ఇస్రో- ఐపీఆర్‌సీలో ఉద్యోగాలు


Wed,October 11, 2017 01:21 AM

తమిళనాడు మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (ఐపీఆర్‌సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఐపీఆర్‌సీ అనేది ప్రొపల్షన్ సిస్టమ్స్‌లో పరిశోధన, అభివృద్ధికి తమిళనాడు ప్రాంతంలో ఏర్పాటు చేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 37
-టెక్నికల్ అసిస్టెంట్-12 పోస్టులు
-అర్హత: మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజినీరింగ్‌లో ప్రథమశ్రేణిలో డిప్లొమా ఉత్తీర్ణత.
-సైంటిఫిక్ అసిస్టెంట్-1
-అర్హత: ప్రథమశ్రేణిలో బీఎస్సీ (కెమిస్ట్రీ)
-టెక్నీషియన్ (గ్రేడ్ బీ)-18 పోస్టులు
-అర్హత: ఎస్‌ఎస్‌సీతోపాటు ఐటీఐ ట్రేడ్ (ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, వెల్డర్, ఎలక్ట్రానిక్స్, ఫొటోగ్రఫీ)లో ఉత్తీర్ణత.
-డ్రాఫ్ట్స్‌మెన్ (గ్రేడ్ బీ)-1 పోస్టు
-అర్హత: ఎస్‌ఎస్‌సీతోపాటు డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్) ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
-ఫైర్‌మెన్ (గ్రేడ్ ఏ) -1 పోస్టు
-అర్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీలో ఉత్తీర్ణత.
-డ్రైవర్ కమ్ ఆపరేటర్-2 పోస్టులు
-అర్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీలో ఉత్తీర్ణత. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
-క్యాటరింగ్ అటెండెంట్-2 పోస్టులు
-వయస్సు: 2017 అక్టోబర్ 25 నాటికి డ్రాఫ్ట్స్‌మెన్, ఫైర్‌మెన్, డ్రైవర్ కమ్ ఆపరేటర్ పోస్టులకు 25 ఏండ్లు, మిగతా పోస్టులకు 35 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక : అకడమిక్ ప్రతిభ ద్వారా స్క్రీనింగ్ చేస్తారు. ఆ తర్వాత రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్‌లను నిర్వహిస్తారు.
-ఫైర్‌మెన్, డ్రైవర్ కమ్ ఆపరేటర్ పోస్టులకు రాతపరీక్షతోపాటు ఫిజికల్ టెస్ట్/ఎండ్యూరెన్స్ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: అక్టోబర్ 25
వెబ్‌సైట్: www. iprc.gov.in
IPRC

489
Tags

More News

VIRAL NEWS

Featured Articles