ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్


Mon,April 22, 2019 01:33 AM

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు శాఖల్లో నాన్ టెక్నికల్ విభాగాల్లో (గ్రూప్ సీ నాన్ గెజిటెడ్/నాన్ మినిస్టీరియల్ విభాగం) ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ssc-mts
-కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పదివేల ఉద్యోగాలు
-పదోతరగతి/మెట్రిక్యులేషన్ అర్హత
-ఆబ్జెక్టివ్, డిస్రిప్టివ్ రాతపరీక్ష ద్వారా ఎంపిక
-పోస్టు పేరు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/పదోతరగతి ఉత్తీర్ణత.
-వయస్సు: 18-25 ఏండ్ల మధ్య ఉండాలి
-వయోపరిమితి: ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీల కు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పేస్కేల్: రూ. 5200 - 20200 + గ్రేడ్ పే రూ. 1800/- అదనంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ తదితర సదుపాయాలు ఉంటాయి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100 ఎస్సీ/ఎస్టీ, మహిళలు, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు ఎటువంటి ఫీజు లేదు.
-ఎంపిక: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్) ద్వారా
-పేపర్1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనిం గ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ , జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
-పేపర్- 2 రాతపరీక్షలో షార్ట్ ఎస్సే, లెటర్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్, తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ పరీక్షను అభ్యర్థులు ఇంగ్లిష్/హిందీ మాధ్యమాలలో లేదా గుర్తింపు పొందిన (8వ షెడ్యూల్ ప్రకారం) ఏదైనా ప్రాంతీయ భాషలో పరీక్ష రాయవచ్చు. అభ్యర్థికి సంబంధిత భాషలో ప్రాథమిక పరిజ్ఞానం ఏ మేరకు ఉందో పరిశీస్తారు. దీనిలో కనీస అర్హత మార్కులను సాధించాలి.
-పేపర్-1లో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కుల కోతవిధిస్తారు.
-పేపర్-1లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. పేపర్-2 కేవలం క్వాలిఫయింగ్ మాత్రమే.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఏప్రిల్ 22 నుంచి
-చివరితేదీ: మే 22 (సాయంత్రం 5 గంటల వరకు)
-పరీక్ష తేదీలు: ఆగస్టు 2-సెప్టెంబర్ 6 వరకు
-వెబ్‌సైట్: http://ssconline.nic.in

337
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles