7,306 గురుకుల పోస్టులు


Wed,April 19, 2017 02:33 AM

లక్షలాదిమంది విద్యార్థులు ఎదురుచూసిన గురుకుల నోటిఫికేషన్ విడుదలైంది. తొమ్మిది రకాల పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే సిలబస్, పరీక్ష విధానం విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ. గురుకుల టీచర్ల ఎంపికలో మొదటిదశ స్క్రీనింగ్‌టెస్ట్ (ప్రిలిమినరీ)ను మే 28న నిర్వహించనున్నది. దీనిలో అర్హత సాధించినవారికి రెండోదశలో మెయిన్ ఎగ్జామినేషన్‌ను జూన్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కేవలం 40 రోజుల గడువులో ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగనుంది. ఈ నోటిఫికేషన్‌తో ఏయే సొసైటీల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు, ఖాళీల సంఖ్య, అర్హతలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం...

ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ):


-బీఏ/బీఎస్సీ లేదా బీకాంలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీ అభ్యర్థులయితే 45 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత సబ్జెక్టు (మెథడాలజీ)లో బీఈడీ చేసి ఉండాలి లేదా నాలుగేండ్ల బీఏ బీఈడీ/బీఎస్సీ, బీఈడీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతోపాటు తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్‌టెట్)/ఏపీటెట్ లేదా సీటెట్‌లో క్వాలిఫై అయి ఉండాలి.
నోట్: టెట్ పేపర్ - 2కు 20 శాతం వెయిటేజీ ఇస్తారు. రాతపరీక్షకు 80 శాతం మార్కులు, టెట్ స్కోర్‌కు 20 శాతం.
-వయస్సు: 18 - 44 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు.
-మొత్తం ఖాళీలు - 4362 (టీఎస్ రెసిడెన్షియల్ సొసైటీలో - 74, టీఎస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ సొసైటీలో - 1281, ట్రైబల్ వెల్ఫేర్‌లో 621, బీసీ గురుకుల సంస్థల్లో 1170, మైనార్టీ గురుకుల సంస్థల్లో 1216 పోస్టులు ఉన్నాయి.
-పేస్కేల్: రూ. 28,940 - 78,910 (ట్రైబల్ వెల్ఫేర్‌లో మాత్రం రూ. 29,760 - 80,930)

పోస్ట్‌గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ):


-మొత్తం ఖాళీలు - 921 (బీసీ గురుకుల - 83, ట్రైబల్ వెల్ఫేర్ - 165, టీఎస్ రెసిడెన్షియల్ - 136, సోషల్ వెల్ఫేర్‌లో - 257, మైనార్టీ - 280)
-పేస్కేల్: రూ. 31,460 - 84,970 (ట్రైబల్ వెల్ఫేర్‌లో రూ. 35,120 - 87,130)
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీలకు 45 శాతం మార్కులు వస్తే చాలు. దీంతోపాటు సంబంధిత సబ్జెక్టు మెథడాలజీలో బీఈడీ లేదా బీఏ బీఈడీ/బీఎస్సీ బీఈడీ ఉత్తీర్ణత.
GurukulPosts

ఫిజికల్ డైరెక్టర్ (స్కూల్):


-మొత్తం ఖాళీల సంఖ్య - 6 (ఈ పోస్టులన్నీ ట్రైబల్ వెల్ఫేర్ పరిధిలోని గురుకుల సంస్థల్లో ఉన్నాయి)
-పేస్కేల్: రూ. 28,940 - 78,940/-
-అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు జాతీయ లేదా రాష్ట్ర లేదా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో (స్పోర్ట్స్ /గేమ్స్ లేదా అథ్లెటిక్స్) పాల్గొన్నవారు. (వీటికి అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ లేదా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపు ఉండాలి) లేదా బీపీఈడీలో 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హతలు.

క్రాఫ్ట్ టీచర్స్:


-మొత్తం ఖాళీల సంఖ్య - 43 (సోషల్ వెల్ఫేర్ - 3, బీసీ గురుకులాలు - 26, టీఎస్ రెసిడెన్షియల్‌లో 14 ఖాళీలు)
-పేస్కేల్: రూ. 21, 230 - 63,010/-
-అర్హతలు: పదోతరగతితోపాటు ఐటీఐలో ఉడ్‌వర్క్ లేదా టైలరింగ్/ బుక్‌బైండింగ్, ఎంబ్రాయిడరీ, కార్పెంటర్, సూయింగ్ టెక్నాలజీ, డ్రెస్‌మేకింగ్ ట్రేడ్‌లో ఉత్తీర్ణతతోపాటు డైరెక్టర్, టీఎస్/ఏపీ ప్రభుత్వ ఎగ్జామ్స్ జారీచేసిన టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ ఇన్ హయ్యర్ గ్రేడ్ (సంబంధిత అంశంలో) లేదా హోంసైన్స్/క్రాఫ్ట్ టెక్నాలజీల్లో మూడేండ్ల డిప్లొమా కోర్సు ఉత్తీర్ణత. ఇంటర్‌బోర్డు గుర్తించిన ఫ్యాషన్ అండ్ గార్మెంట్ మేకింగ్ రెండేండ్ల వొకేషనల్ కోర్సు లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.

స్టాఫ్ నర్స్:


-మొత్తం ఖాళీలు - 533. (సోషల్ వెల్ఫేర్- 121, బీసీ వెల్ఫేర్ - 135, మైనార్టీ - 195, టీఎస్ రెసిడెన్షియల్ - 32, ట్రైబల్ వెల్ఫేర్ - 50)
-పేస్కేల్: రూ. 25, 140 - 73, 270/-
-అర్హతలు: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం)తోపాటు టీఎస్/ఏపీ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. లేదా బీఎస్సీ నర్సింగ్‌తోపాటు నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.

పోస్టులు, ప్రారంభ, చివరితేదీలు వరుసగా...


-టీజీటీ, పీజీటీ, పీడీ: ఏప్రిల్ 18 - మే 4
-క్రాఫ్ట్, ఆర్ట్, పీఈటీ, మ్యూజిక్: ఏప్రిల్ 20 - మే 4
-లైబ్రేరియన్, స్టాఫ్‌నర్స్: ఏప్రిల్ 20 - మే 6
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

మ్యూజిక్ టీచర్స్:


-మొత్తం ఖాళీల సంఖ్య - 197 (సోషల్ వెల్ఫేర్‌లో 92, బీసీ గురుకుల సంస్థల్లో 52, ట్రైబల్ వెల్ఫేర్‌లో 39, టీఎస్ రెసిడెన్షియల్‌లో - 14 ఖాళీలు ఉన్నాయి)
-పేస్కేల్: రూ. 21, 230 - 63, 010/ (ట్రైబల్ వెల్ఫేర్‌లో రూ. 22,460 - 66,330)
-అర్హతలు: పదోతరగతితోపాటు గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిప్లొమా ఇన్ ఇండియన్ మ్యూజిక్ లేదా డిగ్రీ ఇన్ మ్యూజిక్ లేదా నాలుగేండ్ల సర్టిఫికెట్ కోర్సు విత్ డిప్లొమా ఇన్ లైట్ మ్యూజిక్ లేదా ఎంఏ ఫోక్ ఆర్ట్స్/ ఎంపీఏ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.

ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ):


-మొత్తం ఖాళీల సంఖ్య - 616 (ట్రైబల్ వెల్ఫేర్- 83, సోషల్ వెల్ఫేర్- 182, బీసీ వెల్ఫేర్- 135, మైనార్టీ వెల్ఫేర్ - 194, టీఎస్ రెసిడెన్షియల్ - 22)
-పేస్కేల్: రూ. 21, 230 - 63, 010/-
-అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు ఎన్‌సీటీఈ గుర్తించిన అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా సర్టిఫికెట్/డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత. (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 శాతం మార్కులు వస్తే చాలు)

ఆర్ట్ టీచర్స్:


-మొత్తం ఖాళీల సంఖ్య - 372 (సోషల్ వెల్ఫేర్ - 63, బీసీ వెల్ఫేర్- 69, మైనార్టీ వెల్ఫేర్ - 195, ట్రైబల్ వెల్ఫేర్- 30, టీఎస్ రెసిడెన్షియల్ - 15)
-అర్హతలు: పదోతరగతితోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన డిప్లొమా ఇన్ ఆర్ట్స్ విత్ ఫ్రీ హ్యాండ్ అవుట్‌లైన్ అండ్ మోడల్ డ్రాయింగ్, డిజైన్, పెయింటింగ్‌తో పాటు ప్రభుత్వం జారీచేసిన హయ్యర్‌గ్రేడ్ డ్రాయింగ్ టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదా హోంసైన్స్‌లో డిప్లొమా లేదా క్రాఫ్ట్ టెక్నాలజీలో మూడేండ్ల డిప్లొమా లేదా బీఎఫ్‌ఏ ఇన్ అప్లయిడ్ ఆర్ట్స్/పెయింటింగ్ లేదా స్కల్పిచర్ లేదా బీఎఫ్‌ఏ యానిమేషన్.
-పేస్కేల్: రూ. 21, 230 - 63, 010/-

లైబ్రేరియన్ (స్కూల్):


-మొత్తం ఖాళీల సంఖ్య - 256 (సోషల్ వెల్ఫేర్ - 137, బీసీ వెల్ఫేర్ - 119)
-పేస్కేల్: రూ. 26, 600 - 77, 030/-
-అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు లైబ్రెరీ సైన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణత.

నోట్: క్రాఫ్ట్, ఆర్ట్, మ్యూజిక్, స్టాఫ్‌నర్స్, పీఈటీ, లైబ్రేరియన్ పోస్టులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే పరీక్షలో వచ్చిన మార్కుల ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలు మే/జూన్‌లో నిర్వహిస్తారు.

2108
Tags

More News

VIRAL NEWS