బీడీఎల్‌లో 52 ఖాళీలు


Fri,October 13, 2017 12:56 AM

హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
bharat-dynamics
వివరాలు:బీడీఎల్‌ను భారత రక్షణ శాఖ పరిధిలో 1970లో ఏర్పాటు చేశారు. ఇది మినీరత్న కేటగిరీ గల సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 52
విభాగాల వారీగా ఖాళీలు: -ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (పీ అండ్ ఏ)-1, కంపెనీ సెక్రటరీ-1, డిప్యూటీ జనరల్ మేనేజర్
(పీ అండ్ ఏ)-1, మేనేజర్/సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్)-2, మేనేజర్ (బిజినెస్ డెవలప్‌మెంట్)-1, మేనేజర్/డిప్యూటీ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ)-3, మేనేజర్/డిప్యూటీ మేనేజర్ (సివిల్)-2, డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఫైనాన్స్, పీ అండ్ ఏ)-19, మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆప్టిక్స్, ఫైనాన్స్, కంపెనీ సెక్రటరీ)-24 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, , ఎమ్మెస్సీ (ఫిజిక్స్, అప్లయిడ్ ఫిజిక్స్), ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, కంపెనీ సెక్రటరీ, లా, మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులు తప్ప మిగతా పోస్టులన్నింటికి అనుభవం ఉండాలి.
-పే స్కేల్: డిప్యూటీ మేనేజర్‌కు రూ. 20,600-46,500/-, మేనేజ్‌మెంట్ ట్రెయినీ
రూ. 16,400-40,500/-, మేనేజర్‌కు 24,900-50,500/-, వివిధ పోస్టులను బట్టి వేర్వేరుగా పే స్కేళ్లు ఉన్నాయి.
-వయస్సు: 2017 అక్టోబర్ 28 నాటికి డిప్యూటీ మేనేజర్‌కు 35 ఏండ్లు, మేనేజ్‌మెంట్ ట్రెయినీకి 27 ఏండ్లు (సేఫ్టీ, ఫైనాన్స్‌కు 28 ఏండ్లు), మేనేజర్‌కు 40 ఏండ్లు మించరాదు. పోస్టులను బట్టి వయోపరిమితి వేర్వేరుగా ఉన్నాయి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, బీడీఎల్ ఉద్యోగులకు ఫీజు లేదు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ, మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులకు ఆన్‌లైన్ రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులను ప్రింట్‌తీసి అవసరమైన సర్టిఫికెట్లను జతపరచి పర్సనల్ అధికారికి పంపాలి. మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు మినహాయింపు ఉంది (పంపించాల్సిన అవసరం లేదు).
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: అక్టోబర్ 14
-దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 28
-హార్డ్‌కాపీలకు చివరి తేదీ: నవంబర్ 6
-వెబ్‌సైట్: http://bdl-india.com

3247
Tags

More News

VIRAL NEWS

Featured Articles