ఇస్రోలో 327 ఇంజినీర్ పోస్టులు


Wed,October 16, 2019 12:37 AM

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
isro-gslv-station
-పోస్టు: సైంటిస్ట్/ఇంజినీర్ ఎస్‌సీ
-మొత్తం ఖాళీల సంఖ్య: 327
-విభాగాలవారీగా ఖాళీలు: ఎలక్ట్రానిక్స్-131, మెకానికల్-135, కంప్యూటర్ సైన్స్-58, ఎలక్ట్రానిక్స్ (అటానమస్ బాడీ) -3 ఉన్నాయి. వీటిలో 31 పోస్టులు పీహెచ్‌సీ అభ్యర్థులకు కేటాయించారు.
-పేస్కేల్: లెవల్ 10 పేమ్యాట్రిక్స్ ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తారు. ప్రారంభ వేతనం రూ.56,100/- ఉంటుంది. దీనికి అదనంగా ఇతర అలవెన్సులు ఇస్తారు.
-అర్హతలు: కనీసం 65 శాతం మార్కులతో లేదా 6.84/10 సీజీపీఏతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-వయస్సు: 2019, నవంబర్ 4 నాటికి 35 ఏండ్లు మించరాదు.
-ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్నవారిని మొదట షార్ట్‌లిస్ట్ చేసి రాతపరీక్షకు ఎంపిక చేస్తారు.
-రాతపరీక్షను 2020, జనవరి 12న నిర్వహిస్తారు. రాష్ట్రంలో పరీక్ష కేంద్రం హైదరాబాద్‌లో ఉంది. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. రాతపరీక్షలో 80 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు.
-ఇంటర్వ్యూలో కనీసం 60 శాతం మార్కులు వచ్చిన వారిని పరిగణనలోకి తీసుకుని మెరిట్ ఆధారంగా తుది ఎంపికచేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 4
-ఫీజు: రూ.100/-
-వెబ్‌సైట్: www.isro.gov.in

806
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles