41 ప్రకరణలను మార్చిన రాజ్యాంగ సవరణ?


Thu,August 10, 2017 10:57 PM

certificate

గురువారం తరువాయి

-26వ సవరణ (1971): ప్రకరణ 366ను సవరించి ప్రకరణ 366Aను చేర్చారు. ప్రకరణలు 291, 362లను తొలగించారు. రాజాభరణాల రద్దు.
-27వ సవరణ (197:1) ప్రకరణలు 239A, 240లను సవరించారు. ప్రకరణలు 239B, 371Cలను కలిపారు. మిజోరాన్ని ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. 1971 ఈశాన్య ప్రాంతాల(పునర్వ్యవస్థీకరణ) చట్టం ప్రకారం మేఘాలయ కొత్త రాష్ట్రంగాను, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగాను ఏర్పాటు చేశారు. ఈశాన్య ప్రాంతంలో ఉన్న రాష్ర్టాలన్నింటికి కలిపి ఒక హైకోర్టు, ఒక బార్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఈశాన్య రాష్ర్టాల నుంచి పార్లమెంట్‌కు, రాష్ట్ర శాసనసభలకు ప్రాతినిధ్యం కల్పించారు.

-28వ సవరణ (1972): 312A ప్రకరణను చేర్చారు. 314ను తొలగించారు.
-29వ సవరణ (1972): IXవ షెడ్యూలును సవరించారు. కేరళ భూసంస్కరణ చట్టాలను (1969, 1971) న్యాయసమీక్ష పరిధి నుంచి తొలగించే నిమిత్తం వాటిని IXవ షెడ్యూల్‌లో చేర్చారు.
-30వ సవరణ (1972): ప్రకరణ 131(1)ను సవరించారు. సుప్రీంకోర్టు అప్పీళ్లకు వెళ్లడానికి గల రూ. 20,000ల విలువను రద్దు చేశారు.
-31వ సవరణ (1973): 81, 330, 332 ప్రకరణలను సవరించారు. లోక్‌సభలో రాష్ర్టాల ప్రాతినిధ్య సభ్యుల సంఖ్యను 500 నుంచి 525కు పెంచారు. కేంద్రపాలిత ప్రాంతాల ప్రాతినిధ్య సంఖ్య 25 నుంచి 20కు తగ్గించారు.

-32వ సవరణ (1973): ప్రకరణ 371(1)ను సవరించారు. 371D, 371E లను చేర్చారు. VIIవ షెడ్యూల్‌ను సవరించారు. జాబితా 1లో 63వ అంశాన్ని సవరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతానికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించారు.
-33వ సవరణ (1974): 101, 190 ప్రకరణలను సవరించారు. పార్లమెంట్ సభ్యుడి రాజీనామాపత్రాన్ని సభాధ్యక్షుడు తప్పనిసరిగా ఆమోదించాలి అనే నిబంధనను తొలగించారు. సభ్యుడు ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాడని సంతృప్తి చెందినప్పుడు మాత్రమే స్పీకర్ లేదా చైర్మన్ రాజీనామాను ఆమోదించవచ్చు.
-34వ సవరణ (1974): IXవ షెడ్యూల్‌ను సవరించారు. IXవ షెడ్యూల్‌కు 67 నుంచి 86 వరకు మొత్తం 20 చట్టాలను అదనంగా చేర్చారు. అనేక రాష్ర్టాలు చేసిన 20 భూసంస్కరణల చట్టాలను న్యాయసమీక్షా పరిధి నుంచి కాపాడి రాజ్యాంగ రక్షణ కల్పించడానికి IXవ షెడ్యూల్‌లో చేర్చారు.
-35వ సవరణ (1974): ప్రకరణ 2Aను చేర్చారు. Xవ షెడ్యూల్‌ను అదనంగా చేర్చారు. 80, 81 ప్రకరణలను సవరించారు. సిక్కింకు సహరాష్ట్ర హోదా కల్పించింది. Xవ షెడ్యూల్‌లో సిక్కిం రాష్ట్ర విలీనానికి సంబంధించిన షరతులు, విధి విధానాలను పొందుపరిచారు.

-36వ సవరణ (1975): ప్రకరణ 80, 81లను సవరించారు. I నుంచి IV షెడ్యూళ్లను సవరించారు. ప్రకరణ 371Fను చేర్చారు. ప్రకరణ 2Aను తొలగించారు. Xవ షెడ్యూల్‌లోని అంశాలను తొలగించారు. IXవ షెడ్యూల్‌లో 2వ అంశాన్ని చేర్చారు. Iవ షెడ్యూల్‌ను సవరించి సిక్కింకు సంపూర్ణ రాష్ట్ర హోదా కల్పించారు. IVవ షెడ్యూల్‌ను సవరించి సిక్కిం నుంచి రాజ్యసభకు ఒక సభ్యుణ్ని పంపడానికి ఏర్పాటు చేశారు. ప్రకరణ 371Fలో సిక్కిం రాష్ర్టానికి సంబంధించిన ప్రత్యేక నిబంధనలను చేర్చారు.
-37వ సవరణ (1975): 239A, 240 ప్రకరణలను చేర్చారు. Xవ షెడ్యూల్‌ను పునరుక్తీకరించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో శాసనసభ, మంత్రిమండలిని ఏర్పాటు చేశారు.
-38వ సవరణ (1975): 123, 213, 239B, 352, 356, 359, 360 ప్రకరణలను సవరించారు. రాష్ట్రపతి, గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్లు జారీ చేసిన ఆర్డినెన్స్‌లు, కోర్టు అధికార పరిధిలోకి రాకుండా సవరించారు.

-39వ సవరణ (1975): ప్రకరణలు 71, 329లను సవరించారు. ప్రకరణ 329Aను చేర్చారు. IXవ షెడ్యూల్‌ను సవరించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సభాపతుల ఎన్నికలకు సంబంధించిన వివాదాలను న్యాయసమీక్ష పరిధి నుంచి మినహాయించారు. వీరి ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పార్లమెంట్‌తో నియమించిన అధికారి ద్వారా గాని, లేదా ఒక ఫోరమ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా గాని పరిష్కరించవచ్చు. ఈ సవరణ IXవ షెడ్యూల్‌కు కొన్ని కేంద్ర, రాష్ట్ర చట్టాలను చేర్చింది.

-40వ సరవణ (1975): ప్రకరణ 297ను సవరించారు. IX వ షెడ్యూల్‌కు 175 నుంచి 188 వరకు ఉన్న అంశాలను చేర్చారు. 297 ప్రకరణను సవరించి భారత్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లోని కాంటినెంటల్ షెల్ప్‌లో లభ్యమయ్యే భూవనరులు, నీరు, ఖనిజ వనరులు, ఇతర విలువైన వనరులపై హక్కులు కేంద్ర ప్రభుత్వ పరం చేశారు. ఈ సవరణ ద్వారా IXవ షెడ్యూల్‌కు 64 చట్టాలను చేర్చారు. వీటితో మొత్తం చట్టాల సంఖ్య 188కు పెరిగింది.
-41వ సవరణ (1976): ప్రకరణ 316ను సవరించారు. రాష్ట్ర, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సభ్యుల పదవీవిరమణ వయస్సు 60 నుంచి 62 ఏండ్లకు పెంచారు.
-42వ సవరణ (1976): VIIవ షెడ్యూల్‌ను సవరించారు. 31, 31D, 32A, 39A, 43A, 48A, 51A, 131A, 139A, 144A, 226A, 228A, 257A, 323A, 323B లను చేర్చారు. IVAవ భాగాన్ని, 14 భాగాలను కూడా చేర్చారు. ప్రవేశికను సవరించారు. ఈ సవరణ ద్వారా 41 ప్రకరణలను, VIIవ షెడ్యూల్‌ను సవరించడమేగాక 15 ప్రకరణలను, 2 భాగాలను చేర్చారు. కాబట్టి దీనిని మినీ రాజ్యాంగం అంటారు. మొదటిసారిగా అవతారికను సవరించారు.

సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం అనే పదాలకు బదులు సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మార్చారు. దేశ ఐకమత్యం అనే పదాలకు బదులుగా దేశ ఐకమత్యం- అఖండతగా మార్చారు. ఆదేశిక సూత్రాలను అమలు చేసేటప్పుడు ప్రాథమిక హక్కులకు మధ్య వివాదం తలెత్తితే ఆదేశసూత్రాలే చెల్లుబాటవుతాయి. IVA అనే కొత్త భాగాన్ని చేర్చి అందులో ప్రాథమిక విధులను పొందుపర్చారు. లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్యలో 2001 వరకు మార్పు లేకుండా చేయడం. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల పదవీకాలాన్ని ఐదేండ్ల నుంచి ఆరేండ్లకు పెంచారు. రాష్ట్రపతి క్యాబినెట్ సలహాను తప్పక పాటించాలి 74(1)ను సవరించారు. ప్రకరణ 368 కింద చేసే రాజ్యాంగ సవరణను కోర్టులో సవాల్ చేయరాదు. అంటే పార్లమెంటే సర్వాధికారి. VIIవ షెడ్యూల్‌ను సవరించి కొన్ని అంశాలను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు బదిలీ చేసింది. ప్రకరణ 312ను సవరించి అఖిల భారత న్యాయ సర్వీసు కమిషన్ నియామకానికి వీలు కల్పించింది.

