19వ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2019


Wed,October 16, 2019 12:13 AM

ఒలింపిక్స్ తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 19వ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6 వరకు ఖతార్ రాజధాని దోహాలో జరిగాయి. 2022 ఫిఫా (అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య) ఆతిథ్యమివ్వబోతున్న ఖతార్‌కు ఈ క్రీడలు ఎంతో దోహదపడతాయి. 2003 నుంచి ప్రపంచ అథ్లెటిక్స్‌లో 11 స్వర్ణాలు సాధించి తనదైన ముద్ర వేసిన ఉసేన్ బోల్ట్ లేకుండా జరిగిన క్రీడలివి. 49 క్రీడాంశాల్లో 209 దేశాల నుంచి 1972 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తొలిసారి 4X400 మిక్స్‌డ్ రిలే నిర్వహించడం విశేషం.
Athletics
-ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత జట్టు కేవలం ఒకే ఒకసారి 2003లో పారిస్‌లో జరిగిన ఈవెంట్‌లో అంజూ బాబి జార్జ్ 6.7 మీ. దూకి కాంస్య పతకం సాధించిన తర్వాత పతకాలు సాధించకుండానే రిక్తహస్తాలతో తిరిగివస్తున్నారు. గత రెండేండ్ల నుంచి జరుగుతున్న ప్రపంచ స్థాయి ఈవెంట్లలో నిలకడగా రాణిస్తున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, స్ప్రింటర్ హిమ దాస్ ఈ పోటీల్లో పాల్గొనకపోవటంతో పతకాల పై ఆశ సన్నగిల్లింది. ఈ సారి ఈ పోటీల్లో 27 మంది పాల్గొన్నారు. రిలే జట్టుతో కలిపి 16 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారు. అమెరికా అత్యధికంగా 159 మంది అథ్లెట్లను పంపింది. అత్యధికంగా అథ్లెట్లను పంపిన అమెరికా పతకాల పట్టికలో కూడా అగ్రస్థానంలో నిలిచింది.
-5 కోట్ల 25 లక్షల జనాభా ఉన్న కెన్యా పతకాల పట్టికలో ద్వితీయ స్థానంలో, 30 లక్షల్లోపు జనాభా ఉన్న జమైకా పతకాల పట్టికలో తృతీయ స్థానంలో నిలిచాయి. అగ్రరాజ్యమైన అమెరికాతో ఆఫ్రికాదేశాలైన కెన్యా, ఇథియోపియా దేశాలు పతకాలు సాధించి టాప్‌టెన్ దేశాల పట్టికలో నిలవడం విశేషం. ప్రపంచ పటంలో కనిపించని చిన్నా చితక దేశాలు సైతం పతకాల కోసం అగ్రరాజ్యాలతో పోటీపడుతుంటే, ప్రపంచంలో 137 కోట్ల జనాభా కలిగిన రెండో దేశమైన భారత్ పతకాల పట్టికలో అడ్రస్ లేకపోవడం క్రీడాభిమానులకు నిరాశ కలిగించే అంశం. వరుసగా 8 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ల నుంచి భారత అథ్లెట్లు రిక్తహస్తాలతో తిరిగి రావడం హర్షించదగ్గ విషయం కాదు.
-1976లో ఒలింపిక్స్ కమిటీ మాంట్రియల్‌లో జరిగిన ఒలింపిక్స్ క్రీడల నుంచి 50 కి.మీ నడక పోటీని తొలగించినందుకు ప్రతిస్పందనగా 1976లో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ పోటీలు నిర్వహించాలని నిర్ణయించాయి. 1976లో తొలిసారిగా స్వీడన్‌లోని మాల్మోలో నిర్వహించారు. ఈ పోటీలో ఒక క్రీడాంశంలో పోటీ నిర్వహించగా 20 దేశాల నుంచి 42 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో నాటి సోవియట్ రష్యా అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాత నాలుగేండ్లకోసారి 1991 నుంచి ప్రతి రెండేండ్లకోసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లు నిర్వహిస్తున్నారు.


countries

వివరాలు

-ఆతిథ్యదేశం: ఖతార్
-ప్రధాన పట్టణం: దోహా
-నిర్వాహకులు : ఐఏఏఎఫ్, ఖతార్ అథ్లెటిక్స్ ఫెడరేషన్
-ఐఏఏఎఫ్ అధ్యక్షుడు: సెబాస్టియన్ కో
-క్రీడల ప్రారంభకులు: అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని
-ప్రధాన వేదిక: ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం
-మస్కట్: ఫాలా
-ఎన్నో క్రీడలు: 19వ క్రీడలు
-పాల్గొన్న దేశాలు: 209
-పాల్గొన్న అథ్లెట్స్: 1972 (పురుషులు 1054+ మహిళలు 918)
-క్రీడాంశాలు: 49 (పురుషులు 24+మహిళలు 24+మిక్స్‌డ్ 4X400 రిలే)
-నిర్వహించిన తేదీలు: సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6 వరకు
-అత్యధిక స్వర్ణాలు: అమెరికా (14)
-అత్యధిక పతకాలు: అమెరికా (స్వర్ణం+రజతం+కాంస్యం=29)
-స్వర్ణాలు సాధించిన దేశాలు : 20+ఏఎన్‌ఏ (ఆథరైజ్డ్ న్యూట్రల్ అథ్లెట్స్)
-ఏదో ఒక పతకం సాధించిన దేశాలు: 43+ఏఎన్‌ఏ
-వ్యక్తిగత బహుమతి (డాలర్లలో): 60,000 (స్వర్ణం) 30,000 (రజతం) 20,000 (కాంస్యం)
-జట్టుకు లభించే బహుమతి (డాలర్లలో): 80,000 (స్వర్ణం) 40,000 (రజతం) 20,000 (కాంస్యం)

ఏడాది - చేరిన క్రీడలు -1987 మహిళల 10,000 మీటర్లు (10 కి.మీ.) నడక
-1993 మహిళల ట్రిపుల్ జంప్
-1995 మహిళల 3,000 మీటర్లకు బదులు 5,000 మీటర్లు
-1999 మహిళల పోల్‌వాల్ట్, హ్యామర్ త్రో, 10 కి.మీ. బదులు 20 కి.మీ
-2005 మహిళల 300 మీ. స్టీపుల్‌చేజ్
-2017 మహిళల 50 కి.మీ. నడక
-2019 మిక్స్‌డ్ 4X400 రిలే

అత్యధిక సార్లు పాల్గొన్న క్రీడాకారులు

-జీసెస్ ఏంజెల్ గ్రాసియా స్పెయిన్ 50 కి.మీ. నడక 13 సార్లు
-బ్రగాడో సుసాన్ ఫెయిటర్ పోర్చుగల్ 10 కి.మీ/20 కి.మీ నడక 11సార్లు
-పోఅవు విఐరా పోర్చుగల్ 20 కి.మీ/50 కి.మీ నడక 11సార్లు

records

విశేషాలు

-పతకాల పట్టికలో ఇప్పటివరకు అమెరికా 13 సార్లు అగ్రస్థానంలో నిలిస్తే, తూర్పు జర్మనీ మూడు సార్లు, రష్యా రెండు సార్లు, కెన్యా ఒకసారి మాత్రమే అగ్రస్థానంలో నిలిచింది.
-ఇప్పటి వరకు జరిగిన 19 చాంపియన్‌షిప్‌లలో 70 దేశాలు స్వర్ణం సాధిస్తే, ఏదో ఒక పతకం సాధించిన దేశాల సంఖ్య- 102.
-ఏంజెలికా సిదోరోవా: రష్యన్ పోల్ వాల్టర్ అయిన ఈమె స్వర్ణం పతకం సాధించిన సమయంలో రష్యా అథ్లెట్లపై డోపింగ్ ఆరోపణలతో (వాడా) నిషేధం ఉండటంవల్ల జాతీయ జెండాతో ఆనందాన్ని పంచుకునే అవకాశం పొందలేకపోయింది.
-అలిసన్ ఫెలిక్స్: గత నవంబర్‌లో కూతురు కామ్రిన్‌కు జన్మనిచ్చిన ఈమె ఈ ఏడాది జూలైలో ట్రాక్‌పైకి అడుగుపెట్టిన అమెరికా వెటరన్ స్టార్. ఈమె 4X400 మీ. పోటీలో స్వర్ణం గెలిచి, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మెత్తంమీద 12 స్వర్ణాలు సాధించారు. ఇప్పటివరకు 11 స్వర్ణాలు సాధించిన ఉసేన్ బోల్ట్ రికార్డును వెనక్కు నెట్టింది. ఫెలిక్స్ 2005 (1), 2007లో (3), 2009లో (2), 2011లో (2), 2015లో (1), 2017 (2)లో స్వర్ణాలు సాధించారు.
-షెల్లీ ఫ్రేజర్ ప్రైస్: 2017 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు దూరంగా ఉండి మగబిడ్డకు జన్మనిచ్చిన 32 ఏండ్ల షెల్లీ ఫ్రేజర్ 100 మీ. రేసును 10.71 సెకన్లలో పూర్తిచేసి స్వర్ణాన్ని సాధించింది.
-నియా అలీ: పోటీల చివరి రోజైన మహిళల 100 మీ. హార్డిల్స్‌లో అమెరికా అథ్లెట్, ఇద్దరు పిల్లకు తల్లి అయిన నియా అలీ (30) స్వర్ణం సాధించింది. 12.34 సెకన్లలో గమ్యాన్ని చేరి తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది.

medals

-హ్యాట్రిక్: హైజంప్‌లో రష్యన్ మహిళ మరియా లసిట్స్‌కెనె స్వర్ణం సాధించి హ్యాట్రిక్ సాధించింది. ఈమె 2015, 17 ప్రపంచ అథ్లెటిక్స్‌లో స్వర్ణం సాధించింది.
-సిఫాన్ హసన్: ఒకే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 1500 మీ., 10,000 మీ. టైటిళ్లను గెలిచిన తొలి మహిళ సిఫాన్ హసన్ (నెదర్లాండ్స్)
-జోవావో వియోరా: ప్రపంచ అథ్లెటిక్స్‌లో జోవావో వియోరా 50 కి.మీ నడకలో పతకం సాధించిన అతిపెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందాడు.
-డీఅన్నా ప్రైస్: మూత్రపిండాల వ్యాధితో పాటు అనేక గాయాల బారినపడిన అమెరికాకు చెందిన మహిళా అథ్లెట్ డీ అన్నా ప్రైస్ హ్యామర్ త్రోలో స్వర్ణం సాధించింది.
-ఈ సారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నార్వేలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు పోటీపడటం విశేషం. వీరు జాకబ్, హెన్రిక్, ఫిలిఫ్ ఇన్హిబిట్ సెన్సెలు 5,000 మీ పరుగు పందెంలో పోటీ పడ్డారు. వీరికి వారి నాన్న జెర్టే కోచ్.

ఏఎన్‌ఏ: ఆథరైజ్డ్ న్యూట్రల్ అథ్లెట్స్ తటస్థ దేశం-రష్యా


భారత్ ప్రదర్శన

-కొన్ని విభాగాల్లో ఫైనల్‌కు అర్హత సాధించడం, రెండు విభాగాల్లో టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌లు దక్కించుకోవడం విశేషం. 4x400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో, పురుషుల 3000 మీ. స్టీఫుల్‌చేజ్‌లో అవినాశ్ సాబ్లే, మహిళల జావెలిన్‌త్రోలో అన్ను రాణి ఫైనల్‌కు చేరుకున్నారు. 4X400 మీటర్ల మిక్స్‌డ్ రిలే, పురుషుల 3000 మీ. స్టీఫుల్ చేజ్‌లో అవినాశ్ సాబ్లే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.
-పీటీ ఉష: పరుగుల రాణి పీటీ ఉషకు ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య 52వ వార్షిక కాంగ్రెస్ సందర్భంగా ఐఏఏఎఫ్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో వెటరన్‌షిన్‌ను బహూకరించారు. ఆసియా నుంచి ఈ గౌరవం పొందిన ముగ్గురిలో ఈమె ఒకరు. 1985 ఆసియా క్రీడల్లో ఉష ఐదు స్వర్ణ పతకాలు సాధించింది.

Athletics2
Athletics3

a-krishnaiah

672
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles