Telangana Intermediate 1st & 2nd Year Results 2019

గ్యరంటీ కొలువులు CHSL ప్రిపరేషన్ ప్లాన్


Wed,March 20, 2019 01:46 AM

Students
దేశంలో ఏటా క్రమం తప్పకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే సంస్థ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ). రాష్ర్టాలు, కేంద్రానికి సంబంధించిన ఏ ఉద్యోగ ప్రకటనలు రాకపోయినా ఎస్‌ఎస్‌సీ ఉద్యోగ ప్రకటనలు మాత్రం క్రమం తప్పకుండా వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న బలమైన కోరిక ఉన్న అభ్యర్థులు కొంచెం కష్టపడితే ఎస్‌ఎస్‌సీ భర్తీ చేసే క్లరికల్ స్థాయి ఉద్యోగాలు సాధించుకోవచ్చు. ఎస్‌ఎస్‌సీ ఇటీవలే సీహెచ్‌ఎస్‌ఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఉద్యోగాలకు ఎలా సన్నద్ధం అవ్వాలన్న అంశంపై నిపుణ పాఠకులకు ప్రత్యేకం...

- కేంద్రప్రభుత్వ సంస్థలైన ఇన్‌కమ్‌ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ మొదలైన 25 కంటే ఎక్కువగా డిపార్ట్‌మెంట్లలో క్లరికల్ పోస్టులకు ఇటీవలే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ (కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్) పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపికచేస్తారు.

ప్రిలిమ్స్

- పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 60 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాలి. ఇందులో నాలుగు విభాగాలు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్‌ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నలు, ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 200 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు జవాబుకు 0.50 మార్కులు తగ్గిస్తారు.
- ఇందులో సెక్షన్‌వైజ్ కటాఫ్ ఉండదు. 200 మార్కుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా కటాఫ్ నిర్ణయిస్తారు.
- అర్థమెటిక్: ఇది అత్యంత ముఖ్యమైన విభాగం. ఇందులో ముఖ్యమైన చాప్టర్లు నంబర్ సిస్టమ్, నిష్పత్తులు, శాతాలు, నష్టాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. అలాగే జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నామెట్రీల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. ఆర్‌ఎస్ అగర్వాల్, అరిహంత్ సిరీస్ పుస్తకాల్లో చాప్టర్ల వారీగా అన్ని చదువుతూ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో ప్రశ్నలు ఎక్కువగా కాన్సెప్ట్ ఆధారంగా ఉంటాయి. అంటే షార్ట్‌కట్స్ కంటే సబ్జెక్ట్ మీద అవగాహన ముఖ్యం.
- కిరణ్ పుస్తకాల్లో చివరి రెండు లేదా మూడేండ్లలో జరిగిన అన్ని ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. దీంతో ప్రశ్నలమీద ఒక అవగాహన వస్తుంది. బాగా చదివితే కచ్చితంగా మార్కులు వచ్చే విభాగం ఇది. కాబట్టి ప్రత్యేక శ్రద్ద అవసరం.

- రీజనింగ్: ఈ విభాగం నుంచి వెర్బల్, నాన్‌వెర్బల్ ప్రశ్నలు వస్తాయి. నంబర్ సిరీస్, కోడింగ్, అనాలజీ, డయాగ్రమ్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. గతేడాది ప్రశ్నపత్రాల ఆధారంగా ఆ టాపిక్స్‌కి సంబంధించిన ప్రశ్నలను ఆర్‌ఎస్ అగర్వాల్ రీజనింగ్ బుక్ నుంచి చదవాలి. ఇందులో తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది.

పరీక్ష విధానం

ఉద్యోగ నియామక పరీక్ష మూడు దశల్లో ఉంటుంది. అవి...

1. ప్రిలిమ్స్ (టైర్-1) ఆబ్జెక్టివ్ కంప్యూటర్ బేస్డ్ పరీక్ష
2. మెయిన్స్ (టైర్-2) డిస్క్రిప్టివ్
3. టైపింగ్ టెస్ట్ (టైర్-3)
Students1

- ఇంగ్లిష్: ఇందులో మూడు భాగాలు ఉంటాయి. గ్రామర్ (ఫైండింగ్ ఎర్రర్స్), వొకాబులరీ (ఇడియమ్స్, వన్ వర్డ్స్, మొదలైనవి), ప్యాసేజ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. గ్రామర్‌కి raymond murphy book బాగుంటుంది. తర్వాత ప్రాక్టీస్‌కు కిరణ్ ఎస్‌ఎస్‌సీ ఇంగ్లిష్ బుక్ రెఫర్ చేయాలి.
- జనరల్ అవేర్‌నెస్: ఇందులో సైన్స్, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ నుంచి ప్రశ్నలు వస్తాయి. కరెంట్ అఫైర్స్ నుంచి కూడా రెండు నుంచి మూడు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అరిహంత్ సిరీస్‌లో బుక్స్ చదవాలి. దీంతోపాటు ఎన్‌సీఈఆర్‌టీ (సీబీఎస్‌ఈ) స్కూల్ బుక్స్‌లో బిట్లు ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లిష్ న్యూస్ పేపర్లు చదవడం వల్ల ఇంగ్లిష్ విభాగంలో, కరెంట్ అఫైర్స్ రెండింటికీ ఉపయోగపడుతుంది.
- ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా కటాఫ్ తీసి కొందరిని మెయిన్స్‌కి ఎంపికచేస్తారు. ప్రిలిమ్స్‌లో ప్రతి తప్పు జవాబుకు 0.50 మార్కులు కోత విధిస్తారు. అందువల్ల వచ్చిన ప్రశ్నలకే జవాబులు గుర్తించడం మంచిది. ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కులు చివరి సెలెక్షన్‌లో కలుపుతారు కాబట్టి ప్రతిమార్కు ముఖ్యమైనదే.

మెయిన్స్

- ఇది డిస్క్రిప్టివ్ పరీక్ష. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై నిర్వహించే ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. గంటలో పరీక్షను పూర్తి చేయాలి. 200 నుంచి 250 పదాల్లో ఎస్సే, 150-200 పదాల్లో లెటర్ రాయాల్సి ఉంటుంది.
- మెయిన్స్ నుంచి తర్వాతి రౌండ్‌కి వెళ్లాలంటే కనీసం 33 శాతం మార్కులు రావాలి. అంటే 100కి 33 మార్కులు స్కోర్ చేయాలి. దీనికోసం ఇంగ్లిష్ న్యూస్ పేపర్‌లో కొన్ని టాపిక్స్, రాజకీయాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ వంటివాటి మీద ఎస్సే రాయమని అడగవచ్చు.
- ఒక ప్రాంతంలో సమస్యలపై ప్రభుత్వానికి లేఖలు రాయడం, నీటి సమస్యపై స్పందించడం వంటి ప్రశ్నలు లెటర్ రైటింగ్‌లో అడుగుతారు. ఇందులో సిన్‌టెక్స్ బాగా రాస్తే మార్కులు ఎక్కువగా వస్తాయి.
- టైర్-2ని హిందీ లేదా ఇంగ్లిష్‌లో రాయవచ్చు.

టైర్-3

- ఇది స్కిల్ లేదా టైపింగ్ టెస్ట్. టైర్-1, 2 పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ తుది పరీక్షకు పిలుస్తారు. ఇది కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే.

డీఈఓలకు స్కిల్ టెస్ట్

- డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్‌కి కచ్చితంగా స్కిల్ టెస్ట్ రాయాలి. 15 నిమిషాల్లో 2000-2200 Keys టైప్ చేయాలి. దీనికి ఇంగ్లిష్‌లో ఒక ప్యాసేజ్ ఇస్తారు.
- కాగ్ డిపార్ట్‌మెంట్‌లోని డీఈఓ పోస్టు కోసం 15 నిమిషాల్లో 3700-4000 Keys టైప్ చేయాలి.
- ఎల్‌డీసీ/పోస్టల్ అసిస్టెంట్ లాంటి పోస్టులకు 1 నిమిషంలో 35 పదాలు టైప్ చేయాలి.
- మూడు రౌండ్లు పూర్తయ్యాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
- టైర్-1 మార్కులు + టైర్-2 మార్కులు + టైర్-3 అన్నీ కలిపి ఫైనల్ మెరిట్‌లిస్ట్ తీస్తారు.

ముఖ్యమైన తేదీలు

- దరఖాస్తులకు చివరితేదీ- ఏప్రిల్ 5
- ప్రిలిమ్స్ పరీక్ష- జూన్ 1 నుంచి 26 వరకు
- మెయిన్స్- సెప్టెంబర్ 29
- పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.
- వయస్సు: 18-27 ఏండ్లలోపు ఉండాలి. 1992, ఆగస్టు 2 కంటే ముందు జన్మించినవారు అర్హులు కాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌లకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- ఈ పరీక్ష ద్వారా ముఖ్యంగా ఎల్‌డీసీ (లోయర్ డివిజన్ క్లర్క్స్), పోస్టల్ అసిస్టెంట్ (పీఏ), డీఈఓ (డాటా ఎంట్రీ ఆపరేటర్) లాంటి పోస్టులకు అభ్యర్థులను ఎంపికచేస్తారు.
- అర్హత: ఎల్‌డీసీ, పీఏ, డీఈఓ పోస్టులకు 12వ తరగతి లేదా దానికి సమానమైన విద్యార్హత ఉండాలి. కాగ్ డిపార్ట్‌మెంట్‌లో డీఈఓ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్, మ్యాథ్స్ చదివినవారు మాత్రమే అర్హులు.
- అప్లికేషన్లను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు.
- వెబ్‌సైట్: ssc.nic.in

రిఫరెన్స్ బుక్స్

- 151 Essay by Gupta, న్యూస్ పేపర్ల నుంచి, ఇంటర్నెట్ నుంచి కొన్ని ముఖ్యమైన అంశాల్లో ఎస్సేలను తీసుకోవాలి. డీమానిటైజేషన్, ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, బేటీ బచావో-బేటీ పడావో, కేంద్ర బడ్జెట్, జీఎస్‌టీ వంటి అంశాలను ఒకసారి చూసుకోవాలి.
- లెటర్లు అయితే ఆఫీసర్లకు, ప్రిన్సిపల్‌కి, పోలీస్, ఎడిటర్‌కి ఎలా రాస్తారు అని అడగవచ్చు.

Students2

- సీహెచ్‌ఎస్‌ఎల్ కటాఫ్ మార్కులు సరాసరిగా అభ్యర్థులకి వచ్చిన మార్కులు, మొత్తం ఖాళీల సంఖ్య, పరీక్ష ప్రశ్నపత్రం స్థాయి, గతేడాది వచ్చిన కటాఫ్ మార్కుల ఆధారంగా ఉంటాయి.
- ప్రిలిమ్స్‌లో వీలైనన్ని ఎక్కువ మార్కులు రావడానికి కృషి చేయాలి. దీనికోసం ఉపయోగపడే పుస్తకాలు..
1. అర్థమెటిక్: ఆర్‌ఎస్ అగర్వాల్, M.Tyra, అరిహంత్ సిరీస్, సీబీఎస్‌ఈ పుస్తకాలు (ప్యూర్ మ్యాథ్స్ కోసం)
2. రీజనింగ్: ఆర్‌ఎస్ అగర్వాల్, MK Pandey
3. ఇంగ్లిష్ లాంగ్వేజ్: ఎస్‌పీ బక్షీ, ఆర్‌ఎస్ అగర్వాల్, ఇంగ్లిష్ న్యూస్ పేపర్లు
4. జనరల్ అవేర్‌నెస్: లూసెంట్ జీకే, అరిహంత్, మ్యాగజైన్లు
- ప్రీవియస్ పేపర్లు కిరణ్ పబ్లికేషన్స్‌లో నుంచి ప్రాక్టీస్ చేయాలి.

srinivas

540
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles