సీయూ సెట్-2019


Wed,March 20, 2019 01:53 AM

CU-CET
కేంద్రీయ విశ్వవిద్యాలయాలు పలు ప్రత్యేకతలతో విద్యనందిస్తూ అగ్రశ్రేణి విద్యాసంస్థలుగా పేరుగాంచాయి. విభిన్నమైన, ఉపాధికి భరోసానిచ్చే కోర్సులను అందిస్తున్న సంస్థలు ఇవి. దేశవ్యాప్తంగా 14 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వివరాలు సంక్షిప్తంగా...

- కోర్సులు: యూజీ,పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ
- యూజీ కోర్సులు: ఇంటర్నేషనల్ రిలేషన్స్, అప్పెరల్ (డ్రెస్ డిజైనింగ్ అండ్ ట్రెయినింగ్), బీఎస్సీ బీఈడీ (మ్యాథ్స్),బీఏ బీఈడీ, బీఏ ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ- ఎమ్మెస్సీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యూటీ అండ్ వెల్‌నెస్, బయోకెమిస్ట్రీ, బయోమెడికల్ సైన్సెస్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, టూరిజం మేనేజ్‌మెంట్, టెక్స్‌టైల్, మ్యాథ్స్, జువాలజీ తదితర డిగ్రీ కోర్సులు ఉన్నాయి.
- వీటితోపాటు ఇంటిగ్రేటెడ్ యూజీ కోర్సులు, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులు ఉన్నాయి.

ప్రవేశాలు కల్పించే విశ్వవిద్యాలయాలు:

- దేశవ్యాప్తంగా ఉన్న 14 సెంట్రల్ యూనివర్సిటీలు అవి... ఏపీ, అసోం, గుజరాత్, హర్యానా, జమ్ము, జార్ఖండ్, కర్ణాటక, కాశ్మీర్, కేరళ, మహాత్మాగాంధీ (బీహార్), రాజస్థాన్, తమిళనాడు, పంజాబ్, దక్షణ బీహార్‌తోపాటు బెంగళూరులోని డా.బీఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్.
- ఫీజు: జనరల్/ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.350/-, పీహెచ్‌సీలకు ఎటువంటి ఫీజు లేదు.
- పరీక్ష విధానం: అన్ని ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఇస్తారు.
- పార్ట్ ఏ లో లాంగ్వేజీ, జనరల్ అవేర్‌నెస్, మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు.
- పార్ట్ బీలో సంబంధిత సబ్జెక్టు నుంచి 75 ప్రశ్నలు ఇస్తారు.
- ఎంబీఏ, ఎంసీఏ, బీవొకేషనల్, ఎల్‌ఎల్‌బీ తదితర ఇంటిగ్రేటెడ్ కోర్సులకు 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్క పేపర్ మాత్రమే ఉంటుంది.
- పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు.
- అండర్ గ్రాడ్యుయేట్, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.

- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఏప్రిల్ 13
- పరీక్ష తేదీలు: మే 25, 26,
- పరీక్ష ఫలితాల వెల్లడి: జూన్ 21
- పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్.
- వెబ్‌సైట్: https://cucetexam.in

- కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

703
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles