7883 బ్యాంకు క్లర్కులు


Wed,September 13, 2017 01:48 AM

ఉద్యోగాల కల్పతరువు బ్యాంకింగ్ రంగం. ప్రతిఏటా వేల సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తూ అభ్యర్థుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తుంది. ఇప్పటికే ఆఫీసర్లు, మేనేజ్‌మెంట్ ట్రెయినీలకు నోటిఫికేషన్స్ విడుదల చేసిన ఐబీపీఎస్.. 19 జాతీయ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 7883 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పోస్టుల వివరాలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్ ప్లాన్ నిపుణ పాఠకుల కోసం...

దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న క్లరికల్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఉమ్మడి రాతపరీక్ష (సీడబ్ల్యూఈ క్లరికల్-VII) నోటిఫికేషన్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) విడుదల చేసింది.

ఐబీపీఎస్

దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (ఎస్‌బీఐ మినహా) క్లర్క్, పీవో/మేనేజ్‌మెంట్ ట్రెయినీ, స్పెషలిస్ట్ ఆఫీసర్, ఆర్‌ఆర్‌బీ (క్లర్క్స్, ఆఫీసర్లు) పోస్టుల భర్తీకి ప్రతి ఏడాది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ప్రస్తుతం 19 జాతీయ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 7883 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (సీడబ్ల్యూఈ క్లరికల్-VII) విడుదల చేసింది. ఈ ఉమ్మడి పరీక్ష ద్వారా తెలంగాణ-344, ఏపీ-485 ఫోస్టులను భర్తీచేస్తారు. ఈ రాతపరీక్ష అనేది రెండుదశల్లో (ప్రిలిమినరీ, మెయిన్) నిర్వహిస్తారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనేకునేవారికి, కష్టపడితే బ్యాంక్ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. పదోన్నతులు పొంది ఉన్నత హోదాలను చేరుకోవచ్చు.

పాల్గొనే సంస్థలు

-అలహాబాద్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాక్ ఆఫ్ కామర్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, విజయా బ్యాంక్.

పోస్టు పేరు: క్లర్క్
-అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే నాటికి విద్యార్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
-కంప్యూటర్ పరిజ్ఞానం (ఏదైనా సంస్థ నుంచి కంప్యూటర్ సర్టిఫికెట్/డిప్లొమా, డిగ్రీ (కంప్యూటర్ ఆపరేషన్స్/ లాంగ్వేజ్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సర్టిఫికెట్) ఉండాలి.
-కేంద్రపాలిత/రాష్ట్ర స్థాయి అధికార భాషలో రాయడం, చదవడం, మాట్లాడటం రావాలి.
-వయస్సు: 2017 సెప్టెంబర్ 1 నాటికి కనిష్టంగా 20 ఏండ్ల నుంచి గరిష్ఠంగా 28 ఏండ్లకు మించరాదు. సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అనుసరించి వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు సడలింపు ఉంటుంది.
Bank

మొత్తం పోస్టులు: 7883
-ప్రకటించిన మొత్తం పోస్టుల్లో అత్యధికంగా తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో ఉన్నాయి. అత్యల్పంగా మిజోరంలో ఖాళీలు ఉన్నాయి.
-ప్రాంతాల/రాష్ర్టాల వారీగా ఖాళీలు: ఆంధ్రప్రదేశ్-485, అరుణాచల్‌ప్రదేశ్-8, అసోం-109, బీహార్-227, చండీగఢ్-34, ఛత్తీస్‌గఢ్-118, దాద్రానగర్ హవేలీ-7, డామన్ డయ్యూ-8, ఢిల్లీ-272, గోవా-41, గుజరాత్-487, హర్యానా-175, హిమాచల్‌ప్రదేశ్-73, జమ్ముకశ్మీర్-34, జార్ఖండ్-127, కర్ణాటక-554, కేరళ-217, లక్షదీవులు-2, మధ్యప్రదేశ్-290, మహారాష్ట్ర-775, మణిపూర్-11, మేఘాలయ-17, మిజోరం-3, నాగాలాండ్-12, ఒడిశా-196, పుదుచ్చేరి-46, పంజాబ్-401, రాజస్థాన్-344, సిక్కిం-11, తమిళనాడు-1277, తెలంగాణ-344,
త్రిపుర-18, ఉత్తరప్రదేశ్-665, ఉత్తరాఖండ్-78, పశ్చిమ బెంగాల్-417.

