టీఎస్ ఎంసెట్-2019


Wed,March 20, 2019 01:50 AM

TS-EAMCET
తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్,అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్) నోటిఫికేషన్‌ను జేఎన్‌టీయూహెచ్ విడుదల చేసింది.

- ఎంసెట్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్. దీన్ని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎస్‌సీహెచ్‌ఈ) తరపున జేఎన్‌టీయూ హైదరాబాద్ నిర్వహిస్తుంది.
ఇంజినీరింగ్ స్ట్రీమ్:
- బీఈ/బీటెక్, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటె క్ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బీటెక్ (బయోటెక్నాలజీ), బీఫార్మా (ఎంపీసీ)/ఫార్మా-డీ (ఎంపీసీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
- అర్హతలు: ఇంటర్/10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఉత్తీర్ణులు లేదా సెకండియర్ పరీక్షలు రాసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ వొకేషనల్ కోర్సు చేసినవారు సంబంధిత సబ్జెక్టుల్లో బ్రిడ్జ్ కోర్సు చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల నాటికి అభ్యర్థుల వయస్సు 16 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.
- బీటెక్ (డెయిరీ టెక్నాలజీ, ఏజీ ఇంజినీరింగ్, ఎఫ్‌టీ, సీఏ అండ్ బీఎం), ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాల నాటికి 17 ఏండ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి 22 ఏండ్లు, రిజర్వ్‌డ్ కేటగిరీలకు 25 ఏండ్లు.

ఎంసెట్ అగ్రికల్చరల్ అండ్ మెడికల్ (ఫార్మసీ, వెటర్నరీ తదితర)

- ఎంసెట్ (ఏఎం) స్ట్రీమ్ ద్వారా బీఎస్సీ (అగ్రికల్చరల్), బీఎస్సీ (హార్టికల్చర్), బీఎస్సీ (ఫారెస్ట్రీ), బీవీఎస్సీ & ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ, బీటెక్ (ఎఫ్‌టీ), బీఫార్మా, బీటెక్ (బయోటెక్నాలజీ-బైపీసీ), ఫార్మా -డీ (బైపీసీ).

అర్హత మార్కులు

- టీఎస్ ఎంసెట్‌లో 25 శాతం మార్కులు (మొత్తం మార్కుల్లో) వస్తే అర్హతగా పరిగణించి ర్యాంకింగ్ ఇస్తారు. ఎస్సీ/ఎస్టీలకు ఎటువంటి అర్హత మార్కులు లేవు.
- మూడురోజుల్లో నిర్వహించే పరీక్షకు నార్మలైజేషన్ విధానంలో మార్కులను ప్రకటించి ర్యాంకింగ్ ఇస్తారు.

- అగ్రికల్చరల్ అండ్ మెడికల్ (ఏఎం) పరీక్ష తేదీలు: మే 8, 9
- ప్రతిరోజు రెండు సెషన్లు ఉంటాయి. ఉదయం 10 నుంచి 1 గంట వరకు. మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు.
- పరీక్ష విధానం: మొత్తం 160 ప్రశ్న లు- 180 నిమిషాలు.
- బయాలజీ-80 (బాటనీ-40, జువాలజీ-40), ఫిజిక్స్-40, కెమిస్ట్రీ-40 ప్రశ్నలు ఇస్తారు.
- అన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ (మల్టిపుల్ చాయిస్) విధానంలో ఉంటాయి
- నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.

- అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణులు లేదా సెకండియర్ పరీక్ష లు రాసినవారు అర్హులు. కోర్సుల వారీగా అర్హతలు... (కింద ఆయా కోర్సులకు ఎదురుగా ఇచ్చిన వాటిలో రెండు/మూడు సబ్జెక్టులను చదివి ఉండాలి)
- బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ - ఫిజికల్ సైన్సెస్,బయాలజికల్ లేదా నేచురల్ సైన్సెస్, అగ్రికల్చర్, అగ్రికల్చర్‌లో వొకేషనల్ కోర్సు.
- బీఎస్సీ (ఫారెస్ట్రీ) - ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ
- బీవీఎస్సీ &ఏహెచ్- ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ లేదా నేచురల్ సైన్సెస్
- బీఎఫ్‌ఎస్సీ - ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ లేదా నేచురల్ సైన్సెస్ లేదా ఫిషరీ సైన్సెస్‌లో వొకేషనల్ కోర్సు.
- బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ)- మ్యాథ్స్, ఫిజిక్స్ లేదా ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్/నేచురల్ సైన్సెస్.

పరీక్ష విధానం:

- మీడియం- ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగు/ ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఇస్తారు.
- పరీక్షలో 160 ప్రశ్నలు ఉంటాయి. 160 మార్కులు.
- మ్యాథ్స్ -80, కెమిస్ట్రీ-40, ఫిజిక్స్-40 ప్రశ్నల చొప్పున ఇస్తారు.
- పరీక్ష కాలవ్యవధి 3 గంటలు
- పరీక్ష తేదీలు - మే 3, 4, 6. ప్రతిరోజు రెండు సెషన్లు ఉంటాయి. ఉదయం 10 నుంచి 1 గంట వరకు. రెండో సెషన్ 3 నుంచి 6 గంటల వరకు.
- నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
- ఎగ్జామ్ ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ (మల్టిపుల్ చాయిస్) విధానంలో ప్రశ్నలు ఇస్తారు.

నోట్: పైన పేర్నొన్న ఏ సబ్జెక్టు చదివినా ఏఎం స్ట్రీమ్‌లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి మాత్రమే ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థులకు 17 ఏండ్లు నిండి ఉండాలి. 22 ఏండ్లు మించరాదు.
- బీఫార్మా కోర్సు- ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత. ఆప్షనల్ సబ్జెక్టుల్లో కనీసం 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ప్రవేశాల నాటికి 16 ఏండ్లు నిండి ఉండాలి.

- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఏప్రిల్ 5
- రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.800/-
- ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.400/-
- అపరాధ రుసుం రూ. 500తో చివరితేదీ: ఏప్రిల్ 11
- వెబ్‌సైట్: www.eamcet.tsche.ac.in

- ఫార్మా- డీ కోర్సు - (50 శాతం సీట్లు ఎంపీసీ, 50 శాతం బైపీసీ విద్యార్థులకు కేటాయిస్తారు) - ఇంటర్ ఎంపీసీ/బైపీసీ ఉత్తీర్ణత. ఆప్షనల్ సబ్జెక్టుల్లో కనీసం 45 శాతం మార్కులు రావాలి. డిసెంబర్ 31 నాటికి 17 ఏండ్లు నిండి ఉండాలి.

- కేవీ శర్మ

1067
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles