ఐటీబీపీలో 121 కానిస్టేబుళ్లు


Sun,April 21, 2019 12:59 AM

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)లో ప్రతిభావంతులైన క్రీడాకారుల కోటాలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
ITBP

-పోస్టు: కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) (గ్రూప్ సీ)
-మొత్తం ఖాళీలు: 121
-క్రీడాంశాల వారీగా ఖాళీలు: అథ్లెటిక్స్, జూడో, వాటర్ స్పోర్ట్స్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, వుషు, ఆర్చరీ, షూటింగ్ (స్పోర్ట్స్), వింటర్ గేమ్స్ స్కీయింగ్, రెజ్లింగ్, కరాటే.
-పేస్కేల్: ప్రారంభ వేతనం నెలకు రూ.21,700/- (లెవల్-3)
-అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతోపాటు సంబంధిత క్రీడాంశాల్లో ఒలింపిక్, ప్రపంచస్థాయి, ఏషియన్‌గేమ్స్, యూత్ ఒలింపిక్స్, శాప్ గేమ్స్, వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్, జాతీయస్థాయి గేమ్స్ సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్, జూనియర్ నేషనల్ చాంపియన్‌షిప్‌లలో పతకాన్ని సాధించి ఉండాలి.
-శారీరక ప్రమాణాలు: పురుషులు 170 సెం.మీ. ఎత్తు, 80 సెం.మీ ఛాతీ ఉండాలి, గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి. మహిళలు 157 సెం.మీ ఎత్తు ఉండాలి.
-దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ. 100/-, ఎస్సీ/ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: డాక్యుమెంటేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్యపరీక్షల ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 21
-వెబ్‌సైట్: www.recruitment.itbpolice.nic.in

308
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles