ఆర్థికవృద్ధి + ఉత్పాదక పెరుగుదల=?


Wed,February 13, 2019 01:04 AM

వృద్ధి సిద్ధాంతాలు

- సామాజిక శాస్త్రంలో సిద్ధాంతాలు ఉహాకల్పనలు (Hypothesis) సాంఘిక సిద్ధాంతాలు, ఆర్థిక సిద్ధాంతాలు సందర్భాన్ని బట్టి మారుతుంటాయి. అంటే సామాజిక, ఆర్థిక వ్యవస్థలో నిర్దిష్టమైన అంశాన్ని ఊహిస్తారు. అయితే ఆ ఊహలో వాస్తవికత ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు.
- కానీ ఆర్థిక సిద్ధాంతాలు మిగిలిన సాంఘిక సిద్ధాంతాల కంటే కొంతవరకు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. కాబట్టి అర్థశాస్ర్తానికి శాస్త్రహోదా ఉన్నట్లు గమనించాలి. అందువల్ల అర్థశాస్ర్తాన్ని పాల్ ఏ శామ్యూల్‌సన్ సామాజిక శాస్ర్తాలకు రాణి అని పేర్కొన్నాడు.
- అర్థశాస్ర్తాన్ని నిశ్చితశాస్త్రం (Positive science) అని రాబిన్సన్ పేర్కొన్నాడు.
- 1969లో అర్థశాస్ర్తానికి నోబెల్ బహుమతి ఇవ్వడం ప్రారంభించాడు. తొలిసారిగా రాగ్నర్ ప్రిష్ ఈ అవార్డును అందుకున్నాడు.
- కాబట్టి అర్థశాస్ర్తానికి శాస్త్రీయ హోదా కల్పించిన వ్యక్తి లియోనల్ రాబిన్స్.
- ఎకనామిక్స్ అనే ఇంగ్లిష్ పదం Okio, Nomein అనే గ్రీకు పదాల నుంచి ఆవిర్భవించింది. దీని అర్థం గృహ నిర్మాణ శాస్త్రం.
- ఆర్థిక సూత్రాల లక్ష్యం నిదాన పెరుగుదల, సమ్మిళిత వృద్ధి అంటే పెరిగే జాతీయాదాయం అందరికీ వర్తించాలి.
- అదేవిధంగా ఆర్థిక సంక్షేమ లక్ష్యం అసమానతలు లేకుండా ఉండాలి. అంటే అసమానతల వల్ల ఉత్పత్తి కారకాలు (Factors of production) కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ధర లు పెరిగి ద్రవ్యోల్బణం రావడానికి అవకాశం ఉంటుంది.

- ద్రవ్యోల్బణంD డిమాండ్> సప్లయ్ అయితే ధరలు పెరుగుతాయి. నిరంతరం ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.
- మాంద్యంD సప్లయ్> డిమాండ్ అయితే ఆర్థిక మాంద్యం (Depression) పెరుగుతుంది.
- నిరంతరం ధరల తగ్గుదలను మాంద్యం అంటారు.
- అర్థశాస్త్రంలో రెండు రకాల వస్తువులు ఉంటాయి. అవి..

వినియోగ వస్తువులు, ఉత్పాదక వస్తువులు

- వినియోగ, మూలధన వస్తువుల్లో ఒక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఉపయోగపడేవి ఉత్పాదక వస్తువులు లేదా మూలధన వస్తువులు. కాబట్టి వాటిని దిగుమతి చేసుకున్నా నష్టం ఉండదు. కాని వినియోగ వస్తువులను దిగుమతి చేసుకోకూడదు.
- ఏ దేశమైతే దిగుమతులపై అధికంగా ఆధారపడుతుందో ఆ దేశంలో వచ్చే ఆర్థిక సమస్య ద్రవ్యోల్బణం.
- అర్థశాస్త్రంలో ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అనే పదాలు పర్యాయపదాలుగా వాడుతున్నప్పటికీ శ్రీమతి హిక్స్, షుంపీటర్ వంటి ఆర్థిక శాస్త్రవేత్తలు స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపించారు.

map

ఆర్థిక వృద్ధి

- దేశంలో వస్తుసేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థికవృద్ధి అంటారు. ఇది పరిమాణాత్మక మార్పును తెలుపుతుంది. ఫలితంగా దేశ స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుంది.
- దీర్ఘకాలంలో తలసరి వాస్తవ స్థూల జాతీయోత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థికవృద్ధి అంటారు. జాతీయోత్పత్తి పెరుగుదల వ్యాపార చక్రాల వల్ల తాత్కాలికంగా పెరగవచ్చు. ఇది అసలైన వృద్ధికాదు. జాతీయోత్పత్తి పెరుగుదల దీర్ఘకాలంలో కొనసాగాలి. అప్పుడే ఆర్థికవృద్ధి జరుగుతుంది.
- అభివృద్ధి లేకుండా లభించే వృద్ధి అసలైన వృద్ధిగా పరిగణించకూడదు. రాబర్ట్ క్లేవర్ తన గ్రోత్ వితవుట్ డెవలప్‌మెంట్ అనే గ్రంథంలో లైబీరియాలో అభివృద్ధి లేకుండా వృద్ధి ఎలా జరుగుతుందో వివరించాడు. దీనివల్ల ఆ దేశ ప్రతిఫలాలు కొద్దిమందికే అందుతుండటంతో, సామాన్య ప్రజానికం పేదరికంలో మగ్గుతున్నారు.

- వర్ధమాన దేశాలన్నీ ఆర్థికాభివృద్ధిలో ఉన్నాయి. కిండెల్ బర్గర్ ప్రకారం వృద్ధి అనేది మనిషి శారీరక పెరుగుదలతో పోల్చితే, ఆర్థికాభివృద్ధి మనిషి శారీరక, మానసిక అంశాలతో పోల్చబడుతుంది.
- చమురు ఉత్పత్తి దేశాలు ఆర్థికాభివృద్ధిని సాధించకుండానే వృద్ధిని చేరుకున్నాయి. కాబట్టి అది నిజమైన అభివృద్ధికాదు.
- జరాల్డ్ మేయర్ ప్రకారం దీర్ఘకాలంలో తలసరి ఆదాయం లో పెరుగుదలనే ఆర్థికాభివృద్ధిగా పేర్కొన్నారు.
- హెగెన్ ప్రకారం ఆర్థికాభివవృద్ధి అనేది అంతులేని, నిల్వలు కొనసాగే ప్రక్రియ.
- కొలిన్ క్లార్క్ ప్రకారం.. వ్యవసాయ రంగంలోని ప్రజలు పారిశ్రామిక, సేవల రంగానికి నిరంతరంగా తరలిపోవడం ఆర్థికాభివృద్ధిగా పేర్కొన్నారు.
- అందువల్ల ప్రతి దేశం ముందుగా ఆర్థికాభివృద్ధిని చేరుకుని ఆ తర్వాత వృద్ధిని చేరుకోవాలి.

కొనసాగించగలిగే అభివృద్ధి

- భవిష్యత్‌తరాల వారి అవసరాలు తీర్చుకునే సామర్థ్యం దెబ్బతీయకుండా ప్రస్తుత తరంవారు తమ అవసరాలు తీర్చుకోవడమే కొనసాగించే అభివృద్ధి అని బ్రిట్‌లాండ్ కమిషన్ 1987లో నిర్వచించింది.
- ప్రపంచ పర్యావరణ అభివృద్ధి కమిషన్ మన ఉమ్మడి భవిష్యత్తు (అవర్ కామన్ ఫ్యూచర్) అనే సెమినార్ రిపోర్టులో కొనసాగించే (నిలదొక్కుకునే) అభివృద్ధి అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది.
- ఆర్థికాభివృద్ధిలో పునరుత్పత్తి కాని వనరులను పొదుపుగా ఉపయోగిస్తూ భవిష్యత్ తరం వారికి వనరులను కాపాడుతూ చేసే వృద్ధే కొనసాగించే అభివృద్ధి.

వృద్ధిరేటు

- వార్షిక జాతీయ ఆదాయ వృద్ధి రేటు ఆధారంగా ఆర్థిక వృద్ధిని గణిస్తారు.
- వృద్ధిరేటును గణించే విధానం...
Gt= {(Qt-Qt-1)/Qt-1} x 100
Gt= t కాలంలో వృద్ధిరేటు
Qt= ప్రస్తుత కాలంలో స్థూల దేశీయోత్పత్తి
Qt-1= గతకాలంలో స్థూల దేశీయోత్పత్తి
Ex: Qt= 104; Qt-1= 100
Gt= {(104-100)/100}x100= 4%

ఆర్థికాభివృద్ధి నిరోధకాలు (అవరోధాలు)

- అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా ఉండే కారకాలు నాలుగు రకాలు.
- సహజ వనరుల కొరత: ఒక ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని అన్ని రకాల వనరులు (నేల, నీరు, ఖనిజాలు, అడవులు, గాలి వంటివి) కలిపి పెంచుతాయి.
- వనరులు తగినంత ఉన్నప్పటికీ వాటిని వినియోగించలేకపోవడం, వనరుల నిర్వహణలో అసమర్థత వల్ల కూడా ఆర్థికాభివృద్ధి తగ్గుముఖం పడుతుంది.
- అల్ప మానవ మూలధన వృద్ధిరేటు: అభివృద్ధి చెందుతున్న దేశాల బడ్జెట్‌లో విద్యుత్, ఆరోగ్యానికి తక్కువ బడ్జెట్ కేటాయిస్తాయి. ఫలితంగా మానవ మూలధనం నిరుపయోగంగా ఉంటుంది.
- విద్యకు తక్కువ నిధులు కేటాయించడం వల్ల చాలామందికి చదవడం, రాయడం తెలియకపోవడం అదేవిధంగా ఆధునిక ఎలక్ట్రానిక్ ఉపకరణాలను వాడలేకపోవడం జరుగుతుంది.
- వైద్య సదుపాయాలపై తక్కువ నిధులు కేటాయిస్తే తక్కువ జీవన ప్రమాణస్థాయి ఉండటం, వ్యక్తులు అనారోగ్య పరిస్థితుల వల్ల ఉత్పత్తిలో తగ్గుదల ఏర్పడుతుంది.

అవస్థాపనా సదుపాయాల కొరత

- అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉండే అప్పులు, దానికి సంబంధించిన మిత వ్యయ చర్యల కారణంగా ఈ దేశాల్లో అవస్థాపనా సౌకర్యాల కల్పన కష్టంగా మారుతుంది. ఫలితంగా అభివృద్ధి కుంటుపడుతుంది.
- పేదరిక విష వలయం (Vicious circle of porest): 1950 నుంచి ప్రధాన వెనుకబడిన దేశాలు పేదరికపు విషయాల్లో చిక్కుకుని వేగవంతమైన అభివృద్ధిని సాధించలేకపోతున్నాయి. పేదరికం మానసిక ఒత్తిడితోపాటు నైతికంగా కూడా మనిషిని దిగజారుస్తుంది.
- పేదవాడు ఎల్లప్పుడు పేదరిక విషవలయాల బంధంలో చిక్కుకుని తక్కువ కోరికలతో పేదవాడిగానే మిగిలిపోతున్నాడు.
- ఈ దేశాల్లో పెట్టుబడి రేటు, వృద్ధి సామర్థ్యం కూడా చాలా తక్కువగా ఉండటంవల్ల మనిషి మళ్లీ పేదవాడిగా మిగిలిపోతున్నాడు. ఫలితంగా మూలధన కొరత ఎదుర్కోవడం వల్ల తక్కువ ఉత్పాదకత కారణంగా తక్కువ ఆదాయం.

Adam-Smith
- అర్థశాస్త్ర పిత- ఆడమ్ స్మిత్
- సాంప్రదాయ అర్థశాస్త్ర పిత- ఆడమ్ స్మిత్
- శ్రమ విభజన పిత- ఆడమ్ స్మిత్
- సూక్ష్మ అర్థశాస్త్ర పిత- ఆల్ఫ్రెడ్ మార్షల్
- నవ్య సాంప్రదాయ అర్థశాస్త్ర పిత- ఆల్ఫ్రెడ్ మార్షల్
- స్థూల అర్థశాస్త్ర పిత- జాన్ మేవార్డ్ కిన్స్
- మిశ్రమ ఆర్థశాస్త్ర పిత- జాన్ మేవార్డ్ కిన్స్
- ఆధునిక అర్థశాస్త్ర పిత- జాన్ మేవార్డ్ కిన్స్
- సంక్షేమ అర్థశాస్త్ర పిత- ఏసీ ఫిగో
- నవ్య సంక్షేమ అర్థశాస్త్ర పిత- అగస్టిన్ కాంప్టే
- ప్రభుత్వ అర్థశాస్త్ర పిత- డాల్టన్

India-Brefing

ఆర్థికాభివృద్ధి

- దేశంలో ఉత్పత్తి పెరుగుదలతోపాటు వ్యవస్థాపూర్వక సాంకేతిక మార్పులతో కూడిన గుణాత్మక మార్పును ఆర్థికాభివృద్ధి అంటారు.
- ఆర్థికాభివృద్ధి= ఆర్థిక వృద్ధి + పేదవారికి అనుకూలంగా వనరుల పంపిణీ = ఆర్థికవృద్ధి + సంక్షేమం

ఆర్థికాభివృద్ధిలో ఇమిడి ఉన్నఅంశాలు

1. తలసరి వాస్తవిక జాతీయాదాయం పెరుగుదల
2. ఆర్థిక వ్యవస్థల్లో ఆభివృద్ధికి దోహదపడే నిర్మాణాత్మక మార్పులు రావడం
3. పేదరికం ఆర్థిక అసమానతలు తగ్గి ఉపాధి పెరగడం
4. సంస్థాగత సాంకేతిక మార్పులు రావడం
5. ఈ అంశాలన్నీ దీర్ఘకాలంలో కొనసాగడం

ప్రాక్టీస్ బిట్స్


1. ఊహా కల్పనలు లేదా ప్రాక్కల్పనలు అనేది?

1) లక్ష్యాలను బట్టి వాస్తవికత
2) కల్పనలో వాస్తవికత లేకపోవడం
3) నిర్ధిష్టమైన వాటిని ఊహించే శక్తి
4) ఏదీకాదు

2. వృద్ధి, అభివృద్ధికి సంబంధించి కిందివాటిలో దేన్ని వృద్ధిగా పిలుస్తారు?

1) ద్రవ్యరూపంలోని జీడీపీ వృద్ధి
2) ద్రవ్యరూపంలోగల తలసరి ఆదాయ వృద్ధి
3) వాస్తవ రూపంలోగల జీడీపీ వృద్ధి
4) వాస్తవ రూపంలోని తలసరి ఆదాయ వృద్ధి

3. పడకుండా నిలిచే స్థిర అభివృద్ధికి సరైన అర్థం?

1) భావితర అవసరాలపై ప్రభావం లేకుండా ప్రస్తుత తరానికి స్థితిగతులను అభివృద్ధి పర్చడం
2) సంఘంలో కింది స్థాఁధలో ఉన్న విభాగా వారి అభివృద్ధి
3) సాంఘిక న్యాయంతో అభివృద్ధి
4) చాలా కాలంగా కొనసాగే అభివృద్ధి

4. నిలదొక్కుకునే అభివృద్ధి దేనికి వర్తిస్తుంది?

1) ప్రస్తుత తరంవారి అవసరాలను భవిష్యత్ తరాలవారి అవసరాలను పక్కకు పెట్టి నెరవేర్చడం
2) భవిష్యతు తరాలవారి అవసరాలను ప్రస్తుత తరంవారి అవసరాలను పక్కకు పెట్టకుండా తీర్చడం
3) ప్రస్తుత తరంవారి అవసరాలను ప్రక్కకకు పెట్టి భవిష్యత్ తరాల అవసరాలను తీర్చడం
4) ప్రస్తుత తరంవారి అవసరాలను భవిష్యత్ తరాలవారి అవసరాలను పాటుచేయకుండా తీర్చడం

5. ఆర్థిక వ్యవస్థలోని అనేక రకాల కార్యకలాపాలు ఏకకాలంలో అభివృద్ధి చెందడాన్ని ఇలా పిలుస్తారు?

1) బిగ్ ప్రష్ సిద్ధాంతం
2) సంతులిత వృద్ధి సిద్ధాంతం
3) అసంతులిత వృద్ధి సిద్ధాంతం
4) ఉద్యోగ కల్పనలేని వృద్ధి సిద్ధాంతం

6. ఆర్థిక వృద్ధిలో స్వర్ణయుగ భావనను ప్రతిపాదించినవారు?

1) హరడ్
2) డోమర్
3) జాన్ రాబిన్స్‌న్
4) ఆడమ్ స్మిత్

7. దేశంలో మూలధన కల్పన నిష్పత్తి పెరిగేకొద్ది...?

1) వృద్ధిరేటు ఎక్కువవతుంది
2) వృద్ధిరేటు తగ్గుతుంది
3) వృద్ధిరేటు స్థిరంగా ఉంటుంది
4) వృద్ధిరేటు గురించి ఏమీ చెప్పలేం
giridar

1926
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles