జిప్‌మర్‌లో పీజీ కోర్సులు


Wed,September 13, 2017 01:11 AM

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్‌మర్) 2018 జనవరి సెషన్‌కు వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
JIPMER

వివరాలు:

భారత ప్రభుత్వ పరిధిలోని సంస్థ ఇది.
- కోర్సు పేరు: ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు పీజీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
- ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
- రాతపరీక్షలో 250 ప్రశ్నలను ఇస్తారు. గరిష్ట మార్కులు 1000
- ప్రతి ప్రశ్నకు 4 మార్కులు, నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు.
- అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులు
రూ. 1500/- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు-రూ.1200/-
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 20
- ఆన్‌లైన్ రాతపరీక్ష: నవంబర్ 19
- వెబ్‌సైట్: www.jipmer.edu.in

228
Tags

More News

VIRAL NEWS

Featured Articles