ఫుడ్ టెక్నాలజీ ప్రవేశాలు


Tue,April 23, 2019 11:55 PM

హరియణాలోని భారత ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐఎఫ్‌టీఈఎం) 2019-20 కిగాను యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో
ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

NIFTIM
-నాలుగేండ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (బీటెక్) -199 సీట్లు
-అర్హత: ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. జేఈఈ మెయిన్ 2019లో అర్హత సాధించాలి.
-ఎంపిక: జేఈఈ మెయిన్-2019 ర్యాంక్ ద్వారా
-రెండేండ్ల పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఎంటెక్)-105 సీట్లు
-విభాగాలు: ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, ఫుడ్ ప్రాసెస్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ మేనేజ్‌మెంట్, ఫుడ్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ప్లాంట్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్.
-అర్హత: సంబంధిత విభాగాల్లో నాలుగేండ్ల బ్యాచిలర్ డిగ్రీ లేదా ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత గమనిక: సంబంధిత విభాగంలో/ కోర్సులో 21 చొప్పున ఐదింటికి మొత్తం 105 సీట్లు ఉంటాయి.
-ఎంపిక: గేట్ ర్యాంక్/నిఫ్టెమ్ ప్రవేశపరీక్ష
-రెండేండ్ల మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)-33 సీట్లు
-అర్హత: సంబంధిత విభాగం/సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-ఎంపిక: క్యాట్/మ్యాట్ స్కోర్ లేదా నిఫ్టెమ్ ప్రవేశ పరీక్ష , గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
-పీహెచ్‌డీ-20 సీట్లు
-విభాగాలు: అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, బేసిక్ అండ్ అప్లయిడ్ సైన్స్, ఫుడ్ ఇంజినీరింగ్, ఫుడ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
-అర్హత: సంబంధిత విభాగాల్లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.
-ఎంపిక: రిసెర్చ్ ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా, జేఆర్‌ఎఫ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రవేశపరీక్షలో మినహాయింపు ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 25
-వెబ్‌సైట్: http://niftem.ac.in

354
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles