ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ ఏఐ


Mon,January 21, 2019 01:11 AM

iit-hyderabad-youtube
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బీటెక్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచీని 2019-20 నుంచి ప్రారంభించనుంది. కృత్రిమ మేధస్సు (ఏఐ)కు దేశంలో అందించనున్న మొదటి సంస్థగా, అంతర్జాతీయంగా మూడో సంస్థగా ఐఐటీహెచ్ నిలిచింది. ప్రస్తుతం బీటెక్ ఏఐ కోర్సును ఎంఐటీ (యూఎస్), కార్నెగీ మిలన్ వర్సిటీ (యూఎస్) అందిస్తున్నాయి. తొలి బ్యాచ్‌లో 20 మందితో దీన్ని ప్రారంభించనున్నట్లు ఐఐటీహెచ్ అధికారులు వెల్లడించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
-ఐఐటీ హైదరాబాద్ ఇప్పటికే ఎంటెక్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ-మెషిన్ లెర్నింగ్, ఎంటెక్ డాటా సైన్స్ కోర్సులను అందిస్తుంది. సంస్థలో బీటెక్ ఇతర బ్రాంచీలు చదువుతున్నవారు ఏఐని మైనర్ సబ్జెక్టుగా కూడా ఎంపిక చేసుకోవచ్చని సంస్థ అధికారులు తెలిపారు.

558
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles