ప్రాజెక్ట్ స్టాఫ్


Mon,November 13, 2017 11:49 PM

హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీఎంఈటీ)లో ప్రాజెక్ట్ స్టాఫ్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Centre-for-Materials
వివరాలు:
సీఎంఈటీ అనేది కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే సంస్థ. ప్రస్తుత పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
-ప్రాజెక్ట్ స్టాఫ్ - 3 ఖాళీలు
-అర్హతలు: బీటెక్ (కెమికల్ ఇంజినీరింగ్/మెటలర్జీ లేదా మెకానికల్ ఇంజినీరింగ్) లేదా కెమికల్ ఇంజినీరింగ్/మెటలర్జీ లేదా మెకానికల్‌లో డిప్లొమాతోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి.
-జీతం: నెలకు రూ. 16,000 + 30 శాతం హెచ్‌ఆర్‌ఏ
-ప్రాజెక్ట్ అసిస్టెంట్ - 3 ఖాళీలు
-అర్హతలు: కెమికల్ ఇంజినీరింగ్/మెటలర్జీ లేదా మెకానికల్‌లో డిప్లొమా లేదా ఐటీఐలో కెమికల్/మెటలర్జీ, ఫిట్టర్/వెల్డర్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-జీతం: నెలకు రూ. 12,000 + 30 శాతం హెచ్‌ఆర్‌ఏ
-వయస్సు: 2017, నవంబర్ 1 నాటికి 28 ఏండ్లు మించరాదు. అనుభవం ఉన్నవారికి వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 18
-వెబ్‌సైట్: http://cmet.gov.in

351
Tags

More News

VIRAL NEWS

Featured Articles