న్యూక్లియర్ పవర్‌లో స్టయిఫండరీ ట్రెయినీలు


Wed,October 11, 2017 01:40 AM

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టయిఫండరీ ట్రెయినీ/టెక్నీషియన్ పోస్టుల భర్తీకి (తారాపూర్, మహారాష్ట్ర) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-న్యూక్లియర్ సంస్థలో ట్రెయినింగ్+ఉద్యోగం
-రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
-చివరితేదీ: అక్టోబర్ 25


వివరాలు:
ఎన్‌పీసీఐఎల్ అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పని చేస్తున్న సంస్థ. దీన్ని 1987, సెప్టెంబర్ 17న స్థాపించారు. అణు శక్తి విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ చేస్తున్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ .
-పోస్టు పేరు: స్టయిఫండరీ ట్రెయినీ/టెక్నీషియన్
-మొత్తం పోస్టుల సంఖ్య: 56
NPCIL

విభాగాలవారీగా ఖాళీలు:
-సైంటిఫిక్ అసిస్టెంట్ (క్యాటగిరీ -1)-5 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-సైంటిఫిక్ అసిస్టెంట్ (క్యాటగిరీ 1-హెచ్‌పీ యూనిట్)-1 పోస్టు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ ఉత్తీర్ణత.
-సైంటిఫిక్ అసిస్టెంట్ (క్యాటగిరీ 2 )-50 పోస్టులు (జనరల్-25, ఓబీసీ-25)
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతితోపాటు సంబంధిత ఐటీఐ ట్రేడ్ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానిక్, కార్పెంటర్, మాసన్, ప్లంబర్, టర్నర్, మిల్లర్)లో ఉత్తీర్ణత. పదోతరగతి స్థాయిలో సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులను చదివి ఉండాలి. సంస్థ నిబంధనలమేరకు శారరీక ప్రమాణాలు కలిగి ఉండాలి. అంటే కనీసం 160 సెం. మీ ఎత్తు, 45.50 కేజీల బరువు ఉండాలి.
-వయస్సు: 2017 అక్టోబర్ 25 నాటికి 18 నుంచి 24 ఏండ్లు, స్టయిఫండరీ ట్రెయినీ టెక్నీషియన్‌కు 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-స్టయిఫండ్ : ఏడాదిన్నర వరకు రూ. 9300/-(క్యాటగిరీ 1), మొదటి ఏడాది రూ. 6200/-, రెండో ఏడాదికి రూ. 7200/- ట్రెయినింగ్ పీరియడ్‌లో చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తయిన తర్వాత 35, 400/- (టెక్నీషియన్‌కు రూ. 21,700/-) అదనంగా డీఏ, సీడీఏ, సీఈఏ, మెడికల్ తదితర సౌకర్యాలు కల్పిస్తారు.
-ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు
-ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో నిర్ణీత నమూనా ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
చివరితేదీ: అక్టోబర్ 25
వెబ్‌సైట్: www.npcilcareers.co.in

548
Tags

More News

VIRAL NEWS

Featured Articles