-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ. 600,
-ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ.100.
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప్రిలిమినరీ రాతపరీక్ష, మెయిన్ రాతపరీక్ష ద్వారా.
-ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులు మెయిన్ పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు.
-ప్రిలిమినరీ పరీక్ష కేవలం అర్హత పరీక్ష మాత్రమే. మెయిన్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ చేస్తారు.
-ఉమ్మడి రాతపరీక్ష స్కోర్ కార్డ్‌కు 2019 మార్చి 31 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ గడువు తేదీలోగా ఏదైనా బ్యాంకులో ఖాళీలు ఏర్పడితే ఈ ఉమ్మడి స్కోర్ కార్డుతోనే ఎంపిక చేస్తారు.
-ప్రకటించిన ఖాళీలకు అదనంగా 10 శాతం మందిని వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచుతారు. ఒకవేళ ఎంపికైన అభ్యర్థులు చేరకపోతే వీరికి అవకాశం ఇస్తారు.
-ప్రకటించిన ఖాళీలను 2018-19 ఫైనాన్షియల్ ఇయర్‌లో భాగంగా భర్తీ చేస్తారు.

ప్రిలిమినరీ ఉమ్మడి రాత పరీక్ష సిలబస్


సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు సమయం
రీజనింగ్ ఎబిలిటీ 35 35
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 35 35 60 ని.
న్యూమరికల్ ఎబిలిటీ 35 35
మొత్తం మార్కులు 100 100
-ప్రిలిమినరీ మూడు అంశాల్లోని ప్రతి సెక్షన్‌లో కనీస అర్హత మార్కులను సాధించాల్సి ఉంటుంది.
-మెయిన్ పరీక్ష ఎంపికకు కటాఫ్ మార్కులను ఐబీపీఎస్ ఖాళీల ప్రకారం కేటగిరీ చొప్పున నిర్ణయిస్తుంది.

మెయిన్ ఉమ్మడి రాత పరీక్ష సిలబస్


సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు సమయం
జనరల్/ఫైనాన్షియల్
అవేర్‌నెస్ 50 50 35ని.
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 40 35ని.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50 50ని.
రీజనింగ్ ఆప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 60 45ని.
మొత్తం 190 200 160ని.

-ఆన్‌లైన్ ఉమ్మడి రాతపరీక్ష కేవలం ఇంగ్లిష్/హిందీ లాంగ్వేజ్‌లో మాత్రమే ఉంటుంది.
-పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 1/4 లేదా 0.25 శాతం మార్కును తగ్గిస్తారు.
-రాతపరీక్ష అనేది వేర్వేరు సమయాల్లో (సెషన్లలో) నిర్వహిస్తారు. కాబట్టి నార్మలైజ్డ్ ఈక్విపర్సంటైల్ మెథడ్‌ను ఉపయోగిస్తారు.
-స్కోర్‌కార్డ్‌ను 2 దశాంశ స్థానాల వరకు పరిగణనలోనికి తీసుకుంటారు.
-మెయిన్ పరీక్షలో కనీస అర్హత స్కోర్‌ను ప్రతి సెక్షన్‌తోపాటు, టోటల్ స్కోర్‌ను సాధించాలి.
-మెయిన్ పరీక్షలో వచ్చిన మార్కులను 100 శాతం (200 మార్కులు-100 శాతం) మార్పుచేసి ఉన్న ఖాళీలకు రిజర్వేషన్ ఆధారంగా మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రిపరేషన్ ప్లాన్

-ఐబీపీఎస్ క్లరికల్ ప్రిలిమినరీ పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ నుంచి మొత్తం 100 ప్రశ్నలు వస్తాయి.
-మెయిన్ పరీక్షలో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ , క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 200 ప్రశ్నలు వస్తాయి. ప్రిపరేషన్‌పరంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అనే మూడు అంశాలు.. రెండు దశల్లో ఉన్నాయి. కాబట్టి ఈ మూడు సబ్జెక్టులను ప్రిలిమినరీలో మెయిన్ స్థాయిలో పూర్తిగా చదివినట్లయితే, మిగిలిన అంశాలను మెయిన్‌కు కేటాయించి చదివితే సరిపోతుంది. ప్రశ్నల స్థాయి మాత్రం వేర్వేరుగా ఉంటుంది.

వెయిటేజీ ఆధారంగా

-అభ్యర్థులు రెండు నెలల్లో ప్రిలిమినరీ ప్రిపరేషన్‌ను పూర్తిచేసుకోనేలా సమయ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఆయా విభాగాల్లో పలు అంశాలకు ఇస్తున్న వెయిటేజీ ఆధారంగా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. ఐబీపీఎస్ సిలబస్‌ను తీసుకున్నట్లయితే పీవో, క్లర్క్ ప్రిలిమినరీ సిలబస్ ఒక్కటే. ప్రశ్నల స్థాయిలో తేడా ఉంటుంది.

ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో

-ఇంగ్లిష్ గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్‌లను పరీక్షించే లక్ష్యంతో ఈ విభాగంలో వీటికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు.. దీనిలో ప్రధానంగా రీడింగ్ కాంప్రహెన్షన్, జంబుల్డ్ సెంటెన్సెస్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, సెంటెన్స్ కరెక్షక్షన్, సెంటెన్స్ అరేంజ్‌మెంట్, వన్‌వర్డ్ సబ్‌స్టిట్యూట్స్, ఇడియమ్స్‌పై మంచి పట్టు సాధించడానికి ప్రామాణికమైన మెటిరీయల్‌తో ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల సబ్జెక్టుపై మంచి అవగాహనతో పాటు కచ్చితత్వం కూడా వస్తుంది. అదేవిధంగా గ్రామర్‌కే పరిమితం కాకుండా, జనరల్ ఇంగ్లిష్ నైఫుణ్యాలు పెంచుకోవాలి. దీనికోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం, ఇంగ్లిష్ వార్తలు వినడం ద్వారా వాటిలో ఉపయోగిస్తున్న పదజాలం, వొకాబులరీ వంటి అంశాలపై మంచి పట్టు సాధించవచ్చు.

న్యూమరికల్ ఎబిలిటీలో...

-ఈ విభాగంలో ప్రశ్నలు సాధనతో కూడుకున్నవై ఉంటాయి. ఎక్కువ మోడల్ పేపర్ ప్రాక్టీస్‌తోనే ఈ విభాగంలో మంచి పట్టు సాధించవచ్చు. ముఖ్యంగా ఈ విభాగాన్ని అధిగమించడానికి వర్గమూలాలు, ఘనమూలాలు, ఎక్కాలు, శాతాలు బాగా ప్రాక్టీస్ చేయాలి. దీని ఫలితంగా వేగంతోపాటు కచ్చితత్వం కూడా వస్తుంది. దీనిలో కాలం- దూరం, లాభనష్టాలు, నంబర్ సిరీస్, చక్రవడ్డీ, బారువడ్డీ, పనికాలం, ప్రాబబిలిటీ, వైశాల్యాలు, సరాసరి, బాడ్‌మాస్ నియమాలపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసెస్‌పై కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే సబ్జెక్ట్‌పై ప్రావీణ్యం వస్తుంది.

రీజనింగ్‌లో

-అభ్యర్థి పరిశీలనాశక్తిని, తార్కిక విశ్లేషణ, మానసిక సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు రీజనింగ్ విభాగాన్ని ప్రవేశపెట్టారు. ఈ అంశం కూడా రెండు పరీక్షల్లో ఉంటుంది. కోడింగ్ డీ కోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, సిలాజిసమ్, సిట్టింగ్ అరేంజ్‌మెంట్, ఇన్‌పుట్ అవుట్‌పుట్, డేటా సఫిషియన్సీ, సిరీస్ కంప్లీషన్, క్లాసిఫికేషన్, అనాలజీపై ప్రశ్నలు వస్తాయి. రెండు నెలల వ్యవధిలో సిలబస్‌లోని అన్ని అంశాలపై అధ్యయనం పూర్తిచేసుకున్న తర్వాత అందుబాటులో ఉన్న సమయంలో గ్రాండ్‌టెస్ట్‌లను ప్రాక్టీస్ చేసినట్లయితే పరీక్షలో టైం మేనేజ్‌మెంట్ తెలుస్తుంది. ఏ సబ్జెక్ట్‌లో బలహీనంగా ఉన్నామో తెలుస్తుంది. దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో విషయాలు అవగతమవుతాయి.

మెయిన్స్ అదనపు విభాగాలు

-ప్రిలిమినరీ ప్రిపరేషన్‌తోపాటు మెయిన్‌లో అదనంగా ఉండే జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అంశాలను కూడా అధ్యయనం చేయాలి.

జనరల్ అవేర్‌నెస్

-జనరల్ అవేర్‌నెస్ విభాగంలో బ్యాంకింగ్ రంగ పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్ రంగంలోని అబ్రివేషన్స్, పదజాలం, బ్యాంకుల విధులు, కొత్త విధానాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కార్యకలాపాలు, కీలక వడ్డీరేట్లు, ఎస్‌ఎల్‌ఆర్, సీఆర్‌ఆర్, రెపోరేటు, రివర్స్ రెపోరేటు తదితరాలు) వంటి వాటిపై అవగాహనను పెంచుకోవాలి. దీనిలో ఆర్‌బీఐ జనరల్ అవేర్‌నెస్‌లో కరెంట్ అఫైర్స్, స్టాక్ జనరల్ నాలెడ్జ్ కోణంలోను ఆర్థిక వ్యవహారాల (ఎకనామీ, ప్రభుత్వ పథకాలు)కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఏటీఎం, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఎనీవేర్ బ్యాంకింగ్, సీబీఎస్, ఐఎంపీఎస్, ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ, మొబైల్ బ్యాంకింగ్, ఎస్‌ఎంఎస్ బ్యాంకింగ్ మొదలైన అంశాలు చదవాలి.

కంప్యూటర్ అవేర్‌నెస్

-బ్యాంకింగ్ రంగంలో కంప్యూటర్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో ఈ విషయంలో అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేసేలా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్, కంప్యూటర్ నాలెడ్జ్‌కు సంబంధించిన ఆపరేటింగ్ సిస్టం, ఇన్‌పుట్ అవుట్‌పుట్ డివైజెస్, జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్, ల్యాన్, వ్యాన్, మోడెమ్, కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అంశాలు, డెస్క్‌టాప్ అప్లికేషన్స్, కీబోర్డు షార్ట్‌కట్స్, ఇంటర్నెట్, ఈ మెయిల్, వైఫై, ఎంఎస్ వర్డ్, డేటాబేస్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.

తెలంగాణ

-రాష్ట్రంలోని బ్యాంకుల్లో మొత్తం 334 పోస్టులు (జనరల్-162, ఓబీసీ-93, ఎస్సీ-56, ఎస్టీ-33) ఖాళీగా ఉన్నాయి.

బ్యాంకులు, రిజర్వేషన్ల వారీగా వివరాలు

-ఆంధ్రాబ్యాంక్- 181 (జనరల్-88, ఓబీసీ-46, ఎస్సీ-27, ఎస్టీ-20), బ్యాంక్ ఆఫ్ బరోడా- 45 (జనరల్-23, ఓబీసీ-12, ఎస్సీ-7, ఎస్టీ-3)
-అలహాబాద్ బ్యాంక్- 5 (జనరల్-2, ఓబీసీ-1, ఎస్సీ-1, ఎస్టీ-1), బ్యాంక్ ఆఫ్ ఇండియా- 5 (జనరల్-3, ఓబీసీ-1, ఎస్సీ-1)
-కెనరా బ్యాంక్- 20 (జనరల్-9, ఓబీసీ- 5, ఎస్సీ-3, ఎస్టీ-3), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 16 (ఓబీసీ-9, ఎస్సీ-5, ఎస్టీ-2)
-కార్పొరేషన్ బ్యాంక్- 10 (జనరల్-5, ఓబీసీ-5), దేనా బ్యాంక్- 12 (జనరల్-6, ఓబీసీ-2, ఎస్సీ-2, ఎస్టీ-2)
-ఇండియన్ బ్యాంక్- 28 (జనరల్-16, ఓబీసీ-7, ఎస్సీ-4, ఎస్టీ-1), యూకో బ్యాంక్-6 (జనరల్-3, ఓబీసీ-2, ఎస్టీ1)
-యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 16 (జనరల్-7, ఓబీసీ-3, ఎస్సీ-6)

మార్పులతో మెయిన్స్

-ఈసారి నిర్వహించే మెయిన్స్‌లో ప్రశ్నలు, మార్కుల విషయంలో మార్పులు చేశారు. దీంతో అభ్యర్థులకు కొంత మంచి జరిగే అవకాశం ఉంది. గత ఐబీపీఎస్-6 క్లరికల్ మెయిన్స్ పరీక్షలో 200 ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు వాటిని 190కి తగ్గించడంతోపాటు పరీక్ష కాలవ్యవధిని 135 నిమిషాల నుంచి 160 నిమిషాలకు పెంచారు. ఇలా ప్రశ్నల సంఖ్యను తగ్గించడంతోపాటు పరీక్ష సమయాన్ని 25 నిమిషాలు పెంచారు. దీంతో టైం మేనేజ్‌మెంట్ విషయంలో అభ్యర్థులకు కొంచెం ఊరట లభిస్తుంది.
-దీంతోపాటు ఇప్పటివరకు ప్రత్యేక సెక్షన్‌గా కంప్యూటర్ నాలెడ్జ్‌ను రీజనింగ్‌లో కలిపారు. దీంతో రీజనింగ్ ప్రశ్నలకు ఎక్కువ సమయం కేటాయించవచ్చు.
-రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ విభాగం నుంచి వచ్చే 50 ప్రశ్నలకు 60 మార్కులు కావడంతో ప్రతి ప్రశ్నకు 1.2 మార్కులు అవుతుంది. దీంతో కంప్యూటర్ నాలెడ్జ్‌పై పట్టు ఉన్నవారు సులభంగా ఎక్కువ మార్కులు స్కోర్‌చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం, ఒంగోలు, కాకినాడతో సహా దేశవ్యాప్తంగా మొత్తం 218 కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్షను, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నంతోసహా మొత్తం 66 కేంద్రాల్లో మెయిన్ పరీక్షను నిర్వహిస్తారు.

షెడ్యూల్

-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 3
-ఫీజు చెల్లించడానికి చివరితేదీ: అక్టోబర్ 3
-హాల్‌టికెట్ డౌన్‌లోడింగ్ (ప్రిలిమినరీ): నవంబర్‌లో
-ప్రిలిమినరీ ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: డిసెంబర్ 2, 3, 9, 10
-ప్రిలిమినరీ రాతపరీక్ష ఫలితాలు: డిసెంబర్‌లో
-హాల్‌టికెట్ డౌన్‌లోడింగ్ (మొయిన్): 2018 జనవరిలో
-మెయిన్ ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 2018 జనవరి 21
-మెయిన్ రాతపరీక్ష ఫలితాలు: 2018 ఏప్రిల్..
-వెబ్‌సైట్: www.ibps.in

2993
Tags

More News

VIRAL NEWS

Featured Articles