నవోదయ విద్యాలయాల్లో 683 ఖాళీలు


Mon,November 13, 2017 12:21 AM

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా హెడ్‌క్వార్టర్/రీజినల్ ఆఫీస్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
navodaya

వివరాలు:

నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ (1986) ప్రకారం
కేంద్ర ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రవేశపెట్టింది.
- మొత్తం పోస్టుల సంఖ్య: 683 (హెడ్‌క్వార్టర్-24, రీజినల్ ప్రాంతాల్లో-659) ప్రాంతాలవారీగా ఖాళీల వివరాలు
- హెడ్‌క్వార్టర్ (నోయిడా)-24 ఖాళీలు (ఆడిట్ అసిస్టెంట్-3, హిందీ ట్రాన్స్‌లేటర్-5, స్టెనోగ్రాఫర్-6, లోయర్ డివిజన్ క్లర్క్-10)
- రీజినల్ ఆఫీస్‌లలో మొత్తం పోస్టుల సంఖ్య-659
- భోపాల్-108 ఖాళీలు (ఫిమేల్ స్టాఫ్ నర్స్-23, క్యాటరింగ్ అసిస్టెంట్-3, లోయర్ డివిజన్ క్లర్క్/స్టోర్‌కీపర్-58, ల్యాబ్ అటెండెంట్-24)
- చండీగఢ్-95 ఖాళీలు (ఫిమేల్ స్టాఫ్ నర్స్-12, క్యాటరింగ్ అసిస్టెంట్-17, లోయర్ డివిజన్ క్లర్క్/స్టోర్‌కీపర్-56, ల్యాబ్ అటెండెంట్-10)
- హైదరాబాద్-67 ఖాళీలు (ఫిమేల్ స్టాఫ్ నర్స్-3, క్యాటరింగ్ అసిస్టెంట్-15, లోయర్ డివిజన్ క్లర్క్/స్టోర్‌కీపర్-41, ల్యాబ్ అటెండెంట్-8)
- జైపూర్-42 ఖాళీలు (ఫిమేల్ స్టాఫ్ నర్స్-9, క్యాటరింగ్ అసిస్టెంట్-4, లోయర్ డివిజన్ క్లర్క్/స్టోర్‌కీపర్-20, ల్యాబ్ అటెండెంట్-9)
- లక్నో-93 ఖాళీలు (ఫిమేల్ స్టాఫ్ నర్స్-15, లోయర్ డివిజన్ క్లర్క్/స్టోర్‌కీపర్-68, ల్యాబ్ అటెండెంట్-10)
- పాట్నా-95 ఖాళీలు (ఫిమేల్ స్టాఫ్ నర్స్-3, లోయర్ డివిజన్ క్లర్క్/స్టోర్‌కీపర్-87, ల్యాబ్ అటెండెంట్-5)
- పుణె-65 ఖాళీలు (ఫిమేల్ స్టాఫ్ నర్స్-10, క్యాటరింగ్ అసిస్టెంట్-6, లోయర్ డివిజన్ క్లర్క్/స్టోర్‌కీపర్-45, ల్యాబ్ అటెండెంట్-4)
-షిల్లాంగ్-94 ఖాళీలు (ఫిమేల్ స్టాఫ్ నర్స్-6, క్యాటరింగ్ అసిస్టెంట్-16, లోయర్ డివిజన్ క్లర్క్/స్టోర్‌కీపర్-65, ల్యాబ్ అటెండెంట్-7)
విద్యార్హతలు:
-ఆడిట్ అసిస్టెంట్: బీకాంలో ఉత్తీర్ణత. అకౌంట్స్ విభాగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి. 30 ఏండ్లకు మించరాదు.
-హిందీ ట్రాన్స్‌లేటర్: హిందీ/ఇంగ్లిష్‌లో మాస్టర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీతోపాటు ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా ఉండాలి. ట్రాన్స్‌లేషన్ వర్క్‌లో రెండేండ్ల అనుభవం ఉండాలి. 30 ఏండ్లకు మించరాదు.
-ఫిమేల్ స్టాఫ్ నర్స్: ఇంటర్/సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్‌తోపాటు నర్సింగ్‌లో మూడేండ్ల డిప్లొమా సర్టిఫికెట్ లేదా బీఎస్సీ (నర్సింగ్)లో ఉత్తీర్ణత.
-రెండేండ్ల అనుభవం. 35 ఏండ్లకు మించరాదు.
-స్టెనోగ్రాఫర్: ఇంటర్/సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్‌తోపాటు షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాలు/ ఇంగ్లిష్ లేదా హిందీలో నిమిషానికి 40/30 పదాల టైపింగ్ సామర్థ్యం ఉండాలి.
27 ఏండ్లకు మించరాదు.
-క్యాటరింగ్ అసిస్టెంట్: పదోతరగతి (సెకండరీ స్కూల్)లో ఉత్తీర్ణత. క్యాటరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా సర్టిఫికెట్ లేదా సీనియర్ సెకండరీ (ఇంటర్)తోపాటు హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఉత్తీర్ణత. అనుభవం ఉండాలి. 35 ఏండ్లకు మించరాదు.
-లోయర్ డివిజన్ క్లర్క్/స్టోర్‌కీపర్: ఇంటర్/సీనియర్ సెకండరీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంగ్లిష్/హిందీలో 30/25 పదాల టైపింగ్ సామర్థ్యం ఉండాలి. 27 ఏండ్లకు మించరాదు.
-ల్యాబ్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన సంస్థ నుంచి జనరల్ సైన్స్‌లో మిడిల్ పాస్ అయి ఉండాలి.
-పే స్కేల్: రూ. 9,300-34,800 + గ్రేడ్ పే రూ. 4200/- (స్టాఫ్ నర్స్‌కు గ్రేడ్ పే రూ. 4600/-)
-పే స్కేల్: రూ. 5,200-20,200 + గ్రేడ్ పే రూ. 2400/- (లోయర్ డివిజన్ క్లర్క్/స్టోర్ కీపర్‌కు గ్రేడ్ పే రూ. 1900/-)
-అప్లికేషన్ ఫీజు: ఆడిట్ అసిస్టెంట్, హిందీ ట్రాన్స్‌లేటర్, స్టాఫ్ నర్స్ పోస్టులకు రూ. 1000, మిగతా పోస్టులకు రూ. 750
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా
రాతపరీక్ష విధానం:
-ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
-మొత్తం 100 ప్రశ్నలకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
-ఈ పరీక్షకు కేటాయించిన సమయం-150 ని.
-రాతపరీక్షలో హిందీ అండ్ ఇంగ్లిష్, మెంటల్ ఎబిలిటీ/రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, సబ్జెక్టు నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ టెస్ట్, ట్రాన్స్‌లేషన్ ఇంగ్లిష్ నుంచి హిందీ, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ సైన్స్ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
-పోస్టులను బట్టి పైన పేర్కొన్న అంశాల్లోని సిలబస్ వేర్వేరుగా ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తుకు చివరితేదీ: డిసెంబర్ 13
-కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) తేదీ:
2018 జనవరి 12, 13, 14
-వెబ్‌సైట్: www.nvsnt2017.org

3565
Tags

More News

VIRAL NEWS

Featured Articles