బాల్టిక్ సముద్ర నీటి లవణీయత ఎంత?


Wed,November 27, 2019 01:49 AM

ఆసియా ఖండం

-ఆసియాఖండానికి చుట్టూ హిందూమహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్కిటిక్ మహాసముద్రం ఉన్నాయి.

సముద్రాలు

-ఎర్రసముద్రం: ఇది హిందూమహాసముద్రంలో భాగంగా ఉన్నది. ఇది ఆసియాను, ఆఫ్రికాను వేరుచేస్తుంది.
-అరేబియా సముద్రం: ఇది హిందూమహాసముద్రంలో భాగం. ఆసియా, ఆఫ్రికా ఖండాలను వేరుచేస్తుంది.
-బంగాళాఖాతం: హిందూమహాసముద్రంలో భాగమైన ఇది ఇండోనేషియా, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలను వేరుచేస్తుంది.
-పసిఫిక్‌మహాసముద్రంలో భాగంగా ఉన్న సముద్రాల క్రమం ఉత్తరం నుంచి దక్షిణానికి వరుసగా...
1. ఓకోటస్క్ సముద్రం: తూర్పు రష్యాకు దగ్గరగా ఉన్నది.
2. జపాన్‌సముద్రం: పశ్చిమ జపాన్‌కు దగ్గరగా ఉన్నది.
3. పసుపు సముద్రం: ఇది కొరియాకు దగ్గరగా ఉన్నది.
4. తూర్పు చైనా సముద్రం: తూర్పు చైనాకు దగ్గరగా ఉన్నది.
5. దక్షిణ చైనా సముద్రం: సముద్రాల్లోకెల్లా అతి పెద్దదైన ఇది దక్షిణ చైనాకు దగ్గరలో ఉన్నది.
Map

-జావా సముద్రం: ఇది పసిఫిక్ మహాసముద్రంలో భాగంగా ఉన్నది. ఇది జావాకు ఉత్తరంగా ఉంది.
-బాండా సముద్రం: పసిఫిక్ మహాసముద్రంలో భాగంగా ఉన్న ఈ సముద్రం సెలిబస్ దీవికి తూర్పున విస్తరించి ఉంది.
-సెలిబెస్ సముద్రం: ఇది సెలిబస్ దీవులకు ఉత్తరాన ఉన్నది.
-తూర్పు సైబీరియన్ సముద్రం: ఆర్కిటిక్ మహాసముద్రంలో భాగంగా ఉంది. ఉత్తర రష్యాకు సమీపంగా విస్తరించి ఉన్నది.
-బేరింగ్ సముద్రం: ఇది పసిఫిక్ మహాసముద్రంలో భాగంగా ఉంది. ఉత్తర రష్యాకు దగ్గలో ఉన్నది.
-సముద్రాలను కొలిచే ప్రమాణం- పాథమ్

1 పాథమ్= 6feet/180Cm

-సముద్రాల లోతును కొలవడానికి ఉపయోగించే పరికరం- పాథోమీటర్
-సముద్రాల లోతును అతిధ్వనులను ఉపయోగించి ధ్వని పరావర్తన నియమం ఆధారంగా పాథోమీటర్ సహాయంతో పాథమ్‌లలో కొలుస్తారు.
-సమాన సముద్ర లోతుగల ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను- సమలోతు గీతలు లేదా ఐసోబాథ్‌లు అంటారు.
-సముద్ర జలాల ఉపరితలాలను (ప్రాదేశిక జలాలు) కొలవడానికి ఉపయోగించే ప్రమాణం- నాటికల్ మైళ్లు
1 నాటికల్ మైలు= 1.852 కి.మీ.
1మైలు= 1.609 కి.మీ. లేదా 1.61 కి.మీ.
-భారతదేశ ప్రాదేశిక జలాలు 12 నాటికల్ మైళ్లవరకు విస్తరించిఉన్నాయి.
-ఆసియా ఖండానికి చుట్టూ పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం ఉన్నాయి.

పసిఫిక్ మహాసముద్రం

-ఇది మహాసముద్రాలన్నింటిలోకి అతిపెద్దది, అతి లోతైనది.
-ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. ఇందులో ఎక్కువ అగాధాలు ఉన్నాయి.
-ఇది అత్యధిక సంఖ్యలో దీవులున్న మహాసముద్రం.
-అగ్నిపర్వతాలకు ప్రసిద్ధి చెందడంతో దీన్ని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ (పసిఫిక్ అగ్నివలయం) అని పిలుస్తారు.
-ఈ మహాసముద్రంలోని మేరియానా ట్రెంచ్ (11,103 మీ.) మహాసముద్రాల్లోనే అత్యంత లోతైన అగాధదరి (ట్రెంచ్). ఇది మిండనౌ ద్వీప సముదాయంలో ఫిలిప్పీన్స్ దీవుల్లో ఉన్నది.

హిందూమహాసముద్రం

-ఇది మూడో అతిపెద్ద మహాసముద్రం. ఆసియా, ఆఫ్రికా ఖండాలను వేరుచేస్తుంది.
-ఇది M ఆకారంలో ఉంటుంది.
-ఈ మహాసముద్రంలో లోతైన అగాధదరి లేదా కందకం సుందాట్రెంచ్ (8140 మీ.). ఇది ఇండోనేషియా దగ్గర ఉన్నది.
-రెండో లోతైన అగాధదరి జావాట్రెంచ్. ఇది ఇండోనేషియాలోని జావా దీవివద్ద ఉన్నది.

ఆసియా శీతోష్ణస్థితి

-ఆసియాఖండం ఉత్తరాన ధృవప్రాంతాల వరకు దక్షిణాన భూమధ్యరేఖ వరకు విస్తరించి ఉన్నది.
-ఆసియా ఖండ భూభాగం అక్షాంశాల దృష్ట్యా ఉత్తరార్ధగోళంలో, రేఖాంశాల దృష్ట్యా పూర్వార్ధగోళంలో ఉన్నది. ఈ భూభాగం ఎక్కువగా సముద్ర తీర ప్రాంతానికి దూరంగా ఉండటంతో ఖండాంతర్గత శీతోష్ణస్థితిని కలిగి ఉంది.
-ఈ ఖండం మధ్యభాగంలో వేసవి కాలంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండి, చలికాలంలో ఎక్కువ చలి ఉండి అల్ప వర్షపాతం ఉంటుంది.
-ఆసియా ఖండంపైకి వేసవికాలంలో హిందూ మహాసముద్రం నుంచి వీచే ఆగ్నేయవ్యాపార పవనాలు నైరుతి రుతుపవనాలుగా ఈ ఖండంలోకి ప్రవేశించి వర్షపాతం (200 సెం.మీ. వరకు)ను కలిగిస్తున్నాయి.
-శీతాకాలంలో వీచే ఈశాన్య రుతుపనాల వల్ల తూర్పు ఇండియా దీవుల్లో సుమారు 150 సెం.మీ.ల వర్షపాతం నమోదవుతుంది.
-ఆసియా ఖండంలో అధిక వర్షపాతం నమోదైన ప్రదేశాలు మాసిన్రామ్ (1141 సెం.మీ.), చిరపుంజి (సోహ్ర- 1087 సెం.మీ.). ఇవి రెండు మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయి.
-ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రదేశం హవాయి దీవుల్లోని వయోలిలి శిఖరం (1234 సెం.మీ.). ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉత్తర అమెరికా ఖండలో ఉన్నది.
-కామెరూన్ శిఖరం (1016 సెం.మీ.) ఇది ఆఫ్రికాలోని కామెరూన్ వద్ద ఉన్నది.
-భారత్‌లో అత్యధిక ఉష్ణోగ్రత గల ప్రదేశం థార్‌ఎడారిలోని జైసల్మీర్ వద్ద గల జాకోబాబార్ (520C)
Sea

సముద్ర లవణీయత

-సముద్ర జలాలకు గల ఉప్పదనాన్ని లవణీయత (Salinity of the Ocean water) అంటారు.
-సముద్రజల లవణీయతకు గల కారణం ఆ నీటిలో కరిగి ఉన్న అనేక రకాల ఖనిజ లవణాలు.

సాధారణ లవణీయత

-సముద్ర జలాల్లోని 1000 ml లేదా 1 లీటర్ నీటిలో 35 గ్రాముల ఉప్పు (ఖనిజ లవణాలు) కరిగి ఉంటే దాన్ని సాధారణ లవణీయత అంటారు.
-ప్రపంచంలో అత్యధిక లవణీయత గల సముద్రం- మృత సముద్రం (డెడ్‌సీ). ఇది జోర్డాన్‌లో ఉన్నది. ఈ సముద్రంలోని 1000 మి.లీ. నీటిలో 238 గ్రా. ఉప్పు ఉంటుంది. (ఖనిజ లవణాలు)
-ప్రపంచంలో తక్కువ లవణీయత గల సముద్రం బాల్టిక్ సముద్రం. ఇది రష్యా, స్వీడన్ దేశాల మధ్య ఉన్నది.
-ఈ సముద్రంలోని 1000 మి.లీ. నీటిలో 8 గ్రాముల ఖనిజ లవణాలు ఉంటాయి.
-ప్రపంచంలో అత్యధిక లవణీయత గల మహాసముద్రం- అట్లాంటిక్ మహాసముద్రం
-అత్యల్ప లవణీయత గల మహాసముద్రం- ఆర్కిటిక్
-అత్యధిక లవణీయత గల సరస్సు- వాన్ సరస్సు. ఇది టర్కీలో ఉన్నది. ఇందులోని 1000 మి.లీ. నీటిలో 350 గ్రాముల ఖనిజ లవణాలు ఉంటాయి.

లవణీయతను ప్రభావితం చేసే అంశాలు..

1. అధిక ఉష్ణోగ్రత
2. అల్ప వర్షపాతం
3. ఆ దిశలో పవనాలు వీయకపోవడం
4. నదుల మంచినీరు సముద్రాల్లో కలవక పోవడం
5. సముద్రాల లోతు ఎక్కువగా ఉండటం (200 పాథమ్‌ల కంటే ఎక్కువ లోతు)
-సూర్యుని కిరణాలు నీటిలో 200 పాథమ్‌ల వరకు ప్రయాణిస్తాయి.
-సముద్ర ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్న సముద్ర నేలను సూచించే ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను సమలోతు గీతలు (ఐసోబాత్) అంటారు.

ఆర్కిటిక్ మహాసముద్రం

-ఇది చిన్న మహాసముద్రం.
-ఉత్తర ధృవాన్ని ఆవరించి ఉన్న ఈ మహాసముద్రం వృత్తాకారంలో ఉంటుంది.
-దీన్ని ఉత్తర మహాసముద్రం అంటారు.
-ఏడాదిలో అధిక కాలం ఘనరూపంలో ఉంటుంది.
-లవణీయత తక్కువ గల మహాసముద్రం.
-ప్రపంచంలో అతిపెద్ద సముద్రం- దక్షిణ చైనా సముద్రం
-అతి చిన్న సముద్రం- ఇంగ్లిష్ చానల్
-అత్యంత లోతైన సముద్రం- కరేబియన్ సముద్రం
-తక్కువ లోతైన సముద్రం- పర్షియన్ గల్ఫ్
KasamRamesh

900
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles