నాటా-2019


Thu,January 24, 2019 12:38 AM

న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆర్కిటెక్చర్ విద్యాసంస్థల్లో 2019-20కిగాను ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ బీఆర్క్ డిగ్రీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నాటా ప్రకటన విడుదల చేసింది.
nata
-నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా)-2019
-ఈ ఏడాది నుంచి నాటాను జేఈఈ మెయిన్ తరహాలో ఈసారి నుంచి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రతి ఏటా రెండుసార్లు నిర్వహించనుంది.
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 10+2 లేదా ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-పరీక్ష పేరు: నాటా ఎంట్రెన్స్ టెస్ట్
-ఇది ఆన్‌లైన్ ఎంట్రెన్స్ టెస్ట్. ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. పార్ట్-ఏలో ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 120 మార్కులకుగాను మ్యాథమెటిక్స్-20, జనరల్ ఆప్టిట్యూడ్-40 ప్రశ్నలను ఇస్తారు. 60 నిమిషాల్లో పూర్తిచేయాలి. పార్ట్-బీలో డ్రాయింగ్ టెస్ట్ ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 40 మార్కుల చొప్పున మొత్తం 80 మార్కులకు పేపర్, పెన్సిల్ రూపంలో నిర్వహిస్తారు. 120 నిమిషాల్లో పూర్తిచేయాలి.
-నోట్: ఆబ్జెక్టివ్ పరీక్షలో 120కి 30, డ్రాయింగ్ పరీక్షలో 80కి 20 కనీస అర్హత మార్కులు సాధించాలి. నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
-అప్లికేషన్ ఫీజు: మొదటి విడత లేదా రెండో విడత పరీక్షకు రూ.1800/-, (ఎస్సీ/ఎస్టీలకు రూ.1500/-)
-రెండు పరీక్షలు రాయడానికి రూ.3500/- (ఎస్సీ/ఎస్టీలకు రూ.2800/-)
-పరీక్షకేంద్రాలు: హైదరాబాద్, వరంగల్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-మొదటి విడత పరీక్షతేదీ: ఏప్రిల్ 14,
-రెండో విడత పరీక్షతేదీ: జూలై 7
-చివరితేదీ: మొదటి పరీక్షకు మార్చి 11, రెండో పరీక్షకు జూన్ 12
-వెబ్‌సైట్: www.nata.in

687
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles