సీడాక్ సీ క్యాట్


Mon,November 13, 2017 11:50 PM

-జాబ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్
-విభిన్నమైన పీజీ డిప్లొమా కోర్సులు
-బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, ఎమ్మెస్సీ అభ్యర్థులకు అవకాశం
-కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు
-కేంద్ర ప్రభుత్వ సంస్థ సీడాక్‌లో ప్రోగ్రామ్స్

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్) కెరీర్ ఓరియెంటెడ్ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్యాట్ నోటిఫికేషన్ విడుదలైంది.
C-DAC
వివరాలు:
అత్యున్నత స్థాయిలో రిసెర్చ్, డెవలప్‌మెంట్ కోసం సీడాక్‌ను 1988లో కేంద్రం ప్రారంభించింది. దీనిలో కంప్యూటింగ్, గ్రిడ్, క్లౌడ్ కంప్యూటింగ్, మల్టిలింగ్వల్ కంప్యూటింగ్, ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్, ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ ప్రధాన కార్యక్రమాలు.
-పీజీ డిప్లొమా కోర్సులు - అర్హతలు:
-కింది కోర్సులన్నింటికి ఈ అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
-బీఈ/బీటెక్/ 4 ఏండ్ల బీఎస్సీ ఇంజినీరింగ్, ఏఎంఐఈ లేదా డీవోఈఏసీసీ బీ లెవల్ ఇన్ ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా పీజీ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ సైన్సెస్ (ఎమ్మెస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ వంటివి)
-పీజీ డిప్లొమా ఇన్ జియోఇన్ఫర్మాటిక్స్
-అర్హతలు: పైన పేర్కొన్న అర్హతలు లేదా పీజీ ఇన్ అప్లయిడ్ సైన్సెస్, జియోగ్రఫీ, జియాలజీ, ఫిజిక్స్, కంప్యుటేషనల్ సైన్సెస్, మ్యాథ్స్ లేదా సంబంధిత విభాగాల్లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-పీజీ డిప్లొమా ఇన్ మొబైల్ కంప్యూటింగ్
-అర్హతలు: పైన పేర్కొన్న అర్హతలతోపాటు పీజీ డిప్లొమా ఇన్ మ్యాథ్స్ /సంబంధిత విభాగాలు లేదా ఎంసీఏలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-పీజీ డిప్లొమా ఇన్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్
-అర్హతలు: పైన పేర్కొన్న అర్హతలతోపాటు ఏదైనా ఇంజినీరింగ్ లేదా ఎంసీఏ/ఎంసీఎం లేదా ఫిజిక్స్/కంప్యుటేషనల్ సైన్సెస్/ మ్యాథ్స్‌లో పీజీ డిగ్రీ లేదా పీజీ మేనేజ్‌మెంట్‌లో సైన్స్/ఐటీ/కంప్యూటర్ అప్లికేషన్స్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-పీజీ డిప్లొమా ఇన్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్
-అర్హతలు: పీజీలో మ్యాథ్స్/ సంబంధిత ఏరియాల్లో పీజీ/ కనీసం 55 శాతం మార్కులతో ఎంసీఏ.
-పీజీ డిప్లొమా ఇన్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్
-అర్హతలు: పీజీలో మ్యాథ్స్ లేదా తత్సమాన కోర్సు/ కనీసం 55 శాతం మార్కులతో ఎంసీఏ.
-పీజీ డిప్లొమా ఇన్ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ
-అర్హతలు: పీజీలో మ్యాథ్/ఎంసీఏలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-పీజీ డిప్లొమా ఇన్ బిగ్ డాటా అనలిటిక్స్
-అర్హతలు: ఏదైనా విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ/తత్సమాన కోర్సు. పీజీలో మ్యాథ్స్/స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, ఎంబీఏ సిస్టమ్స్ లేదా ఎంసీఏలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-పీజీ డిప్లొమా ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో ఎంసీఏ
-పీజీ డిప్లొమా ఇన్ హెచ్‌పీసీ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్
-అర్హతలు: పీజీలో మ్యాథ్స్/సంబంధిత సబ్జెక్టు లేదా ఎంసీఏలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-పీజీ డిప్లొమా ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్
-అర్హతలు: పైన పేర్కొన్న అర్హతలు
-పీజీ డిప్లొమా ఇన్ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్
-అర్హతలు: పైన పేర్కొన్న అర్హతలు
-పీజీ డిప్లొమా ఇన్ బయోమెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్
-అర్హతలు: బీఈ మెడికల్ సంబంధిత బ్రాంచీలు లేదా పైన పేర్కొన్న అర్హతలు.
నోట్: పీజీ డిప్లొమా కోర్సులకు ఎటువంటి వయోపరిమితి లేదు. 2017లో అర్హత పరీక్ష ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-సీడాక్ క్యాంపస్‌లు: హైదరాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, నాగ్‌పూర్, నాసిక్, నవీ ముంబై, న్యూఢిల్లీ, నోయిడా, పాట్నా, పుణె, తిరువనంతపురం.
-ఎంపిక: పీజీ డిప్లొమాల్లో ప్రవేశాల కోసం కంప్యూటరైజ్డ్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (సీక్యాట్) నిర్వహిస్తారు. సీక్యాట్‌ను ప్రతి ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. ఆగస్టు ఆడ్మిషన్స్ కోసం జూన్‌లో, ఫిబ్రవరి అడ్మిషన్స్ కోసం డిసెంబర్‌లో నిర్వహిస్తారు. ప్రస్తుత సీక్యాట్ ఫిబ్రవరి 2018లో ప్రవేశాల కోసం.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 30
-అడ్మిట్ కార్డులు: డిసెంబర్ 7 -14 వరకు.
-సీక్యాట్ పరీక్షతేదీ: డిసెంబర్ 10, 17
-సీక్యాట్ ఫలితాల వెల్లడి: డిసెంబర్ 28
C-DAC, Hyderabad
No.1, Shiv Bagh,
Satyam Theatre Road,
Ameerpet, Hyderabad - 500016
Phone number: 040-23737127
-వెబ్‌సైట్: https://www.cdac.in

709
Tags

More News

VIRAL NEWS

Featured Articles