గోల్డెన్ చాన్న్ జేఈఈ మెయిన్-II


Wed,February 13, 2019 02:01 AM

JEE
ఒక్కసారి పరీక్ష నిర్వహించి ప్రవేశాలు కల్పించడం సహజం. కానీ ఒకే పరీక్షను మూడునెలల వ్యవధిలో రెండుసార్లు నిర్వహించి వాటిలో దేనిలో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుని ర్యాంకు ఇవ్వడం అనేది నిజంగా విద్యార్థులకు సువర్ణావకాశం. మొదటి ప్రయత్నంలో అనారోగ్యం, భయం, ఆందోళన, ఇతర కారణాలతో సరిగ్గా రాయలేనివారికి, రాసి తక్కువ మార్కులు సాధించిన వారికి వరం జేఈఈ మెయిన్ - II. జనవరిలో మెయిన్ - I పరీక్ష జరిగింది. ఫలితాలు వచ్చాయి. అప్పడు రాయనివారు, రాసినా మంచి మార్కులు రానివారు తిరిగి ఏప్రిల్‌లో జరిగే ఈ పరీక్షకు హాజరుకావచ్చు. పరీక్షకు సంబంధించిన వివరాలు సంక్షిప్తంగా...

- జేఈఈ మెయిన్ : దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థలైన ఐఐటీలు, నిట్, ఐఐఐటీ, సీఎఫ్‌టీఐ తదితర సంస్థల్లో ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష జేఈఈ మెయిన్. దీని ద్వారా రెండు ప్రయోజనాలు. ఒకటి దీనిలో వచ్చిన మార్కుల ఆధారంగా నిట్, ఐఐఐటీ, సీఎఫ్‌టీఐల్లో ప్రవేశాలు కల్పిస్తారు. దీంతోపాటు 2.24 లక్షలమందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐఐటీ, సీఎఫ్‌టీఐల్లో జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా జోసా కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు. మెయిన్‌లో 360 మార్కులకు 150 పైగా సాధిస్తే ఏదో ఒక నిట్‌లో సీటు వస్తుంది. 200+ మార్కులు సాధిస్తే కోరుకున్న బ్రాంచీ, టాప్ నిట్‌లలో సీటు సాధించవచ్చు. ఈసారి కొత్తగా పర్సంటైల్ విధానం ప్రవేశపెట్టారు. జనవరి, ఏప్రిల్ మెయిన్‌లలో అభ్యర్థికి దేనిలో ఎక్కువ పర్సంటైల్ వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుని ర్యాంకింగ్ ఇచ్చి ప్రవేశాలు కల్పిస్తారు.

పరీక్ష విధానం

- పేపర్-1 (బీఈ/బీటెక్)- ఆన్‌లైన్ టెస్ట్- మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 30 ప్రశ్నల చొప్పున మొత్తం 90 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. మొత్తం 360 మార్కులు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు ఒకమార్కు కోత విధిస్తారు.
- పేపర్ -2 (బీఆర్క్/బీప్లానింగ్)- పార్ట్-1 ఆప్టిట్యూడ్ టెస్ట్, పార్ట్-2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పార్ట్-3 డ్రాయింగ్ షీట్‌పై పెన్, పేపర్ బేస్డ్ (ఆఫ్‌లైన్) టెస్ట్.
- అర్హతలు: ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు. 2017, 2018లో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణులు లేదా 2019లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు. 2016 లేదా అంతకుముందు ఇంటర్ ఉత్తీర్ణులైనవారు పరీక్ష రాయడానికి అర్హులు కారు.

ముఖ్యతేదీలు

- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: మార్చి 7 (11.50 PM)
- ఫీజు చెల్లించడానికి చివరితేదీ: మార్చి 8
ఫీజు- పేపర్-1 లేదా పేపర్-2 (ఏదైనా ఒకటి) జనరల్/ఓబీసీ బాలురకు రూ.500, బాలికలకు రూ.250. (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ట్రాన్స్‌జెండర్లు, ఏ కేటగిరీకి చెందిన బాలికలకైనా రూ.250/-)
పేపర్-1, పేపర్-2 (రెండూ రాయాలనుకునే వారికి) జనరల్/ఓబీసీ బాలురకు రూ. 900, బాలికలకు రూ. 450/- ( రెండు పేపర్లు రాయడానికి ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ట్రాన్స్‌జెండర్లు, ఏ కేటగిరీకి చెందిన బాలికలకైనా రూ.450/-)
పరీక్ష తేదీలు- ఏప్రిల్ 7 నుంచి 20 వరకు
- పరీక్ష పద్ధతి- కంప్యూటర్ బేస్డ్ (ఆన్‌లైన్‌లో) ప్రతి రోజు రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. ఉదయం షిఫ్ట్- 9.30 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు.
- పేపర్-1 ఫలితాల వెల్లడి- ఏప్రిల్ 30
- పేపర్-2 ఫలితాల వెల్లడి- మే 15
- వెబ్‌సైట్: www.jeemain.nic.in

- కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

1481
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles