ఎయిమ్స్‌లో పీజీ ప్రవేశాలు


Wed,September 13, 2017 01:09 AM

AIIMS
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సంస్థల్లో ఎండీ/ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం, ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి న్యూఢిల్లీలోని ఎయిమ్స్ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:

ఎయిమ్స్‌ను మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో వైద్య కళాశాల, వైద్య పరిశోధన చేయడానికి 1956లో స్థాపించారు
- పరీక్ష పేరు: పోస్టు గ్రాడ్యుయేట్
- కోర్సు పేరు: ఎండీ/ఎంఎస్, ఎంసీహెచ్ (ఆరేండ్లు), డీఎం (ఆరేండ్లు)/ఎండీఎస్
- దేశవ్యాప్తంగా మొత్తం ఏడు ప్రతిష్ఠాత్మకమైన సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ అడ్మిషన్లు న్యూఢిల్లీ, భోపాల్, భువనేశ్వర్, జోధ్‌పూర్, రిషికేష్ క్యాంపస్‌లలో ఏదైనా ఒకదానిలో ప్రవేశం కల్పిస్తారు.
- అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత. ఇంటర్న్‌షిప్‌తోపాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులు
రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 800/-
- ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష
- పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా
- దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 3
- వెబ్‌సైట్: www.aiimsexams.org

202
Tags

More News

VIRAL NEWS

Featured Articles