ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో నావిక్ పోస్టులు


Sun,January 20, 2019 01:15 AM

భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఇండియన్ కోస్ట్‌గార్డ్ 10+2 ఎంట్రీ-02/2019 బ్యాచ్ ద్వారా ఖాళీగా ఉన్న నావిక్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
aeroplane-coast
-పోసు ్ట పేరు: నావిక్ (జనరల్ డ్యూటీ)-10+2 ఎంట్రీ స్కీమ్
-అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ లేదా 10+2 ఉత్తీర్ణత. ఇంటర్‌లోని మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌ల్లో తప్పనిసరిగా కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 18 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి. 1997, ఆగస్టు 1 నుంచి 2001 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-శారీరక ప్రమాణాలు: ఎత్తు :157 సెం.మీ ఉండాలి. ఛాతీ - శరీరానికి తగ్గ అనుపాతంలో ఉండాలి. గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచం తప్పనిసరి.
-బరువు: ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, పీఎఫ్‌టీ ద్వారా
-దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను ప్రతి జోన్ పరిధిలోని సెంటర్ ప్రకారం షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఈ అభ్యర్థులకు రాతపరీక్షను నిర్వహిస్తారు.
-రాతపరీక్షలో క్వాలిఫైయింగ్ మార్కులు ఒక్కొక్క జోన్ సెంటర్‌ను బట్టి ఎక్కవ, తక్కువగా ఉంటాయి.
-రాతపరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనిలో ఇంటర్ స్థాయిలోని మ్యాథ్స్, ఫిజిక్స్, బేసిక్ కెమిస్ట్రీ, ఇంగ్లిష్ నాలెడ్జ్ , జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
-రాతపరీక్షలో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ప్రిలిమినరీ మెడికల్ ఎగ్జామినేషన్‌లను నిర్వహిస్తారు.
-ఈ పరీక్షల నిర్వహణకు 2 నుంచి 3 రోజులు పడుతుంది.
-మెరిట్ అభ్యర్థుల వివరాలను జోన్‌పరిధిలోని ఖాళీల సంఖ్య ఆధారంగా 2019 మార్చి- ఏప్రిల్‌లో ఇండియన్ కోస్ట్‌గార్డ్ వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
-శిక్షణ: ఐఎన్‌ఎస్ చిల్కాలో 2019 జూలై-ఆగస్టు మధ్య ప్రారంభమవుతుంది. కేటాయించిన ట్రేడ్‌కు సంబంధించి సముద్రంలో ప్రొఫెషనల్ ట్రెయినింగ్‌ను ఇస్తారు.
-ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్: 1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల్లో, 10 ఫుష్ అప్‌లు, 20 ఉతక్ బైటక్‌లు చేయాలి.
-పై అన్ని పరీక్షల్లో క్వాలిఫై అయినవారికి వైద్యపరీక్షలను నిర్వహించి జూన్/జూలైలో ఫలితాలను వెల్లడిస్తారు.
-జీతభత్యాలు: నెలకు రూ. 21,700/- వీటికి అదనంగా డీఏ, కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్, ఇతర అలవెన్స్‌లు ఉంటాయి.
-నావిక్ నుంచి ప్రధాన అధికారి హోదా వరకు పదోన్నతి పొందవచ్చు.
-తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంత అభ్యర్థులు ఈస్ట్‌జోన్ పరిధిలోకి వస్తారు.
-ఈస్ట్‌జోన్ పరిధిలోని పరీక్ష కేంద్రాలు- సికింద్రాబాద్, చెన్నై, విశాఖపట్నంలో ఉన్నాయి
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 31
-వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in

569
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles