జామ్ - 2018 (జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎమ్మెస్సీ)


Wed,September 6, 2017 02:54 AM

దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ - పీహెచ్‌డీ, డ్యూయల్ డిగ్రీ చేయాలనుకునేవారికి అపూర్వ అవకాశం. జాతీయస్థాయిలో నిర్వహించే ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా ఐఐటీలు, ఐఐఎస్సీల్లో ప్రవేశాలుకల్పిస్తారు. దీనికి సంబంధించి జామ్ - 2018 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వివరాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం....

-ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ముఖ్యమైన విభాగాల్లో రిసెర్చ్‌లో నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఐఐఎస్సీ, ఐఐటీల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులను ప్రారంభించారు. వీటిలో ప్రవేశాల కోసం నిర్వహించే టెస్ట్ జామ్.
-ఈ ఎంట్రెన్స్ టెస్ట్‌ను 2004 నుంచి ప్రారంభించారు. దీనిద్వారా ఎమ్మెస్సీ (నాలుగు సెమిస్టర్లు), ఎమ్మెస్సీ - పీహెచ్‌డీ, డ్యూయల్ డిగ్రీ తదితర ప్రోగ్రామ్స్‌ను ఐఐటీల్లో, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీని ఐఐఎస్సీలో అందిస్తారు.
-ప్రపంచస్థాయిలో నాణ్యమైన విద్య కోసం రూపొందించిన కరికులమ్‌తో ఈ ప్రోగ్రామ్స్‌ను రూపొందించారు.

జామ్‌లో భాగస్వామ్య విద్యాసంస్థలు

-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - భువనేశ్వర్, బాంబే, ఢిల్లీ, ధన్‌బాద్, గాంధీనగర్, గువాహటి, హైదరాబాద్, ఇండోర్, జోధ్‌పూర్, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, పాట్నా, రూర్కీ, రోపర్‌తోపాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ).

జామ్‌లో ఎన్ని టెస్ట్ పేపర్లు ఉంటాయి?

-మొత్తం ఏడు రకాల టెస్ట్ పేపర్లు ఉంటాయి. అవి.. బయలాజికల్ సైన్సెస్ (బీఎల్), బయోటెక్నాలజీ (బీఎల్), కెమిస్ట్రీ (సీవై), జియాలజీ (జీజీ), మ్యాథమెటిక్స్ (ఎంఏ), మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ (ఎంఎస్), ఫిజిక్స్ (పీహెచ్).
-పరీక్ష ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు.
-బీటీ, సీవై, జీజీ, ఎంఎస్ పరీక్షలను ఉదయం 9 - 12 గంటల వరకు నిర్వహిస్తారు.
-బీఎల్, ఎంఏ, పీహెచ్ టెస్ట్‌ను మధ్యాహ్నం 2 - 5 గంటల మధ్య నిర్వహిస్తారు.
-అభ్యర్థులు ఒకటి లేదా రెండు టెస్ట్ పేపర్లు రాసుకోవచ్చు.
Facebook

పరీక్ష కేంద్రాలు
-హైదరాబాద్, వరంగల్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, ధన్‌బాద్, గోవా, మధురై, మంగళూరు, ముంబై, తిరునల్వే, విజయవాడ, విశాఖపట్నంతోపాటు దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లో సెంటర్లు ఉన్నాయి.

అర్హతలు
-కనీసం 55 శాతం మార్కులతో (అన్ని సబ్జెక్టులు, లాంగ్వేజెస్‌తో సహా)
-సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.
-ఆయా కోర్సులకు డిగ్రీతోపాటు ఆయా సంస్థలు నిర్దేశించిన మరికొన్ని అర్హతలను కలిగి ఉండాలి. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: అక్టోబర్ 10
-ఫీజు చెల్లించడానికి చివరితేదీ: అక్టోబర్ 10
-పరీక్షతేదీ: 2018, ఫిబ్రవరి 11
-ఫలితాల వెల్లడి: 2018, మార్చి 20,
-వెబ్‌సైట్: http://jam.iitb.ac.in

జామ్‌ను ఈ ఏడాది ఐఐటీ బాంబే నిర్వహిస్తుంది. జామ్‌కు సంబంధించిన వివరాలు, సమాచారం కోసం చైర్‌పర్సన్, జామ్ -2018, గేట్- జామ్ ఆఫీసర్, ఐఐటీ బాంబే, పొవాయ్, ముంబై -76లో
సంప్రదించవచ్చు.

1029
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles