నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్


Wed,October 11, 2017 01:10 AM

ప్రపంచాన్ని అరచేతిలో పట్టుకొని తిరుగుతున్న నేటి యువత ఏ విషయంలోనూ రాజీపడేందుకు ఇష్టపడటంలేదు. జీవితంలో కొత్తదనాన్ని కోరుకుంటూ అందుకోసం ఎంత సాహసమైనా చేయటానికి సిద్ధం అంటున్నది. తమలోని సృజనాత్మకతకు పదును పెడుతూ అద్భుతాలు ఆవిష్కరించేందుకు పోటీ పడుతున్నది. అలాంటి వారికోసం ఓ అద్భుత అవకాశం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. ఎన్‌ఐడీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో వివరాలు నిపుణ పాఠకుల కోసం..

కొత్తదనం కోరుకునేవారి కోసం..

ఎన్‌ఐడీ దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఒకటి. పరిశోధన, పారిశ్రామికీకరణ, కమ్యూనికేషన్, టెక్స్‌టైల్, ఐటీ ఇంటిగ్రేటెడ్ డిజైన్‌లలో ఎన్‌ఐడీ అంతర్జాతీయంగా పేరుగాంచింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని స్వతంత్ర సంస్థ. ఇది అహ్మదాబాద్, బెంగళూరు, కురుక్షేత్ర, విజయవాడలలో క్యాంపస్‌లు కలిగి డిగ్రీ, పీజీ కోర్సులను అందిస్తున్నది. డిజైన్‌కు సంబంధించి అత్యంత ప్రావీణ్యత, నిపుణత కలిగినవారిని అందించాలనే ఉద్దేశంతో సారాభాయ్ కుటుంబం స్థాపించిన ఈ సంస్థ నేడు జాతీయ ప్రాముఖ్యత కలిగినదిగా ఎదిగింది. ఎన్‌ఐడీలో ప్రవేశాలకు చివరితేదీ అక్టోబర్ 31.

సంస్థ చరిత్ర

-దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్త (1950)లో జాతీయ, అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ సంస్థ ఆవిర్భవించింది. కొత్తగా ఏర్పడ్డా దేశ నిర్మాణంలో భాగంగా పాత సంప్రదాయాలను, ఆధునికతను సమతుల్యం చేస్తూ ఏర్పాటు చేసిన విద్యాసంస్థల్లో ఇది ఒకటి.
-1950లో ఇండియన్ క్రాఫ్ట్స్ ట్రెడిషన్స్‌లో భాగంగా ప్రముఖ రచయిత పీ జయకర్ ఆలోచనలతో డిజైన్‌లకు సంబంధించిన సంస్థ కోసం కసరత్తు జరిగింది. 1957లో భారత ప్రభుత్వం దేశంలో పారిశ్రామికీకరణకు తోడ్పడే సూచనలు, సలహాలు ఇవ్వమని ఫోర్డ్ ఫౌండేషన్‌ను ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా ఆయా రంగాలకు చెందిన వేలాదిమందిని కలిసిన ఫోర్డ్ ఫౌండేషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికల ఆధారంగా సారాభాయ్ కుంటుంబం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిజైన్‌ను 1961లో ప్రారంభించింది. మొదట దీన్ని స్వతంత్ర సంస్థగా అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేశారు. గౌతమ్ సారాభాయ్, గిరా సారాభాయ్‌లు దీని ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు.
NID

ఎన్‌ఐడీ అందించే కోర్సులు

-బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీడీఈఎస్)
-ఇది నాలుగేండ్ల డిగ్రీ కోర్సు. దీన్ని ఎన్‌ఐడీ అహ్మదాబాద్ క్యాంపస్ ఆఫర్ చేస్తుంది. మొత్తం 100 సీట్లు.
ఫ్యాకల్టీ ఆఫ్ కమ్యూనికేషన్ డిజైన్‌లో సీట్ల వివరాలు
-యానిమేషన్ ఫిల్మ్ డిజైన్- 15, ఎగ్జిబిషన్ డిజైన్- 10, ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్- 10, గ్రాఫిక్ డిజైన్- 15 సీట్లు ఉన్నాయి.

ఫ్యాకల్టీ ఆఫ్ ఇండస్ట్రియల్ డిజైన్‌లో

-సిరామిక్ అండ్ గ్లాస్ డిజైన్- 10 సీట్లు, ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్- 10, ప్రొడక్ట్ డిజైన్- 15 సీట్లు ఉన్నాయి.

ఫ్యాకల్టీ ఆఫ్ టెక్స్‌టైల్, అప్పెరల్, లైఫ్‌ైస్టెల్ అండ్ యాక్ససరీ డిజైన్‌లో..
-టెక్స్‌టైల్ డిజైన్- 15 సీట్లు ఉన్నాయి.

గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ డిజైన్ (జీడీపీడీ)

-ఇది నాలుగేండ్ల డిప్లొమా ప్రోగ్రామ్. దీన్ని విజయవాడ, కురుక్షేత్ర క్యాంపస్‌లు అందిస్తున్నాయి.
-ఒక్కో క్యాంపస్‌లో 60 సీట్లు ఉన్నాయి.
-జీడీపీడీలో ఇండస్ట్రియల్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, టెక్స్‌టైల్ అండ్ అప్పెరల్ డిజైన్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి.
అర్హతలు
-20 ఏండ్లలోపు వయస్సు ఉండాలి.
-10+2/ ఇంటర్ (సైన్స్, ఆర్ట్స్, కామర్స్ తదితర) కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
మాస్టర్ ఆఫ్ డిజైన్ (ఎండీఈఎస్)
-ఈ కోర్సును అహ్మదాబాద్, బెంగళూరు, గాంధీనగర్ క్యాంపస్‌లు అందిస్తున్నాయి. ఇది రెండున్నరేండ్ల కోర్సు.
-కమ్యూనికేషన్ డిజైన్‌లో 60 సీట్లు, ఇండస్ట్రియల్ డిజైన్- 80, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లో- 60, ఇంటర్ డిసిప్లినరీ డిజైన్ స్టడీస్‌లో- 30, టెక్స్‌టైల్, అప్పెరల్, లైఫ్‌ైస్టెల్ అండ్ యాక్ససరీస్ డిజైన్‌లో- 45 సీట్లు ఉన్నాయి.
--ర్హతలు: 30 ఏండ్ల లోపు ఉండాలి. 10+2 విధానంలో నాలుగేండ్ల డిగ్రీ ఉత్తీర్ణత లేదా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. 2017, జూలైలోగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా నాలుగేండ్ల కాలవ్యవధిగల డిజైన్/ఫైన్ ఆర్ట్స్ లేదా అప్లయిడ్ ఆర్ట్స్/ఆర్కిటెక్చర్‌లో ఉత్తీర్ణత.

ఎంపిక విధానం
-బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, జీడీపీడీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి రెండు దశల్లో నిర్వహించే డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా ఎంపిక చేస్తారు.
-మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులో ప్రవేశానికి ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: అక్టోబర్ 31
-డిగ్రీ, పీజీ ప్రోగ్రామ్స్‌కు సంబంధించి డీఏటీ ప్రిలిమ్స్‌ను 2018, జనవరి 7న నిర్వహిస్తారు.
-పరీక్ష కేంద్రాలు: మనకు దగ్గరలో హైదరాబాద్, విజయవాడ
-వెబ్‌సైట్: http://admissions.nid.edu

349
Tags

More News

VIRAL NEWS

Featured Articles