల్పన చేయాలని చెప్పినవారు?

1) 1986 ఎన్‌పీఈ 2) ఎన్‌సీఈఆర్టీ
3) ఎన్‌సీఎఫ్-2005 4) నూతన విద్యావిధానం 2015

32. సాంఘికశాస్త్ర బోధనలో ఉపాధ్యాయులు గుర్తుంచుకోవాల్సిన అంశం?

1) సాంఘికశాస్త్రంలో విషయాలు అంతర సంబంధం కలిగి ఉన్నాయని
2) సాంఘికశాస్త్రంలో విషయాలు వేర్వేరుగా ఉన్నాయని
3) సాంఘికశాస్త్రంలో విషయాలు స్థూలంగా ఉన్నాయని
4) సాంఘికశాస్త్ర పరిధి చాలా స్వల్పంగా ఉందని

33. పరిసరాల విజ్ఞానాన్ని I, II గా విభజించి సాంఘిక అంశాలను Iగాను, సామాన్య అంశాలను II గాను బోధించాలన్నవారు?

1) కొఠారి కమిషన్ 2) ఈశ్వరీబాయి పటేల్ కమిటీ
3) 1986 ఎన్‌పీఈ 4) ఎన్‌సీఎఫ్-2005

34. సాంఘికశాస్త్రం పరిధి చాలా విశాలమైంది. సాంఘికశాస్త్రం ప్రపంచవ్యాప్తంగా మానవుని ప్రస్తుత సమాజానికి సంబంధించిందని చెప్పినవారు?

1) ఎస్‌కే కొచ్చర్ 2) బైనింగ్ అండ్ చైనింగ్
3) నికోలస్ రైట్ 4) జేమ్స్ హేమింగ్సే

35. పాఠశాల అనేది సూక్ష్మరూపంలో ఉన్న భారతదేశం అని పిలిచినవారు?

1) నెహ్రూ 2) ఇందిరాగాంధీ 3) గాంధీ 4) పటేల్

36. ఏ శాస్త్రం పరిధి ప్రపంచమంత విశాలం, మానవుని చరిత్ర అంత సుదీర్ఘం?

1) చరిత్ర 2) పౌరశాస్త్రం
3) సాంఘికశాస్త్రం 4) అర్థశాస్త్రం

key

Paparayudus

658
Tags

More News

VIRAL NEWS

Featured Articles