తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలు


Mon,February 11, 2019 11:49 PM

తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో (ఆదర్శ పాఠశాల) 2019-20 విద్యాసంవత్సరానికిగాను ఆరోతరగతి, ఏడు నుంచి పదోతరగతి (ఖాళీ సీట్ల నిమిత్తం) ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది.
ts-school-entrance
-అర్హత: 2018-19 విద్యాసంవత్సరంలో ఐదోతరగతి , ఆరోతరగతి, ఏడోతరగతి, ఎనిమిదో, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
-వయస్సు: ఆగస్టు 31 నాటికి ఆరోతరగతికి పదేండ్లు, ఏడోతరగతికి 11 ఏండ్లు, ఎనిమిదో తరగతికి 12 ఏండ్లు, తొమ్మిదో తరగతికి 13 ఏండ్లు, పదో తరగతికి 14 ఏండ్లు నిండి ఉండాలి.
-ఈ పాఠశాలల్లో ప్రవేశం పొందినవారికి మధ్యాహ్న భోజనం పథకం అమలవుతుంది. బాలికలకు హాస్టల్ సౌకర్యం ఉంటుంది. అదేవిధంగా ఐఐటీ/జేఈఈ/నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ/సీఎస్ తదితర కాంపిటేటివ్ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఇస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/- (ఎస్సీ/ఎస్టీ/బీసీలకు రూ. 50/-)
-ఎంపిక: ప్రవేశపరీక్ష ఆధారంగా
-ఆరోతరగతి రాతపరీక్షలో తెలుగు, మ్యాథ్స్, సోషల్ & సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. మిగతా తరగతులకు మ్యాథమెటిక్స్, సోషల్, జనరల్ సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల నుంచి ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 28
-హాల్‌టెక్కెట్ల డౌన్‌లోడింగ్: ఏప్రిల్ 9-12
-ప్రవేశ పరీక్ష: ఏప్రిల్ 13 (ఆరోతరగతి ఉదయం 10 గం. నుంచి 12 గం. వరకు, ఏడు నుంచి పదోతరగతికి మధ్యాహ్నం 2 గం. నుంచి-4 గం. వరకు)
-పరీక్ష సమయం: రెండు గంటలు
-వెబ్‌సైట్: http://telanganams.cgg.gov.in

1677
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles