టార్గేట్ ఎంసెట్..!


Wed,March 20, 2019 01:51 AM

EAMCET
ఎంసెట్.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష. రాష్ట్రంలో ఇంటర్‌స్థాయిలో ఎక్కువమంది విద్యార్థులు రాసే ఎంట్రెన్స్ టెస్ట్ ఎంసెట్. దీనిలో మంచి మార్కులతో టాప్‌ర్యాంక్ సాధిస్తే జేఎన్‌టీయూ, ఓయూతోపాటు టాప్ కాలేజీలో ఇంజినీరింగ్ చేయవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మే 3,4,6 తేదీల్లో ప్రవేశ పరీక్ష జరుగనుంది. మధ్యలో జేఈఈ మెయిన్ పరీక్ష ఉంది. ఇంటర్ పరీక్షల తర్వాత సుమారు నెల ఇరవైరోజుల సమయం ఉంటుంది. ఈ విధంగా ప్రిపేర్ అయితే ఎక్కువ మార్కులు సాధించవచ్చు అనే విషయాలపై జేఈఈ, ఎంసెట్ కోచింగ్‌లో నిష్ణాతుల సూచనలు, సలహాలు ఎంసెట్ రాసే విద్యార్థుల కోసం...

- ఎంసెట్: ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో మొత్తం 160 ప్రశ్నలు ఇస్తారు. దీనిలో మ్యాథ్స్ నుంచి 80, ఫిజిక్స్-40, కెమిస్ట్రీ-40 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష కాలవ్యవధి 3 గంటలు.
- అన్ని ప్రశ్నలు బహుళైచ్ఛిక (ఎంసీక్యూ) విధానంలో ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.

మ్యాథ్స్

ఎంసెట్‌లో కీలకమైన రోల్ మ్యాథ్స్‌ది. మొత్తం 160 మార్కుల్లో 80 మార్కులు మ్యాథ్స్‌వే. కాబట్టి దీనిలో ఎక్కువ మార్కులు సాధించినవారికి మంచి ర్యాంక్ వస్తుందనడంలో సందేహం లేదు. మ్యాథ్స్ ప్రిపరేషన్‌పై నానో ఐఐటీ అకాడమీ డైరెక్టర్, మ్యాథ్స్ సీనియర్ ఫ్యాకల్టీ కాసుల కృష్ణచైతన్య అందించిన సలహాలు, సూచనలు ఆయన మాటల్లో....
- ఎంసెట్ కాలవ్యవధి 3 గంటలు. దీనిలో ఎక్కువ భాగాన్ని అంటే సుమారు 2 నుంచి 2.15 నిమిషాలు మ్యాథ్స్‌కు కేటాయించాలి.
- డీఈ, 2డీ, ప్రొగెషన్స్ చాప్టర్ల నుంచి వచ్చే ప్రశ్నలు లెంథీగా ఉంటాయి. కాబట్టి సమయం ఎక్కువ తీసుకునే ప్రశ్నలను చివర్లో సాల్వ్ చేయాలి.
- 3డీ, లిమిట్స్ కంటిన్యుటీ, డెఫినిట్ ఇంటిగ్రేషన్, స్టాటిస్టిక్స్, కాంప్లెక్స్ నంబర్స్ నుంచి వచ్చే ప్రశ్నలకు తక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఇటువంటి ప్రశ్నలను ముందుగా చేయాలి.
- కో ఆర్డినేట్ జామెట్రీ (స్ట్రెయిట్‌లైన్స్ తదితర), త్రికోణమితిలోని ఫార్ములాలను బాగా చూసుకోవాలి.
- 3డీ, వెక్టార్స్, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్‌లను బాగా చేయాలి.
- ముఖ్యంగా ఇంటర్ మొదటి సంవత్సరం నుంచి 40-45 శాతం ప్రశ్నలు వస్తాయి, అంతేకాకుండా ఇవి సులువైన టాపిక్స్. వీటిని ఎక్కువగా రివిజన్ చేసుకోవాలి.
- ఎంసెట్‌లో నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు కాబట్టి ఏవైనా ప్రశ్నలు కఠినంగా ఉన్నా జవాబు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్‌లో గుర్తించండి. రివ్యూకు మార్క్ చేసుకుని అవకాశం ఉంటే చివర్లో చేయండి లేదా ముందుగా గుర్తించిన జవాబును ఫైనల్ చేయండి.

- ఇంటిగ్రేషన్, కోఆర్డినేట్ జామిట్రీ చాప్టర్ల నుంచి ప్రశ్నలు చేయడం సులువు. కాబట్టి చాయిస్ కింద ఎట్టి పరిస్థితుల్లో వదలవద్దు. అన్ని సాల్వ్ చేయండి.
- పర్మిటేషన్స్ చాప్టర్ నుంచి సులువైన ప్రశ్నలు వస్తాయి. కాకపోతే తొందరపడి, కంగారుపడి జవాబులు గుర్తించకండి. ప్రశ్నను మంచిగా చదివి, అర్థం చేసుకుని జవా బు గుర్తించండి.
- అన్ని చాప్టర్లకు సమాన వెయిటేజీ కాబట్టి అన్ని టాపిక్స్‌ను కవర్ చేస్తూ ప్రిపరేషన్ పూర్తిచేయాలి.
- మీన్, వేరియన్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ నుం చి కచ్చితంగా ప్రశ్న వస్తుంది ఇది సులువైనది కాబట్టి దీన్ని రివిజన్‌లో బాగా చూసుకోండి. ఇదేవిధంగా ప్రాబబులిటీ, క్వార్డాట్రిక్స్ రిలేషన్ బిట్‌వీన్ రూట్స్, లొకేషన్ ఆఫ్ రూట్స్ కాన్సెప్ట్, కాంప్లెక్స్ నంబర్స్‌లో ఎన్‌త్ రూట్ ఆఫ్ యూనిటీ, జామెట్రీ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్, ఏపీ, జీపీ, ఏజీపీ క్షుణ్ణంగా చేసుకోండి.

- డెఫినెట్ ఇంటిగ్రల్స్‌లో ప్రాపర్టీస్ అన్ని చూసుకోవాలి.
- ముఖ్యంగా ఎంసెట్‌లో సమయం కీలకం. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానం గుర్తించాలి.
- ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది.
- జేఈఈ మెయిన్ ప్రిపేర్ అయ్యేవారు మెయిన్స్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ప్రీవియస్ పేపర్స్ విశ్లేషణ చేసుకుని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది.
- ఎగ్జామ్‌కు ముందు కనీసం 6-7 గ్రాండ్ టెస్ట్‌లు రాస్తే మంచిది.
- ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్‌ను తప్పక సాల్వ్ చేయండి. రెగ్యులర్‌గా వచ్చే ప్రశ్నలకు స్టాండర్డ్ ఆనర్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.
- జేఈఈ మెయిన్, ఎంసెట్ సిలబస్ దాదాపు ఒకటి రెండు అంశాలు తప్ప అంతా సమానమే. ప్రశ్నలు అడిగే విధానంలో మార్పు తప్ప సిలబస్ ఒక్కటే.
- మెయిన్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎంసెట్‌కు ఉపయోగపడుతుంది.
- ఎంసెట్‌లో 30-40 శాతం ప్రశ్నలు సులువుగా ఉంటా యి. రెండోది నెగెటివ్ మార్కింగ్ లేదు. తప్పనిసరిగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి.
- మ్యాథ్స్ ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయం కేటాయించా లి. ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తే మంచి ర్యాంక్ వస్తుంది.
- అకడమిక్ బుక్స్ సరిపోతాయి. ప్రాక్టీస్ కీలకం.
krishna

ఫిజిక్స్

ప్రతి ఇంజినీరింగ్ ఎగ్జామ్‌లో ఫిజిక్స్ అంటే చాలామందికి భయం. నిజానికి ఫిజిక్స్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకుని చదివితే సులభంగా జవాబులు గుర్తించవచ్చు. ఫిజిక్స్‌లో ఏయే చాప్టర్లకు ఎంత వెయిటేజీ ఉంటుంది, ఎలా చదవాలి అనే విషయాలపై ఫిజిక్స్ ఫ్యాకల్టీ రాధాకృష్ణమూర్తి ఇస్తున్న సలహాలు, సూచనలు...

- ఎంసెట్‌లో ఫిజిక్స్‌కు 40 మార్కులు కేటాయించారు, 40 ప్రశ్నలు వస్తాయి.
- ఫస్టియర్‌లోని మెకానిక్స్‌కు 25 శాతం, మెటీరియల్ ఫిజిక్స్‌కు 10, టెంపరేచర్, హీట్ అంశాలకు 15 శాతం అంటే మొత్తం 50 శాతం ప్రశ్నలు వస్తాయి.
- సెకండియర్‌లోని వేవ్స్ అండ్ ఆప్టిక్స్-20, ఎలక్ట్రిసిటీ-20, మోడరన్ ఫిజిక్స్-10 శాతం చొప్పున మొత్తం 50 శాతం ప్రశ్నలు వస్తాయి.
- ఫస్టియర్‌లోని మెకానిక్స్ చాప్టర్‌లో ప్రాథమిక అంశాలను చేసుకుంటే మిగిలిన చాప్టర్లు అర్థమవుతాయి.
- ఫిజిక్స్‌లో చాలా అంశాలు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. ఇంటర్ లింక్డ్ కాబట్టి ప్రతి అంశంపై అవగాహన తప్పనిసరి.
- ఇంటర్‌లో మొత్తం 30 చాప్టర్లు ఉన్నాయి. వీటిలో ఫిజికల్ వరల్డ్ పక్కన పెడితే మిగిలిన 29 చాప్టర్ల నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు.
- ఎలక్ట్రిసిటీ, ఆప్టిక్స్, మెకానిక్స్ చాప్టర్లపై ఎక్కువ దృష్టి పెట్టండి.

- ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎంసెట్‌కు సుమారుగా 50 రోజుల సమయం ఉంటుంది. ప్రతిరోజు ఒక చాప్టర్ చొప్పున కనీసం 3 గంటలు చదివితే అన్ని టాపిక్స్ పూర్తి చేయవచ్చు.
- ప్రతిరోజు ఒకచాప్టర్ ప్రిపేర్/రివిజన్ చేసుకోవాలి. ఆ చాప్టర్‌లోని ఫార్ములాలను ఫ్లాష్‌కార్డు/చార్ట్‌లుగా తయారుచేసుకుని తప్పనిసరిగా ఒక్కసారైనా చూసుకోవాలి.
- 30 చాప్టర్లు చదవడం, ఆయా చాప్టర్ల వారీ టెస్ట్‌లు రాయడం మంచిది.
- అన్ని పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ విధానంలో కనీసం 5కు తగ్గకుండా గ్రాండ్ టెస్ట్‌లను రాయాలి.
- ఫిజిక్స్ కోసం అకడమిక్ పుస్తకాలను బాగా చదవండి.
- ప్రాబ్లమ్స్ సాల్వింగ్ కోసం ఫార్ములాలను అప్లయ్ చేయడం తెలుసుకోవాలి.
- చాలామంది ఇంజినీరింగ్ ఎగ్జామ్స్‌లో కెమిస్ట్రీ, తర్వాత మ్యాథ్స్ చేసి మిగిలిన సమయంలో ఫిజిక్స్ సమాధానాలు గుర్తిస్తున్నారు. వారివారి స్ట్రాటజీల ప్రకారం జవాబులు గుర్తించడం మంచిదే.
- ఫిజిక్స్ జవాబులు గుర్తించే సమయంలో మొదట డైరెక్ట్ ఆన్సర్స్‌ను గుర్తించి తర్వాత ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేయండి.
- ఎంసెట్‌లో టైం మేనేజ్‌మెంట్ కీలకం. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానం గుర్తించాల్సి ఉంటుంది. దీనికోసం ఎగ్జామ్ ముందురోజు వరకు ప్రాక్టీస్ మిస్ కాకూడదు. - కాన్సెప్ట్స్ అన్ని క్షుణ్ణంగా తెలుసుకొని అప్లయ్ చేయడం వస్తే ఫిజిక్స్‌లో కూడా మంచి స్కోర్ సాధించవచ్చు.
Radhakrishnamurthy

కెమిస్ట్రీ

ఎంసెట్, జేఈఈ మెయిన్స్‌లో ఎక్కువ మార్కులు స్కోరింగ్ చేసే సబ్జెక్టు కెమిస్ట్రీ. కొంచెం కష్టపడితే ఫుల్ మార్కులు సాధించవచ్చు. ఈ సబ్జెక్టులో ఏయే టాపిక్స్ చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి, స్కోరింగ్ టెక్నిక్స్‌పై ఐఐటీ సీనియర్ ఫ్యాకల్టీ పెండ్లి కృపాకర్ చెప్పిన సూచనలు, సలహాలు ఆయన మాటల్లో...
Thinkstock
- కెమిస్ట్రీ నుంచి ఎంసెట్‌లో 40 మార్కులు వస్తాయి.
- గత ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే ఫస్టియర్ నుంచి కనీసం 20- 22 ప్రశ్నలు వస్తున్నాయి.
- కెమిస్ట్రీని మూడు భాగాలుగా చూడాలి. ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ. వీటిలో ఫిజికల్, ఆర్గానిక్ చాలా ముఖ్యమైనవి.
- ఫస్ట్ ఇయర్‌లో పరమాణు నిర్మాణం (అటామిక్ స్ట్రక్చర్), రసాయన బంధం (కెమికల్ బాండింగ్), స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, కెమికల్ ఈక్విలిబిరియం, స్టాటియోమెట్రీ, అయానిక్ ఈక్విలిబిరియంతోపాటు ఆర్గానిక్ కెమిస్ట్రీ చూసుకోవాలి.
- ఇక థర్మోడైనమిక్స్ విషయానికి వస్తే ఫిజిక్స్‌లో వచ్చిన ఇదే అంశాన్ని ప్రిపేరై హెస్లా, ఎంట్రోపీ, హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ టాపిక్స్ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది.
- సెకండియర్ టాపిక్స్ పరిశీలిస్తే.. సొల్యూషన్స్ (ద్రావణా లు), సాలిడ్ స్టేట్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనటిక్స్‌లో న్యూమరల్స్ బాగా ప్రిపేర్ కావాలి. మెటలర్జీలో ఓర్ ఎక్స్‌ట్రాక్షన్ నుంచి ప్రతిసారి ఒక్కప్రశ్న తప్పక ఇస్తున్నారు.
- సెకండియర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐడెంటిఫికేషన్ టెస్ట్ (ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ) నుంచి 2 లేదా 3 ప్రశ్నలు వస్తాయి.

- పాలీమర్స్‌లో పుస్తకంలోని టాబులర్ ఫార్ములా చూసుకోవాలి. నాలుగేండ్లుగా దీని నుంచి ఒక ప్రశ్న వస్తుంది.
- ఫిజికల్ కెమిస్ట్రీలోని అన్ని న్యూమరికల్, ఫార్ములాల చార్ట్ తయారు చేసుకోండి. వీటిని బైహార్ట్ చేయడంతోపాటు అప్లయ్ చేయడం ప్రాక్టీస్ చేయండి.
- ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేమ్డ్ రియాక్షన్స్, కాంపౌండ్ కన్వర్ష న్స్ (రియాక్షన్ తర్వాత వచ్చే కాంపౌండ్స్) చదవండి.
- ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్, సెకండ్ ఇయర్ కలిపి చదవండి. మంచి ప్రయోజనం ఉంటుంది.
- ఎంసెట్‌లో ఎక్కువ మార్కులు పొందాలంటే ప్రధానంగా అకడమిక్ బుక్స్‌లో పాఠ్యాంశం చివర ఉండేరెండుమార్కుల ప్రశ్నలను తప్పక చదవాలి. దీనివల్ల 60 శాతం మార్కులు మీసొంతం.
- న్యూమరికల్స్, 2 మార్కుల ప్రశ్నలను తప్పక రెండుసార్లు రివిజన్ చేసుకోండి.

- ఇనార్గానిక్ కెమిస్ట్రీ కోసం అకడమిక్ బుక్ చదివితే 100 శాతం సమాధానాలు గుర్తించవచ్చు.
- జేఈఈ మెయిన్ ప్రిపేర్ అవుతున్నవారు మెయిన్ ఎగ్జామ్ తర్వాత ఎంసెట్ కోసం ప్రాక్టీస్ ప్రారంభించండి. మెయిన్ కోసం ప్రిపేరైన సబ్జెక్టు అంతా ఎంసెట్‌కు సరిపోతుంది.
- గత కొన్నేండ్ల జేఈఈ మెయిన్, ఎంసెట్ కెమిస్ట్రీ ప్రశ్నలను పరిశీలిస్తే ఎంసెట్ ప్రశ్నలే కఠినంగా ఉంటున్నాయి. నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు కాబట్టి ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించండి.
- బ్లూబేబీ సిండ్రోమ్ అంటే చాలా మంది విద్యార్థులు మాకు తెలియదు, అవుట్ ఆఫ్ సిలబస్ అంటారు. కానీ ఈ అంశం టెక్ట్స్‌బుక్‌లో ఉంది.
- నీటిలో నైట్రేట్ అయాన్ కాన్‌సంట్రేషన్ 50 పీపీఎం కంటే ఎక్కువగా ఉంటే ఈ సిండ్రోమ్ వస్తుంది. ఇలాం టి విషయాలు బుక్‌లో చాలా ఉన్నాయి.
- ఇలా అకడమిక్ బుక్‌ను ఫాలో అయితే తప్పక 35 మార్కులకు పైగా స్కోర్ చేయవచ్చు.
Krupakar

825
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles