కరీంనగర్‌లో ఆర్మీ ర్యాలీ


Mon,August 19, 2019 01:41 AM

భారత సైన్యంలో సోల్జర్‌తోపాటు పలు రకాల ఉద్యోగాల భర్తీకి కరీంనగర్‌లో నిర్వహించే ఆర్మీ ర్యాలీకి నోటిఫికేషన్‌ను సికింద్రాబాద్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ విడుదల చేసింది.
flag
పోస్టులు-అర్హతలు:
-సోల్జర్‌ టెక్నికల్‌- ఎత్తు -166 సెం.మీ ఉండాలి. బరువు 50 కేజీలు. ఛాతీ 77 సెం.మీతోపాటు గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి.
-విద్యార్హతలు: కనీసం 45 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత.
-వయస్సు: 17 1/2 ఏండ్ల నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి.
-సోల్జర్‌ టెక్నికల్‌ (ఏవియేషన్‌/అమ్యునిషన్‌ ఎగ్జామినర్‌)- 165 సెం.మీ ఎత్తు, 50 కేజీల బరువు, 77 సెం.మీ. ఛాతీ ఉండాలి.
-విద్యార్హతలు: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 17 1/2 ఏండ్ల నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి.
-సోల్జర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌/ ఏఎంసీ, ఆర్‌వీసీ- కనీసం 165 సెం.మీ ఎత్తు, 50 కేజీల బరువు, 77 సెం.మీల ఛాతీ ఉండాలి. గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి.
-విద్యార్హతలు: ఇంటర్‌ (బైపీసీ)లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
-వయస్సు: 17 1/2 ఏండ్ల నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి.
-సోల్జర్‌ క్లర్క్‌, స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌- కనీసం 162 సెం.మీ ఎత్తు, 50 కేజీల బరువు, 77 సెం.మీ ఛాతీతోపాటు గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచం కలిగి ఉండాలి.
-అర్హతలు: ఇంటర్‌ (ఆర్ట్స్‌/కామర్స్‌ లేదా సైన్స్‌) గ్రూప్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ప్రతి సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు. 12వ తరగతిలో ఇంగ్లిష్‌తోపాటు

మ్యాథ్స్‌/అకౌంట్స/బుక్‌ కీపింగ్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి.
-వయస్సు: 17 1/2 ఏండ్ల నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి.
-సోల్జర్‌ ఫార్మా (ఏఎంసీ)- కనీసం 165 సెం.మీ ఎత్తు ఉండాలి. ఛాతీ 77 సెం.మీలు, బరువు 50 కేజీలు ఉండాలి.
-విద్యార్హతలు: ఇంటర్‌ బైపీసీలో ఉత్తీర్ణత. డిఫార్మాలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి స్టేట్‌ ఫార్మసీ కౌన్సిల్‌/ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో నమోదు చేసుకుని ఉండాలి.
-వయస్సు: 19-25 ఏండ్ల మధ్య ఉండాలి.
-సోల్జర్‌ ట్రేడ్స్‌మ్యాన్‌ (ఆల్‌ ఆర్మ్స్‌-పదోతరగతి)- కనీసం 166 సెం.మీ ఎత్తు ఉండాలి. బరువు 48 కేజీలు, కనీసం 76 సెంమీల ఛాతీతోపాటు గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి.
-అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత.
-సోల్జర్‌ ట్రేడ్స్‌మ్యాన్‌ (ఆల్‌ ఆర్మ్స్‌- ఎనిమిదో తరగతి)- కనీసం 166 సెం.మీ ఎత్తు ఉండాలి. బరువు 48 కేజీలు, కనీసం 76 సెంమీల ఛాతీతోపాటు గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ

వ్యాకోచించాలి.
-అర్హతలు : ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత.
-పై రెండు పోస్టులకు వయస్సు: 17 1/2 ఏండ్ల నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:
-ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ (పీఎఫ్‌టీ):
-ఐదునిమిషాల 30/45 సెకన్లలో 1.6 కి.మీ దూరాన్ని పరుగెత్తాలి.
-పుల్‌ అప్స్‌, 9 అడుగుల డిచ్‌, జిగ్‌జాగ్‌ బ్యాలెన్స్‌లలో అర్హత సాధించాలి.
-అనంతరం శారీరక ప్రమాణాలను పరీక్షిస్తారు. తర్వాత మెడికల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించినవారికి కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు. ఈ విషయాన్ని ర్యాలీ నిర్వహించిన

ప్రదేశంలోనే తెలియజేస్తారు. పరీక్ష నిర్వహించే ప్రదేశం, సమయం వివరాలను అడ్మిట్‌కార్డులో పొందుపరుస్తారు. ఈ పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ఫలితాలను ఆర్మీ వెబ్‌సైట్‌లో

ప్రకటిస్తారు.
నోట్‌: క్రీడల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ తదితర సర్టిఫికెట్లు కలిగినవారికి అర్హతలు, ఎత్తు తదితర అంశాల్లో సడలింపు ఉంటుంది.
-ఈ ర్యాలీకి రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరుకావచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఆగస్టు 23 నుంచి ప్రారంభం
-చివరితేదీ: సెప్టెంబర్‌ 23
-వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in

481
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles