కరెంట్ అఫైర్స్


Wed,September 13, 2017 01:37 AM

సాక్షర భారత్ అవార్డులు

సాక్షర భారత్ పురస్కార్ -2017 లను ప్రదానం చేశారు. రాష్ట్రంలోని వరంగల్ జిల్లా వెల్లంపల్లి పంచాయతీ సర్పంచి విజయ, రంగారెడ్డి జిల్లా గడమల్లయ్యగూడ పంచాయతీ సర్పంచి నర్ర మల్లేశ్ గ్రామ పంచాయతీ విభాగంలో సాక్షరభారత్ అవార్డులు అందుకున్నారు. రిసోర్స్ సపోర్ట్ ఆర్గనైజేషన్స్ విభాగంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జన్ శిక్షణ సంస్థాన్ అవార్డు చేజిక్కించుకున్నది.
SkacthAward

మహేశ్ భగవత్‌కు టిప్ అవార్డు

రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్‌కు 2017 ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్(టిప్) హీరో పురస్కారాన్ని యూఎస్ కాన్సుల్ జనరల్ క్యాథరీన్ హడ్డా అందజేశారు.

రాష్ట్రంలో 23 పులులు

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పులుల సంఖ్య 23. నల్లమలలో 14 ఉండగా, కవ్వాల్ టైగర్ ప్రాజెక్టులో 9 ఉన్నాయి.

రాజమౌళికి అవార్డు

ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి 2017 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని శిల్పకలా వేదికలో జరిగిన కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వర్‌రావు జాతీయ అవార్డును అందుకున్నారు.

సీతారాంకు కాళోజీ పురస్కారం

రాష్ట్ర ప్రభుత్వం అందించే కాళోజీ పురస్కారం ప్రముఖ కవి సీతారాం అందుకున్నారు. పురస్కారం కింద రూ. 1,01,116ను అందజేశారు. 2015 నుంచి సెప్టెంబర్ 9న కాళోజీ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. 2014 సెప్టెంబర్ 9న కాళోజీ శతజయంతిని నిర్వహించారు.

స్కోచ్ అవార్డులు

మాతాశిశు సంరక్షణ కోసం తెంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకానికి స్కోచ్ పురస్కారం దక్కింది. ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ, 100 శాతం బహిరంగ మల విసర్జనరహిత పట్టణం, పరిసరాల పరిరక్షణలో భాగంగా సిద్దిపేట మున్సిపాలిటీకి స్కోచ్ అవార్డు లభించింది. తెలంగాణ పౌరసరఫరాల శాఖకు కూడా స్కోచ్ అవార్డు దక్కింది.

ఏడుగురు అధికారులకు అవార్డులు

సెప్టెంబర్ 5న తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏడుగురు ఉత్తమ అధికారుల అవార్డులను స్వీకరించారు. కిషన్ (నిర్మల్), కే జనార్దన్ (నల్లగొండ), ఎం నారాయణ (నాగర్‌కర్నూల్), విజయలక్ష్మి( నిజామాబాద్), యోగేశ్వర్ (మంచిర్యాల), కే సురేందర్ (జగిత్యాల), రామారావు (ఖమ్మం).

జీహెచ్‌ఎంసీకి నేషనల్ టూరిజం అవార్డు

2015-16 సంవత్సరానికిగాను నేషనల్ టూరిజం అవార్డును గ్రేటర్ హైదరాబాద్ మున్సిల్ కార్పొరేషన్‌కు ప్రకటించారు.

హైదరాబాద్‌లో వ్యవసాయ సాంకేతిక ప్రదర్శన

సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో వ్యవసాయ సాంకేతిక ప్రదర్శన, సదస్సు జరిగింది. వ్యవసాయ, డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్‌లో బ్రిటన్‌కు చెందిన 13 కంపెనీలు పాల్గొన్నాయి.

హైదరాబాద్‌లో జీఎస్టీ సమావేశం

జీఎస్టీ కౌన్సిల్ 21వ సమావేశం హైదరాబాద్‌లో ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నాయకత్వంలో నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం 33 అంశాలను ప్రతిపాదించగా చర్చించారు.

ఆస్ట్రేలియా పర్యాటక ప్రచారకర్తగా పరిణితి

ఆస్ట్రేలియాలో పర్యాటక ప్రచారకర్తగా బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా ఎంపికయ్యారు.

భారత్, మయన్మార్ మధ్య 11 ఒప్పందాలు

భారత్, మయన్మార్ దేశాల మధ్య 11 అంశాలపై ఒప్పందాలు జరిగాయి. 2017-2020 మధ్య కాలంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, మయన్మార్ ప్రెస్ కౌన్సిల్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాల మధ్య సహకారం తదితర అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ తన మూడు రోజుల పర్యటనలో చివరిరోజు బహదూర్‌షా షాజపర్ సమాధితోపాటు 2500 ఏండ్ల క్రితం నాటి పురాతన ష్వెడగాన్ పగోడాను సందర్శించారు. ఈ పగోడాలో గౌతమ బుద్ధుడి వెంట్రుకలతోపాటు ఇతర అవశేషాలు ఉన్నాయి.
Aung-San-Suu-Kyi

అమెరికాను వణికించిన ఇర్మా

అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన పెనుతుఫాన్‌కు ఇర్మా అని పేరు పెట్టారు. ఈ హరికేన్ గాలుల వేగం గంటకు 280 కిలోమీటర్లు. వర్జిన్ దీవులు, పోర్టారికో, కరేబియన్ దీవులు ఈ హరికేన్ తాకిడికి గురయ్యాయి.

రష్యా సదస్సులో పాల్గొన్న సుష్మాస్వరాజ్

సెప్టెంబర్ 5, 6వ తేదీల్లో రష్యాలో జరిగిన ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో సుష్మాస్వరాజ్ పాల్గొన్నారు.

