ఎస్‌ఎస్‌బీలో 150 పోస్టులు


Fri,July 19, 2019 01:17 AM

న్యూఢిల్లీలోని సశస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బీ) దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్పోర్ట్స్ కోటా విభాగంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
SSB- పోస్ట్ పేరు: కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)
- మొత్తం ఖాళీల సంఖ్య: 150
- విభాగాలు: ఫుట్‌బాల్, స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, హాకీ, షూటింగ్, ఆర్చరీ, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, రెజ్లింగ్, బాక్సింగ్, జూడో, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్, సైక్లింగ్, తైక్వాండో, ఈక్వెస్ట్రియన్
- అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. సంబంధిత క్రీడలో దేశం తరఫున ఆడటం లేదా గతంలో ఒలింపిక్స్, ప్రపంచ కప్, ఏషియన్ గేమ్స్‌లలో ఏదైనా పతకం సాధించి ఉండాలి.
- వయస్సు: 18 నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి. సంస్థ నియమాల ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- పేస్కేల్: రూ.21,700-69,100/- వీటికితోడు ఎస్‌ఎస్‌బీ రూల్స్ ప్రకారం డీఏ, హెచ్‌ఆర్‌ఏ తదితర సదుపాయాలు ఉంటాయి.
- ఫీజు: జనరల్, ఓబీసీలకు- రూ.100/- ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
- ఎంపిక: బయోమెట్రిక్ ఎగ్జామ్, స్పోర్ట్స్ ట్రయల్స్, పీఎస్‌టీ ద్వారా
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్: పురుషులు- 170 సెం.మీ. ఎత్తు, ఛాతీ 80 సెం.మీ, గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ. వ్యాకోచించాలి.
- మహిళలు - 157 సెం.మీ. ఎత్తు ఉండాలి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (జూలై13-19) వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి.
- వెబ్‌సైట్: www.ssbrectt.gov.in

674
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles