జియో సైంటిస్ట్ & జియాలజిస్ట్ ఎగ్జామ్


Fri,March 22, 2019 12:22 AM

-మొత్తం ఖాళీలు: 106
-విభాగాల వారీగా.. జియాలజిస్ట్ గ్రూప్ ఏ- 50, జియోఫిజిసిస్ట్ (గ్రూప్ ఏ)- 14, కెమిస్ట్ (గ్రూప్ ఏ) - 15, జూనియర్ హైడ్రోజియాలజిస్ట్ (సైంటిస్ట్ బీ)- 27 ఖాళీలు ఉన్నాయి.
-వయస్సు: 2019, జనవరి 1 నాటికి జూనియర్ హైడ్రోజియోజియాలజిస్ట్ పోస్టులకు 21-35 ఏండ్లు, మిగతా పోస్టులకు 21-32 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అర్హతలు: జియాలజిస్ట్ పోస్టులకు.. జియాలజికల్ సైన్స్/జియాలజీ లేదా జియో/మినరల్ ఎక్స్‌ప్లోరేషన్, ఇంజినీరింగ్/మెరైన్ జియాలజీ, జియో కెమిస్ట్రీ, జియాలజికల్ టెక్నాలజీ, జియోఫిజికల్ టెక్నాలజీలో పీజీ/తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. జియోఫిజిసిస్ట్ పోస్టులకు.. ఎమ్మెస్సీ (ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్) లేదా ఎమ్మెస్సీ (జియోఫిజిక్స్/టెక్నాలజీ, అప్లయిడ్ జియోఫిజిక్స్), ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-కెమిస్ట్ పోస్టులకు.. కెమిస్ట్రీ/అప్లయిడ్ కెమిస్ట్రీ/అనలిటికల్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.
-హైడ్రోజియాలజిస్ట్ పోస్టులకు.. జియాలజీ లేదా అప్లయిడ్/మెరైన్ జియాలజీలో పీజీ ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్
-పరీక్ష విధానం: రాతపరీక్షలో జనరల్ ఇంగ్లిష్-100 (కామన్ పేపర్), పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో పేపర్1- 200, పేపర్2- 200, పేపర్3- 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. మొత్తంగా రాతపరీక్షకు 700 మార్కులు, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌కు 200 మార్కులు ఉంటాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-అప్లికేషన్ ఫీజు: రూ.200/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు)
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 16
-పరీక్షతేదీ: జూన్ 28
-వెబ్‌సైట్: www.upsconline.nic.in

476
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles