యూజీసీ-నెట్ జూలై 2019


Sun,February 10, 2019 11:40 PM

దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో లెక్చరర్లు/జేఆర్‌ఎఫ్ అర్హత కోసం ప్రతి యేటా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)-జూన్ 2019 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది.
UGC-NET-EXAMS
-యూజీసీ నెట్/జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (లెక్చరర్‌షిప్) పేరుతో ఏడాదికి రెండుసార్లు (డిసెంబర్, జూన్) నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 8 - 10 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేయనున్నారు.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్సెస్& అప్లికేషన్స్ ఎలక్ట్రానిక్ సైన్సెస్ తదితర సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. మాస్టర్ డిగ్రీ చివరి ఏడాది/ఫైనల్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
గమనిక: ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ, పీహెచ్‌సీ అభ్యర్థులు సంబంధిత పీజీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-వయస్సు: 2019 జూన్ 1 నాటికి జేఆర్‌ఎఫ్‌కు 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు వయోపరిమితి లేదు.
-ఎగ్జామినేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ. 800/-, ఓబీసీ అభ్యర్థులు రూ.400/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ.200/-
-నెట్ సబ్జెక్ట్‌ల సంఖ్య: 101
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డితో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 91కిపైగా నగరాల్లో పరీక్షను నిర్వహిస్తారు
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా
-ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లను విరామం లేకుండా మూడు గంటల్లో నిర్వహిస్తారు. గతంలో 30 నిమిషాలపాటు విరామం ఉండేది.
-రాతపరీక్షలో పేపర్-1కు 50 మార్కులు, పేపర్-2కు 100 మార్కులు (సంబంధిత సబ్జెక్టు)
-పేపర్-1లో టీచింగ్/రిసెర్చ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి.
-పేపర్-2లో ఎంచుకున్న సంబంధింత సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం మార్కులకు యూజీసీ నెట్ పరీక్ష ఉంటుంది.
-నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: మార్చి 1 నుంచి
-చివరితేదీ: మార్చి 30
-హాల్ టికెట్ల డౌన్‌లోడింగ్: మే 15 నుంచి
-యూజీసీ నెట్: జూన్ 20,21,24,25,26, 27, 28
-వెబ్‌సైట్: www.ntanet.nic.in

1134
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles