బ్రిక్స్ కూటమి


Tue,September 5, 2017 01:50 AM

mediajak
- బ్రిక్ అనే పదాన్ని తొలిసారిగా గోల్డ్‌మన్, సచ్చ్ అనే ఆర్థికవేత్తలు ఉపయోగించారు.
- బ్రిక్ కూటమి 2032 నాటికి జీ-8 కూటమిని అధిగమిస్తుందని అంచనా.
- బ్రిక్ స్థాపించిన సంవత్సరం-2009
- సభ్యదేశాలు ఐదు- బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా
- బ్రిక్స్ అనేది ఈ ఐదు దేశాల సంయుక్త కూటమి. ఈ కూటమి మొదట బ్రిక్‌గా ఏర్పడింది.
- 2010లో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్ కూటమిగా రూపాంతరం చెందింది.
- బ్రిక్స్ కూటమి అంతర్జాతీయ స్వతంత్ర సమాఖ్య..

- లక్ష్యం: బ్రిక్స్ దేశాల మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, వైజ్ఞానిక తదితర రంగాల్లో పరస్పర సహాయ సహకారాలను ప్రోత్సహించడం.
- బ్రిక్ మొదటి సమావేశం 2009 జూన్‌లో రష్యాలోని యెకటేరిన్ బర్గ్‌లో జరిగింది.
- రెండో సమావేశం బ్రెజిల్ రాజధాని బ్రెసిలియాలో 2010 ఏప్రిల్‌లో జరిగింది. ఈ సమావేశంలో దక్షిణాఫ్రికా చేరడంతో బ్రిక్ కాస్తా బ్రిక్స్‌గా రూపాంతరం చెందింది.
- మూడో సమావేశం చైనాలోని సన్యాలో 2011 ఏప్రిల్‌లో జరిగింది.
- నాలుగో సమావేశం న్యూఢిల్లీలో 2012 మార్చిలో జరిగింది.
- ఐదో సమావేశం దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో 2013 మార్చిలో జరిగింది.
- ఆరో సమావేశం బ్రెజిల్‌లోని ఫోర్ట్‌లెజాలో 2014 జూలైలో జరిగింది. ఈ సమావేశంలో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్నారు.
- ఏడో సమావేశం రష్యాలోని ఉఫాలో 2015 జూలైలో జరిగింది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లకు ప్రత్యామ్నాయంగా న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు, కంటింజెన్సీ రిజర్వులను ఏర్పాటు చేశారు.

- ఎనిమిదో సమావేశం గోవాలో 2016 అక్టోబర్‌లో జరిగింది.
- తొమ్మిదో సమావేశం చైనాలోని జియోమెన్ నగరంలో 2017 సెప్టెంబర్‌లో జరిగింది.
- బ్రెజిల్ అధ్యక్షుడు - మైఖెల్ టెమర్
- రష్యా అధ్యక్షుడు - వ్లాదిమిర్ పుతిన్
- ఇండియా ప్రధాని- నరేంద్రమోదీ
- చైనా అధ్యక్షుడు - జీ జిన్ పింగ్
- దక్షిణాఫ్రికా అధ్యక్షుడు- జాకబ్ జుమా

ప్రత్యేక ఆహ్వాన దేశాలు

- ఈజిప్టు, కెన్యా, తజకిస్థాన్, మెక్సికో, థాయ్‌లాండ్
- ప్రస్తుతం ప్రపంచంలోనే ఆర్థికంగా, వైశాల్యపరంగా అత్యంత శక్తిమంతమైన కూటమి బ్రిక్స్.
- ఈ సదస్సు థీమ్: ఉజ్వల భవిష్యత్తు కోసం బలమైన భాగస్వామ్యం

గ్రూప్-5

- స్థాపించిన సంవత్సరం: 2005
- సభ్యదేశాలు ఐదు (బ్రెజిల్, చైనా, ఇండియా, మెక్సికో, దక్షిణాఫ్రికా)
- అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహాయ సహకారాలు పెంపొందించడానికి, అంతర్జాతీయ పాలన, ఆర్థిక సుస్థిరత సాధించడానికి జీ-5ను ఏర్పాటు చేశారు.
- 2007 నుంచి జీ-8 వార్షిక సమావేశాలకు జీ-5ను కూడా ఆహ్వానిస్తున్నారు.
- గ్రూప్- 8+5ను 2005లో ప్రారంభించారు.
- 2014 మార్చిలో రష్యాను తొలగించారు.
- ప్రస్తుతం గ్రూప్ 7+5గా ఉన్నది.

గ్రూప్-8 (జీ-8)

- ఏర్పాటైన సంవత్సరం: 1975
- పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల సమూహం
- 1975: జీ-6 యూఎస్‌ఏ, యూకే, పశ్చిమ జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ
- 1976: జీ-7 కెనడా చేరిక
- 1997: జీ-8 రష్యా చేరిక
- సభ్యదేశాలు-8 (ప్రస్తుతం-7): 1. యూఎస్‌ఏ 2. కెనడా 3. జర్మనీ 4. ఇటలీ, 5. రష్యా 6. బ్రిటన్ 7. ఫ్రాన్స్ 8. రష్యా
- 2014లో రష్యాను సస్పెండ్ చేయడంతో ప్రస్తుతం ఈ కూటమిని జీ-7గా పిలుస్తున్నారు.
- అభివృద్ధి చెందిన ఏడు దేశాల మధ్య పరస్పర వాణిజ్య, రక్షణ, ఇంధన సహకారాలను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ సంక్షోభాలను ఎదుర్కోవడానికి ఇవి సమాఖ్యగా ఏర్పడ్డాయి.

1487
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles