తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ (ఎల్పీఎస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య: 17
- పోస్టు పేరు: సైంటిస్ట్/ఇంజినీర్ (ఎస్డీ)-2
- అర్హత: మెకానికల్, మెటలర్జికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్+ఎంఈ/ఎంటెక్ లేదా మెటలర్జికల్ ఇంజినీరింగ్/మెటీరియల్ సైన్స్‌లో ఇంజినీరింగ్+పీహెచ్డీ (మెటీరియల్ సైన్స్), ఇంజినీరింగ్ ఫిజిక్స్‌లో బీఈ/బీటెక్/ఎమ్మెస్సీ ఫిజిక్స్, ప్లాస్మా ఫిజిక్స్‌లో పీహెచ్డీ.
- పోస్టు పేరు: సైంటిస్ట్/ఇంజినీర్ (ఎస్సీ)-15
- అర్హత: మెకానికల్, మెటలర్జికల్, ఇండస్ట్రియల్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్+ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత.
- వయస్సు: 2017 నవంబర్ 27 నాటికి 35 ఏండ్లకు మించరాదు.
- ఎంపిక విధానం: రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా
- చివరి తేదీ: నవంబర్ 27.
- వెబ్సైట్: www.lpsc.gov.in