కరీంనగర్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ


Wed,September 13, 2017 01:18 AM

- 8, 10, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ అభ్యర్థులు అర్హులు
- రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులకు అవకాశం
- మంచి జీతభత్యాలు, ప్రత్యేక అలవెన్స్‌లు

కరీంనగర్‌లో నవంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించే సైనిక నియామక ర్యాలీ నోటిఫికేషన్ విడుదలైంది.
ARMY-_RALLY_

వివరాలు:

ఈ నియామక ర్యాలీని చెన్నైలోని హెడ్‌క్వార్టర్స్ రిక్రూటింగ్ జోన్ నిర్వహిస్తుంది. కరీంనగర్‌లోని డా. బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో ఈ ర్యాలీ జరుగుతుంది. రాష్ట్రంలోని 31 జిల్లాలకు (10 పాత జిల్లాల ప్రకారం) చెందిన అభ్యర్థులు పాల్గొనవచ్చు.
పోస్టులు - అర్హతలు:
- సోల్జర్ టెక్నికల్
- విద్యార్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్/తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ సబ్జెక్టులు చదివి ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
- సోల్జర్ టెక్నికల్
(ఏవియేషన్ అండ్ అమ్యునిషన్ ఎగ్జామినర్):
- శారీరక ప్రమాణాలు: కనీసం 165 సెం.మీ. ఎత్తు ఉండాలి. బరువు 50 కేజీలు. ఛాతీ 77 సెం.మీ., గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి.
- విద్యార్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్/తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ సబ్జెక్టులు చదివి ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
లేదా
- బీఎస్సీ (బాటనీ/జువాలజీ, బయోసైన్స్), ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఉత్తీర్ణత. ఇంటర్ బైపీసీ చదివి ఉండాలి.
సోల్జర్ జనరల్ డ్యూటీ:
- శారీరక ప్రమాణాలు: కనీస ఎత్తు 166 సెం.మీ., బరువు - 50 కేజీలు., ఛాతీ కనీసం 77 సెం.మీ., గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి.
- విద్యార్హతలు: పదోతరగతిలో అన్ని సబ్జెక్టుల్లో కనీసం 33 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు ఓవరాల్‌గా 45 శాతం/4.75 పాయింట్లతో ఉత్తీర్ణత. అయితే ఇంటర్/డిగ్రీ వంటి ఉన్నత విద్యార్హత కలిగి ఉన్నవారికి ఉత్తీర్ణతా శాతం/గ్రేడ్‌లతో సంబంధం లేదు.
సోల్జర్ ట్రేడ్స్‌మ్యాన్:
- శారీరక ప్రమాణాలు: కనీస ఎత్తు 166 సెం.మీ, బరువు కనీసం 48 కేజీలు, ఛాతీ 76 సెం.మీ. ఉండాలి. గాలిపీల్చినప్పుడు 5 సెం.మీ. వ్యాకోచించాలి.
- విద్యార్హతలు: హౌస్ కీపర్, మెస్ కీపర్ పోస్టులకు 8వ తరగతి ఉత్తీర్ణత.
- చెఫ్, వాషర్‌మ్యాన్, డ్రెస్సర్, స్టీవార్డ్, టైలర్, ఆర్టిజియన్ (ఉడ్‌వర్క్), ఆర్టీజియన్ (మెటలర్జీ), సపోర్ట్ స్టాఫ్ (ఈఆర్), ఆర్టీజియన్ (కన్‌స్ట్రక్షన్) ఇతర అన్ని ట్రేడులకు పదోతరగతి ఉత్తీర్ణత లేదా సంబంధిత ట్రేడుల్లో ఉత్తీర్ణత.
సోల్జర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్:
- శారీరక ప్రమాణాలు: కనీస ఎత్తు 162 సెం.మీ., బరువు 50 కేజీలు. ఛాతీ 77 సెం.మీ., గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి.
- విద్యార్హతలు: ఇంటర్‌లో ప్రతి సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతోపాటు అన్ని సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. దీంతోపాటు ఇంటర్/పదోతరగతిలో మ్యాథ్స్ లేదా అకౌంట్స్/బుక్ కీపింగ్ సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
నోట్: అభ్యర్థులు డిగ్రీ లేదా ఉన్నత విద్యార్హతలు కలిగి ఉన్నా 12వ తరగతిలోని మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకొంటారు.
నోట్: పై పోస్టుల్లో పదోతరగతి జీపీఏ/గ్రేడ్ పద్ధతిలో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థి సంబంధిత బోర్డు మార్కుల షీట్‌ను తప్పనిసరిగా తేవాలి.
వయస్సు:
- సోల్జర్ టెక్నికల్ (ఏవియేషన్ అండ్ అమ్యునిషన్ ఎగ్జామినర్), సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ పోస్టులకు - 17 సంవత్సరాల 6 నెలల నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి.
- సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ క్లర్క్, సోల్జర్ స్టోర్ కీపర్ టెక్నికల్, సోల్జర్ ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులకు - 17 సంవత్సరాల 6 నెలల నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి.
నోట్: అవివాహిత అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం:
- ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ): 1.6 కి.మీ. దూరాన్ని జీపీ-1వారు 5 నిమిషాల 30 సెకండ్లలోపు. జీపీ 2 వారు 5 నిమిషాల 31 సెకండ్ల నుంచి 5 నిమిషాల 45 సెకండ్లలోగా చేరుకోవాలి.
- 9 అడుగుల డిచ్ జంప్, కనీసం 6 పుల్‌అప్స్/ బస్కీలు. బ్యాలెన్సింగ్ బీమ్.
- ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ): ఆయా పోస్టులకు పైన తెలిపిన శారీరక ప్రమాణాలు
- వైద్యపరీక్షలు : ర్యాలీలో పాల్గొన్న అభ్యర్థుల్లో ఎంపికైన వారికి సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహిస్తారు.
- కామన్ ఎంట్రెన్స్ టెస్ట్: ర్యాలీలో, సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రిలో వైద్యపరీక్షల్లో అర్హత సాధించిన అందరికీ సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ అధికారి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. పరీక్ష తేదీలను తర్వాత తెలియజేస్తారు.
ర్యాలీకి తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్స్:
- అర్హత పరీక్షలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకెళ్లాలి.
- సర్టిఫికెట్స్‌ను ల్యామినేట్ చేసి, వరుసక్రమంలో ఫైల్ చేసుకొని రావాలి.
- ఒక సెట్ జిరాక్స్ కాపీలను గెజిటెడ్ అధికారి (స్టాంప్ ఇంగ్లిష్‌లో ఉండాలి)తో అటెస్ట్ చేయించి తీసుకొనిరావాలి.
- పదోతరగతి మార్కులషీట్, ఇంటర్ మార్కుల షీట్, సర్టిఫికెట్, డిగ్రీ మార్కుల షీట్, సర్టిఫికెట్. స్థానికత, కమ్యూనిటీ, కులం, పుట్టినతేదీ ధృవీకరణ పత్రాలు (ఈ సర్టిఫికెట్స్ కొత్త జిల్లాల ప్రకారం), చివరగా చదివిన విద్యాసంస్థ నుంచి ఆరునెలలలోపు తీసుకొన్న స్టడీ కండక్ట్ సర్టిఫికెట్, గ్రామ సర్పంచ్/ వీఏవో నుంచి క్యారెక్టర్ సర్టిఫికెట్ (ఇంగ్లిష్‌లో), ఎన్‌సీసీ, క్రీడలు, ఐటీఐ, కంప్యూటర్‌కు సంబంధించి ఏమైనా అర్హతలు ఉన్న సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు/ఆధార్ నంబర్.
- పే, అలవెన్స్, ఇతర సౌకర్యాలు: ఉద్యోగానికి ఎంపికైన వారికి 7వ పే కమిషన్ అనుసరించి నెలకు రూ. 30,000/- మూలవేతనం, ఉచిత రేషన్, దుస్తులు, వైద్య, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. గ్రూప్ ఇన్సూరెన్స్, ఏడాదికి 30 రోజుల క్యాజువల్ లీవులు తదితర సౌకర్యాలు కల్పిస్తారు.
- పదోన్నతి: సిపాయి నుంచి అధికారి/ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ స్థాయి వరకు పదోన్నతి పొందవచ్చు.
- రిజిస్ట్రేషన్/దరఖాస్తు: ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16లోగా చేసుకోవాలి.
- అడ్మిట్ కార్డ్: అక్టోబర్ 16 నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డును ర్యాలీకి తప్పనిసరిగా తీసుకొనిరావాలి.
- రిక్రూట్‌మెంట్ ప్రోగ్రామ్: అడ్మిట్ కార్డులో సర్టిఫికెట్స్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించే వివరాలు పేర్కొంటారు. నవంబర్ 2న ర్యాలీ నిర్వహించే స్థలం వద్ద ప్రాథమిక వైద్యపరీక్షలు నిర్వహిస్తారు.
- ర్యాలీ నిర్వహించే తేదీలు: నవంబర 1 నుంచి నవంబర్ 10 వరకు
స్థలం: డా. బిఆర్ అంబేద్కర్ స్టేడియం, కరీంనగర్.
వివరాల కోసం సికింద్రాబాద్, సైనిక నియామక కార్యాలయం ఫోన్ నంబర్ 040-27740059లో కార్యాలయం పనిచేసే వేళల్లో సంప్రదించవచ్చు.
- వెబ్‌సైట్: http://joinindianarmy.nic.in

- ఆన్‌లైన్‌లో 10 పాతజిల్లాల ప్రకారం దరఖాస్తు చేసుకొన్నప్పటికీ సర్టిఫికెట్స్ మాత్రం కొత్త 31 జిల్లాల ప్రకారం తీసుకొనిరావాలి.

894
Tags

More News

VIRAL NEWS

Featured Articles