భారత్‌కు ఎఫ్-16 విమానాల విక్రయం

భారత్‌కు ఎఫ్-16, ఎఫ్-18 యుద్ధ విమానాలను విక్రయించడానికి అమెరికా ఆమోదం తెలిపింది. దీంతో భారత్... ఇండో పసిఫిక్ రీజియన్‌లో అత్యంత శక్తిమంతమైన దేశంగా మారనున్నది. 2006లో45 బిలియన్ డాలర్లు ఉన్న అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధం 2016 నాటికి 114 బిలియన్ డాలర్లకు చేరుకున్నది.

మెక్సికోలో భూకంపం

సెప్టెంబర్ 8న మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 8.2గా నమోదైంది. 1985లో 8.0 తీవ్రత తర్వాత అంత భారీస్థాయిలో ఇక్కడ భూకంపం సంభవించడం ఇదే తొలిసారి.

2040 నాటి చమురు ఉత్పత్తి నిలిపివేత

పారిస్ వాతావరణ ఒప్పందానికి అనుగుణంగా 2040 నాటికి ఫ్రాన్స్ చమురు, సహజ వాయువుల ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించింది.

అమెరికాలో హబీబ్ బ్యాంక్ మూసివేత

పాకిస్థాన్‌లోని కరాచీ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న హబీబ్ బ్యాంక్ లిమెట్‌డ్(హెచ్‌బీఎల్) న్యూయార్క్ శాఖను మూసివేయాల్సిందిగా అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

విమానయాన వృద్ధిలో భారత్‌కు రెండో స్థానం

విమానయాన వృద్ధిలో భారత్‌కు రెండోస్థానం దక్కింది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ ఇచ్చిన ర్యాంకులో చైనా అగ్రస్థానంలో నిలిచింది.
air-india

2020 నాటికి తట్టు రహిత దేశంగా భారత్

భారత్‌తోపాటు ఆగ్నేయాసియాలోని మరో నాలుగు దేశాల(బంగ్లాదేశ్, మయన్మార్, తైమూర్, ఇండోనేషియా)ను 2020 నాటికి తట్టు (మీసెల్స్) రహిత ప్రాంతాలుగా మార్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లక్ష్యంగా నిర్దేశించుకున్నది.

పీటీఐ చైర్మన్‌గా వివేక్

ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా తదుపరి చైర్మన్‌గా ఎక్స్‌ప్రెస్ గ్రూప్ చైర్మన్, ఎండీ వివేక్ గోయంక నియామకమయ్యారు. వైస్ చైర్మన్‌గా ది హిందూ మాజీ ఎడిటర్ ఎస్ రవి ఎన్నికయ్యారు.

భారత్, శ్రీలంక సైనిక విన్యాసాలు

సెప్టెంబర్ 7న విశాఖ తీరంలో భారత్, శ్రీలంకలు సంయుక్తంగా సాగరిక ఘోష్ పేరిట సైనిక విన్యాసాలు నిర్వహించాయి.

బ్లూవేల్ గేమ్‌పై నిషేధం

చిన్నారులు, యువత ప్రాణాలను బలిగొంటున్న బ్లూవేల్ గేమ్‌పై గుజరాత్, తమిళనాడు ప్రభుత్వాలు నిషేధం విధించాయి.

జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య

సెప్టెంబర్ 5న ప్రముఖ జర్నలిస్టు, గౌరీ లంకేశ్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేశ్‌ను బెంగళూరులో దుండగులు హత్య చేశారు.

యూఎస్ ఓపెన్

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను స్లొనే స్టీఫెన్స్ కైవసం చేసుకున్నది. ఫైనల్‌లో మాడిసన్‌పై... స్టీఫెన్స్ 6-3, 6-0 తేడాతో విజయం సాధించి రూ. 23 కోట్ల ఫ్రైజ్‌మనీ గెలుచుకున్నది. యూఎస్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో నాదల్ విజయం సాధించారు. రన్నరప్‌గా అండర్సన్ నిలిచారు.
Nadhal

వరుణ్, రాహుల్‌కు స్వర్ణాలు

కామన్‌వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ టోర్నీలో రాణాల వరుణ్, వెంకట్ రాహుల్‌లు స్వర్ణాలు సాధించారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న పోటీల్లో రాహుల్ (85కిలోలు) సీనియర్, జూనియర్ విభాగాల్లో స్వర్ణాలు సాధిస్తే, వరుణ్ యూత్ విభాగంలో పసిడి పతకం చేజిక్కించుకున్నాడు.

భారత్‌లో కామన్‌వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ టోర్నీ

2019 కామన్‌వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ టోర్నీ భారతదేశంలో నిర్వహించనున్నారు.

లోకేశ్, సాత్విక్‌లకు డబుల్స్ టైటిల్

జాతీయ బ్యాడ్మింటన్ సబ్ జూనియర్ ర్యాంకింగ్ టోర్నీలో అండర్-19 బాలుర డబుల్స్ టైటిల్‌ను లోక్‌శ్‌రెడ్డి, సాత్విక్‌రెడ్డిలు గెలుచుకున్నారు.

సోనమ్, అన్షుకు స్వర్ణాలు

ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో సోనమ్ మాలిక్, అన్షు స్వర్ణ పతకాలు గెలిచారు.

భారత్‌కు ఐదు స్వర్ణాలు

కామన్‌వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఐదు స్వర్ణాలు, రజత పతకం లభించింది.

హాకీ కోచ్‌గా మారీన్

భారత పురషుల జట్టు హకీ కోచ్‌గా షార్డ్ మారీన్‌ను నియమించారు.

1282
Tags

More News

VIRAL NEWS

Featured Articles