తెలంగాణలో గిరిజన తెగలు


Thu,September 7, 2017 12:04 AM

chattisgarh

గోండులు

- గోండులు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీసగఢ్ రాష్ర్టాల్లో ఎక్కువగా జీవిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా నివసిస్తారు.
- గోండులు తమకు తాము కోయ్‌తుర్ లేదా కోయ్‌గా అని గోండిభాషలో పిలుచుకుంటారు.
- ధుర్ లేదా ధర్వే అని పిలిచే సంఖ్యాపరంగా పెద్దగా ప్రాధాన్యత లేని గోండులు కూడా ఉన్నారు. వీరికి తక్కువ సామాజిక హోదా ఇచ్చారు. వీరు రాజ్‌గోండులతో వివాహ సంబంధాలను పెట్టుకోరు.
- మహారాష్ట్రలోని చందా నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్ వరకు ప్రముఖ రాజ్య వంశాలు పరిపాలించాయి. వీరినే రాజ్‌గోండ్‌లు అని వ్యవహరిస్తారు.
- గోండులలో మరియాలు, కొండమరియాలు, భిషోమార్ మరియాలు అనే మూడు ఉపతెగలు కూడా ఉన్నాయి. గోండులు స్థిర వ్యవసాయం చేస్తారు.
- గోండులు నాగదేవతను, పెర్సిపెన్ అనే దేవతను ఎక్కువగా ఆరాధిస్తారు. ఎద్దు కొమ్ములను అలంకారంగా ధరిస్తారు.
- ప్రధాన్‌లను గోండుల వారసత్వ కళాకారులుగా భావించవచ్చు. గోండులు, కోలామ్‌ల కంటే ఉన్నతమైన సామాజిక హోదాను నాయక్‌పోడులు ప్రకటించుకున్నారు.
- గోండులు ప్రధాన పండుగ దండారీ. నృత్యాలు, పాటల మధ్యలో చిన్నచిన్న హాస్యనాటికలతో ఖేల్ అనే నాటికలను ప్రదర్శిస్తారు.
- గుమేలా, పార, వెలె లేక పార, డోల్, డప్పు, పెప్రె, కాలికోం, కింగ్రి ప్రధాన వాయిద్యాలు.

ప్రధాన్‌లు

- ఆదిలాబాద్ జిల్లాలో నివసించే ముఖ్యమైన గిరిజన తెగ ప్రధాన్.
- ప్రధాన్ అనే తెగవారు గోండుల ఇతిహాసాలను, జానపదాలను పాడి వినిపించే సంప్రదాయ కళాకారులు. వీరి ప్రధాన వృత్తి గోండుల ధర్మ సంస్కృతిని ప్రచారం చేయడం.
- ప్రధాన్‌లు భాషాపరంగా మరాఠీ మాట్లాడుతారు. కానీ, మాతృభాష గోండి.
- ప్రధాన్‌లలో శిశువు పుట్టిన మూడు రోజులకు ఆడవారి కోసం పుట్టి సభ ఏర్పాటు చేస్తారు.
- ఈ సభకు ముత్తయిదువలు వచ్చి నువ్వులు, బెల్లంతో తయారు చేసిన ఎంజూర్ అనే పదార్థాన్ని పంచి పెడుతారు.
- పెద్దలు కుదిర్చిన వివాహాలతోపాటు వధువును ఎత్తుకొని వెళ్లడం (ధరున్‌టాక్‌న), వధువుకు వరుడు నచ్చితే వరుడి ఇంటికి వెళ్తుంది (శివార్ దాసచ), ఇల్లరికం (ఘర్‌జావై) వంటి పద్ధతులు ఉన్నాయి. వరకట్న సంస్కృతి లేదు.
- వీరి ప్రధాన పండుగలు ధురాడి (హోలీ), మాండావుస్ (ఉగాది), చైత్‌బీంగా మర్మింగ్, ఆకాడి, జామూర్ అవుస్, నాగ పంచమి, పోరా, బడీగా, దసరా, దీపావళి

కొండరెడ్లు

- తెలంగాణలో ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో గల కొండలపైన అధికంగా నివసిస్తారు. అందుకే వీరికి కొండరెడ్లు అనే పేరు వచ్చింది. వీరిని హిల్ రెడ్లు, రాచరెడ్లు, పాండవరెడ్లు అని కూడా పిలుస్తారు.
- ఖమ్మం జిల్లా ఆశ్వారావుపేట మండలంలోని కొండరెడ్ల గ్రామాలు కవాడిగుండ్ల, గోగులపుడి, కన్నాయిగూడెం, బండారిగూడెం, గాండ్లగూడెం.
- వీరు సమతల ప్రాంతాల్లో నివసిస్తూ కొండపైకి వెళ్లి పోడు వ్యవసాయం చేస్తారు. చేపల వేటకు వెళ్తారు.
- వీరి మధ్య తగాదాలు ఏర్పడితే తీర్మానాలకు జాతిపెద్ద ఉంటారు. వీరి నిర్ణయాన్ని అందరూ సమ్మతించి మెలగుతారు.
- బిడ్డ పుట్టిన తర్వాత తల్లిని ప్రత్యేకమైన గదిలో ఉంచుతారు. బాలింతలను 21 రోజులు వేరే ఇంట్లో ఉంచుతారు. దీనినే కీడుపాక అంటారు.
- కొండరెడ్లలో బహుభార్య విధానం అమలులో ఉంది. మృతిచెందిన సోదరుడి భార్యను వివాహం చేసుకుంటారు.
- వీరి మాతృభాష తెలుగు. వీరిది పితృస్వామిక వ్యవస్థ.
- కొండరెడ్లు మామడికాయకోత, భూదేవి, రాజుల, టెంక పండుగలను పూర్వం వేర్వేరుగా ప్రత్యేకమైన రోజుల్లో జరుపుకొనేవారు. కానీ, ప్రస్తుతం ఈ పండుగలన్నింటినీ వరుసగా మామిడికాయకోత పండుగను సోమవారం, దేవర్ల పండుగను మంగళవారం, భూదేవి పండుగలను బుధవారం జరుపుకొంటారు. వీరి మాతృభాష తెలుగు. పితృస్వామిక వ్యవస్థ. వీరు పోడు వ్యవసాయం చేస్తారు.

2821
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles