కరెంట్ అఫైర్స్


Wed,November 27, 2019 01:35 AM

ఇండియా జాయ్-2019

-హైదరాబాద్‌లో గేమింగ్, మీడియా, వినోద రంగాలకు సంబంధించి దేశంలోనే అతిపెద్ద ప్రదర్శన ఇండియా జాయ్-2019ను టీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నవంబర్ 20న ప్రారంభించారు. నవంబర్ 23 వరకు జరిగిన ఈ ప్రదర్శనలో ప్రపంచ డిజిటల్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ కార్పొరేషన్లు పాల్గొన్నాయి.
Telangana-India-joy

స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారం

-తాగునీరు, పరిశుభ్రత విభాగంలో తెలంగాణ రాష్ర్టానికి 2019కు గాను స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు లభించింది. ఢిల్లీలో నవంబర్ 19న జరిగిన కార్యక్రమంలో కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానందగౌడ ఈ అవార్డును తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణావృద్ధి శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అందజేశారు.

ఫారెస్ట్ ప్లస్ 2.ం కార్యక్రమం

-అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్ ఎయిడ్), కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సంయుక్త సహకారంతో తెలంగాణలో చేపడుతున్న ఫారెస్ట్ 2.ం కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పీ ఇంద్రకరణ్ రెడ్డి నవంబర్ 20న ప్రారంభించారు. 2021-2030 సంవత్సరాలను అంతర్జాతీయ పర్యావరణ, జీవారణ వ్యవస్థల పునరుద్ధరణ దశాబ్దంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నేపథ్యంలో యూఎస్ ఎయిడ్ సహకారంతో మూడు రాష్ర్టాలు బీహార్, కేరళతోపాటు తెలంగాణలోని మెదక్ అటవీ డివిజన్‌ను ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు.

స్టేట్ ఆఫ్ ద స్టేట్ అవార్డ్

-సుపరిపాలనకుగాను ఇండియా టుడే ఏటా ఇచ్చే స్టేట్ ఆఫ్ స్టేట్స్ కాంక్లేవ్-2019 అవార్డు తెలంగాణ రాష్ర్టానికి దక్కింది. ఈ అవార్డును ఢిల్లీలో నవంబర్ 22న కేంద్ర పర్యావరణం, అటవీశాఖ, సమాచార, ప్రసార శాఖ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి జవదేకర్ టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావుకు అందజేశారు.

డీఆర్‌డీవో సినర్జీ సమ్మిట్

-పరిశ్రమ వర్గాలతో మరింత సమన్వయం కోసం హైదరాబాద్‌లోని రిసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో డీఆర్‌డీవో ఇండస్ట్రీ సమ్మిట్-2019 నవంబర్ 22న జరిగింది. ఈ సమ్మిట్ సందర్భంగా డీఆర్‌డీవో, రక్షణ పరిశ్రమ వర్గాలు సమష్టిగా పనిచేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోరారు.

వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్

-స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ బిజినెస్ స్కూల్ ఐఎండీ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ జాబితాను నవంబర్ 18న ప్రకటించింది. మొత్తం 63 దేశాలతో కూడిన ఈ జాబితాలో స్విట్జర్లాండ్ మొదటి ర్యాంకులో నిలువగా డెన్మార్క్ 2, స్వీడన్ 3, ఆస్ట్రియా 4, లక్సెంబర్గ్ 5వ ర్యాంకుల్లో నిలిచాయి.
-ఈ జాబితాలో బ్రిక్స్ దేశాలు భారత్ 59, చైనా 42, రష్యా 47, దక్షిణాఫ్రికా 50వ ర్యాంకులో నిలిచాయి. పెట్టుబడి, అభివృద్ధి, సంసిద్ధత ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.

ప్రైమ్ గ్లోబల్ సిటీ ఇండెక్స్

-గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ నవంబర్ 19న ప్రైమ్ గ్లోబల్ సిటీ ఇండెక్స్ (ప్రపంచ లగ్జరీ మార్కెట్ల)ను విడుదల చేసింది. ఈ జాబితాలో రష్యా రాజధాని మాస్కో ప్రథమ స్థానంలో నిలిచింది. ఫ్రాంక్‌ఫర్ట్ 2, తైపీ 3వ ర్యాంకులో నిలిచాయి. సియోల్‌కు చివరి ర్యాంకు దక్కింది.
-ఈ జాబితాలో భారత్‌లోని ఢిల్లీ 9, బెంగళూరు 20, ముంబై 28 ర్యాంకుల్లో నిలిచాయి. స్థానిక మార్కెట్లో రియల్టీ ధరల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయిస్తారు.

ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ల జాబితా

-ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ కంప్యూటర్స్ టాప్-500 జాబితా నవంబర్ 22న విడుదలైంది. ఈ జాబితాలో అమెరికాలోని ఓక్ రిట్జ్ నేషనల్ ల్యాబొరేటరీలోని సమిట్ మొదటి స్థానంలో నిలువగా.. లారెన్స్ లివర్ మోర్ నేషనల్ ల్యాబ్‌లోని సియొర్రా, చైనాలోని నేషనల్ సూపర్ కంప్యూటింగ్ సెంటరల్లో ఉన్న సన్ వే తైహూలైట్ సూపర్ కంప్యూటర్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.
-ఈ జాబితాలో పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయోరాలజీలోని ప్రత్యూష కంప్యూటర్ 57వ స్థానంలో, నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ సంస్థలోని మిహిర్ కంప్యూటర్ 100వ స్థానంలో నిలిచాయి.

అరుంధతి స్వర్ణ పథకం

-బాల్య వివాహాలను నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా అసోం ప్రభుత్వం అరుంధతి స్వర్ణ యోజన పేరుతో నూతన పథకాన్ని నవంబర్ 21న ప్రవేశపెట్టింది. 2020 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ పథకం ప్రకారం అసోంలో జరిగే పెళ్లిళ్లలో పెళ్లికూతురికి తులం బంగారానికి సమానమైన సొమ్మును ఇస్తారు. వధూవరులు కనీసం పదో తరగతి వరకు చదివి ఉండాలని, వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరని, కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలని షరతులు పెట్టింది.

టైగర్ ట్రయంఫ్

-తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తీరంలో ఇండో-అమెరికా త్రివిధ దళాలు నవంబర్ 17న ప్రారంభించిన టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు నవంబర్ 21న ముగిశాయి. ప్రకృతి విపత్తుల సందర్భంగా గాయపడిన వారికి సాయం, పునరావాసం అందించేందుకు దేశంలోనే తొలిసారిగా వీటిని నిర్వహించారు.

ఇఫి స్వర్ణోత్సవాలు

-గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) స్వర్ణోత్సవాలు నవంబర్ 20న ప్రారంభమయ్యాయి. ఆసియాలోని ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవాల్లో ఒకటిగా పేరుగాంచిన ఇఫి ఉత్సవాలను భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 1952లో ప్రారంభించినా ఏటా నిర్వహించలేదు. 1975 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. 2004 నుంచి గోవాను శాశ్వత వేదికగా నిర్ణయించారు. నవంబర్ 28 వరకు జరుగనున్న ఈ వేడుకల్లో 76 దేశాల నుంచి 250కి పైగా చిత్రాలు ప్రదర్శించనున్నారు.
National-iffi

మొగిలికి లూయీస్ పాశ్చర్ అవార్డు

-పట్టు పరిశ్రమలో పరిశోధనలతో విశేష కృషి చేసిన తెలంగాణ శాస్త్రవేత్త తాళ్లపల్లి మొగిలికి జపాన్‌లోని అంతర్జాతీయ పట్టు కమిషన్ నుంచి ప్రతిష్ఠాత్మక లూయీస్ పాశ్చర్ అవార్డు లభించింది. జపాన్‌లోని సుకుబా నగరంలో నవంబర్ 19న జరిగిన కార్యక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం చర్లపల్లికి చెందిన ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

అటెన్‌బరోకు అవార్డు

-ప్రకృతి శాస్త్రవేత్త, ప్రముఖ బ్రాడ్‌క్యాస్టర్ సర్ డేవిడ్ అటెన్‌బరోకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి-2019 లభించింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ ఈ అవార్డు విజేతను నవంబర్ 19న ఎంపిక చేసింది. బ్రిటన్‌కు చెందిన అటెన్‌బరో జీవవైవిధ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతో కృషి చేశారు. ప్రకృతి సంపదపై ఎన్నో పుస్తకాలు రాశారు. 2018కు గాను ప్రకటించిన ఈ అవార్డును సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) సారథి సునీతా నారాయణ్‌కు నవంబర్ 19న అందజేశారు.

ఫార్చూన్ బిజినెస్ పర్సన్‌లో సత్య నాదెళ్ల

-నవంబర్ 20న విడుదలైన ఫార్చూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-2019 జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ఫోర్టెస్క్యూ మెటల్స్ గ్రూప్ సీఈవో ఎలిజబెత్ గెయినెస్ 2, చిపోటిల్ మెక్సికన్ గ్రిల్ సీఈవో బ్రియాన్ నికోల్ 3, సింక్రోని ఫైనాన్షియల్ సీఈవో మార్గరెట్ 4, ప్యూమా సీఈవో జోర్న్ గుల్డెన్ 5వ స్థానాల్లో ఉన్నారు.
-సత్య నాదెళ్లతోపాటు మరో ఇద్దరు భారత సంతతికి చెందిన మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బంగా 8, కాలిఫోర్నియా కంప్యూటర్ నెట్‌వర్కింగ్ సంస్థ అరిస్టా హెడ్ జయశ్రీ ఉల్లాల్ 18వ స్థానంలో నిలిచారు. ధైర్యంగా లక్ష్యాలను చేరుకోవడం, అసాధ్యాలను సుసాధ్యం చేయడం, సృజనాత్మక పరిష్కారం మార్గాలను కనుగొనడం వంటి కీలక అంశాల ఆధారంగా మొత్తం 20 మందితో ఈ జాబితాను రూపొందించారు.
satya-nadella

పెటా పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా కోహ్లీ

-పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) పర్సన్ ఆఫ్ ది ఇయర్-2019 అవార్డుకు విరాట్ కోహ్లీని ఎంపిక చేసినట్లు ఆ సంస్థ నవంబర్ 20న ప్రకటించింది. శాకాహార ప్రోత్సాహకులను, జంతుజాల ప్రేమికులను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. కోహ్లీ రాజస్థాన్‌లోని అంబర్ కోట వద్ద మాల్తి అనే ఏనుగును హింసించడాన్ని నిరసిస్తూ పెటాకు లేఖ రాశాడు. మూగజీవాల పట్ల కరుణ చూపాలని, జంతువును కొనుగోలు చేయడం కంటే దత్తత తీసుకోవాలని కోహ్లీ తన అభిమానులకు సూచించాడు.

శ్రీలకం ప్రధానిగా రాజపక్సే

-శ్రీలంక ఏడో అధ్యక్షుడిగా నవంబర్ 18న బాధ్యతలు చేపట్టిన గొటబాయ రాజపక్సే తన సోదరుడు, మాజీ దేశాధ్యక్షుడు మహిందా రాజపక్సేను దేశ నూతన ప్రధానిగా నవంబర్ 20న ఎంపిక చేశారు. ఆ దేశ ప్రస్తుత ప్రధాని రణిల్ విక్రమసింఘే నవంబర్ 21న బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 2020లో ఎన్నికలు జరిగే వరకు ఆపద్ధర్మ ప్రభుత్వానికి మహింద నేతృత్వం వహిస్తారు. మహిందా రాజపక్సే 2005 నుంచి 2015 వరకు శ్రీలకం దేశాధ్యక్షుడిగా పనిచేశారు.

ఎల్ అండ్ టీ సీఈవోకు అవార్డు

-లార్సెన్ అండ్ టూబ్రో ఇన్‌ఫ్రా సీఈవో, ఎండీ ఎస్‌ఎన్ సుబ్రమణియన్‌కు ఐఐఎం-జేఆర్‌డీ టాటా అవార్డు లభించింది. కేరళలోని కోవలంలో నవంబర్ 21న జరిగిన కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం, సహజ చమురు, ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయనకు ఈ అవార్డును అందజేశారు. మెటలర్జికల్ ఇండస్ట్రీస్ విభాగంలో ఉత్తమ కార్పొరేట్ గవర్నెన్స్‌కుగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. 2007లో టాటా స్టీల్ ఈ అవార్డును నెలకొల్పింది.

అంతర్జాతీయ బాలల శాంతి పురస్కారాలు

-నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో అంతర్జాతీయ బాలల శాంతి పురస్కారాలను నవంబర్ 21న ప్రదానం చేశారు. స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థెన్‌బర్గ్, కామెరూన్‌కు చెందిన శాంతి కార్యకర్త దివినా మాలౌమ్‌లు ఈ పురస్కారాలు అందుకున్నారు.

ఏటీపీ టెన్నిస్ విజేత సిట్సిపాస్

-గ్రీస్ టెన్నిస్ క్రీడాకారుడు స్టెఫనోస్ సిట్సిపాస్ ఏటీపీ వరల్డ్ టూర్ విజేతగా నిలిచాడు. లండన్‌లో నవంబర్ 18న జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సిట్సిపాస్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను ఓడించాడు.
Sports-Tsitsipas

షూటింగ్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు

-చైనాలోని పుతియాన్‌లో జరిగిన షూటింగ్ టోర్నీ ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు లభించాయి. నవంబర్ 21న జరిగిన జూనియర్ మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ మను భాకర్ 244.7 పాయింట్లతో ప్రపంచ రికార్డును నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది.
-మహిళల 10 మీ. ఎయిర్ రైఫిల్‌లో ఇలవనీల్ వలరివన్ స్వర్ణాన్ని సాధించింది. జూనియర్ పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో దివ్యాంశ్ స్వర్ణ గెలుచుకున్నాడు.
-అలాగే నవంబర్ 22న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మను భాకర్-చెర్నసోవ్ (రష్యా) జంట సౌరభ్ చౌదరి-అన్నా కొరాకకి (గ్రీస్) జంటపై విజయం సాధించి స్వర్ణాన్ని దక్కించుకుంది.

పింక్ టెస్టులో భారత్‌దే విజయం

-క్రికెట్ చరిత్రలో తొలిసారిగా పింక్ బాల్‌తో జరిగిన డే నైట్ టెస్ట్ మ్యాచ్‌లో నవంబర్ 24న భారత్ విజయం సాధించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. అలాగే పింక్ బాల్‌తో తొలి బాల్ వేసిన ఆటగాడిగా ఇషాంత్ శర్మ, సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించారు.

ర్యాపిడ్ చెస్ విజేత కార్ల్‌సన్

-టాస్ స్టీల్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ విభాగంలో మాగ్నస్ కార్ల్‌సన్ విజేతగా నిలిచాడు. నవంబర్ 24న జరిగిన మూడు ర్యాపిడ్ గేముల్లో రెండు గెలిచిన అతడు ఒకటి డ్రా చేశాడు. మొత్తం 9 రౌండ్ల నుంచి 15 పాయింట్లు సాధించిన కార్ల్‌సన్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆనంద్, హరికృష్ణ, డింగ్ లిరెన్ తలో ఎనిమిది పాయింట్లతో ఉమ్మడిగా ఆరో స్థానంలో నిలిచారు.

-స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ బిజినెస్ స్కూల్ ఐఎండీ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ జాబితాను నవంబర్ 18న ప్రకటించింది. మొత్తం 63 దేశాలతో కూడిన ఈ జాబితాలో స్విట్జర్లాండ్ మొదటి ర్యాంకులో నిలువగా డెన్మార్క్ 2, స్వీడన్ 3, ఆస్ట్రియా 4, లక్సెంబర్గ్ 5వ ర్యాంకుల్లో నిలిచాయి.
-ఈ జాబితాలో బ్రిక్స్ దేశాలు భారత్ 59, చైనా 42, రష్యా 47, దక్షిణాఫ్రికా 50వ ర్యాంకులో నిలిచాయి. పెట్టుబడి, అభివృద్ధి, సంసిద్ధత ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.

ప్రైమ్ గ్లోబల్ సిటీ ఇండెక్స్

-గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ నవంబర్ 19న ప్రైమ్ గ్లోబల్ సిటీ ఇండెక్స్ (ప్రపంచ లగ్జరీ మార్కెట్ల)ను విడుదల చేసింది. ఈ జాబితాలో రష్యా రాజధాని మాస్కో ప్రథమ స్థానంలో నిలిచింది. ఫ్రాంక్‌ఫర్ట్ 2, తైపీ 3వ ర్యాంకులో నిలిచాయి. సియోల్‌కు చివరి ర్యాంకు దక్కింది.
-ఈ జాబితాలో భారత్‌లోని ఢిల్లీ 9, బెంగళూరు 20, ముంబై 28 ర్యాంకుల్లో నిలిచాయి. స్థానిక మార్కెట్లో రియల్టీ ధరల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయిస్తారు.

ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ల జాబితా

-ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ కంప్యూటర్స్ టాప్-500 జాబితా నవంబర్ 22న విడుదలైంది. ఈ జాబితాలో అమెరికాలోని ఓక్ రిట్జ్ నేషనల్ ల్యాబొరేటరీలోని సమిట్ మొదటి స్థానంలో నిలువగా.. లారెన్స్ లివర్ మోర్ నేషనల్ ల్యాబ్‌లోని సియొర్రా, చైనాలోని నేషనల్ సూపర్ కంప్యూటింగ్ సెంటరల్లో ఉన్న సన్ వే తైహూలైట్ సూపర్ కంప్యూటర్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.
-ఈ జాబితాలో పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయోరాలజీలోని ప్రత్యూష కంప్యూటర్ 57వ స్థానంలో, నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ సంస్థలోని మిహిర్ కంప్యూటర్ 100వ స్థానంలో నిలిచాయి.

475
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles