స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్


Thu,October 12, 2017 12:20 AM

ఇండోర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
iit-indore

వివరాలు:

ఐఐటీ ఇండోర్ జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ.
- పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్
- ఈ పోస్టులను ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు కేటాయించారు.
- విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ ఇంజినీరింగ్ అండ్ మెటీరియల్ సైన్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సెంటర్ ఆఫ్ ఆస్ట్రానమీ, సెంటర్ ఆఫ్ బయోసైన్సెస్ అండ్ బయోమెడికల్ ఇంజినీరింగ్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ స్టడీస్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
- అర్హతలు: సంబంధిత అంశం/బ్రాంచీలో పీహెచ్‌డీతోపాటు మంచి అకడమిక్, రిసెర్చ్ రికార్డు కలిగి ఉండాలి. పీహెచ్‌డీ తర్వాత కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి. అనుభవం లేని వారిని మూడేండ్ల కాలపరిమితికి కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకొని తర్వాత రెగ్యులర్ చేసే అవకాశం ఉన్నది.
- పేస్కేల్: కనీస వేతనం నెలకు రూ. 30,000/- (రూ. 15,600 - 39,100)
- కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకొనే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పేబ్యాండ్ -3తో జీతం చెల్లిస్తారు.
- వయస్సు: 35 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- వెబ్‌సైట్: http://iiti.ac.in

675
Tags

More News

VIRAL NEWS

Featured Articles