కొత్తగా 323A, 323B ప్రకరణలను చేర్చింది. ప్రకరణ 323A ద్వారా పరిపాలన ట్రిబ్యునళ్లను, ప్రకరణ 323B ద్వారా పన్నులు, భూసంస్కరణలు, పట్టణ భూపరిమితి, పౌరసరఫరాలకు సంబంధించిన ట్రిబ్యునళ్లకు వీలు కల్పించారు. ప్రకరణ 352ను సవరించి భారత భూభాగంలో ఏ ప్రాంతానికైనా అత్యవసర పరిస్థితిని విధించేలా మార్పు చేసింది. (ఈ సవరణ కంటే ముందు కొన్ని ప్రాంతాలకు మాత్రమే అత్యవసర పరిస్థితిని విధించే వీలుండేది.)
-43వ సవరణ (1977): 145, 226, 228, 366 ప్రకరణలను సవరించారు. 31D, 32A, 131A, 144A, 226A, 228A ప్రకరణలను రద్దు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయసమీక్ష అధికారాల పరిధిని పునర్ నిర్మించింది.

44వ రాజ్యాంగ సవరణ (1978)

-ఈ చట్టాన్ని 1978లో చేశారు. ఇందులో కొన్ని అంశాలను 1978, జూన్ 20న, మరికొన్ని అంశాలు ఆగస్టు 1న, సెప్టెంబర్ 6న అమల్లోకి వచ్చాయి.
-ఈ చ్టటం ద్వారా రాజ్యాంగంలోని 19, 22, 30, 31ఏ, 31సీ, 38, 74, 77, 83, 105, 123, 132, 133, 134, 139ఏ, 150, 166, 172, 194, 213, 217, 225, 226, 227, 239బీ, 329, 352, 356, 358, 359, 360, 371ఎఫ్, 71(సబ్), 103 (సబ్), 192 (సబ్) ప్రకరణలను, వీటితోపాటు 9వ షెడ్యూల్‌ను సవరించారు.
-134ఏ, 300ఏ, 361ఏ ప్రకరణలను కొత్తగా చేర్చడంతోపాటు 12వ భాగంలో 4వ చాప్టర్‌ను పొందుపర్చారు.

-31, 257ఏ, 329ఏ ఆర్టికల్స్‌ను, రాజ్యాంగంలోని 30వ ప్రకరణ తర్వాత ఆస్తిహక్కు అనే సబ్‌హెడ్డింగ్‌ను తొలగించారు.
-ప్రకరణ 22ను సవరించడం ద్వారా నివారక నిర్బంధానికి సంబంధించి కొన్ని రక్షణలు కల్పించారు. అవి..సలహా సంఘం అనుమతి లేకుండా నివారక నిర్బంధంలో ఉన్న వ్యక్తి అత్యధిక నిర్బంధ కాలం మూడు నుంచి రెండు నెలలకు తగ్గించారు.
-సలహా సంఘంలో అధ్యక్షుడు, ఇద్దరు సభ్యులు ఉండాలి. అధ్యక్షుడిగా హైకోర్టు జడ్జి, సభ్యులుగా పదవీ విరమణ చేసిన, పదవిలో ఉన్న జడ్జిలు ఉంటారు.
-రెండు నెలలు దాటిన నివారక నిర్బంధానికి తప్పకుండా సలహా సంఘం అనుమతి తీసుకోవాలి.

-రాజ్యాంగ యంత్రాంగం విఫలమైతే రాష్ట్రపతిపాలన ఆరునెలల కంటే ఎక్కువ కాలం అమలు చేయకూడదు. అయితే 365కు ఒక కొత్త క్లాజును చేర్చారు. దీంతో జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు ఏడాదిపైన ప్రతిసారి పొడిగించవచ్చు, ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణకు వీలుకాదని ధ్రువీకరించినప్పుడు రాష్ట్రపతి పాలన పొడిగించడానికి అవకాశం కల్పించారు.
-ఆరేండ్లకు పెంచిన పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల కాలపరిమితిని 42వ సవరణ ద్వారా ఐదేండ్లకు తగ్గించారు. రాష్ట్ర శాసనసభల్లో కోరమ్ పునరుద్ధరించారు. ప్రకరణలు 105, 194లను సవరించి హౌస్ ఆఫ్ కామన్స్ అనే పదాన్ని తీసివేశారు.
-74వ ప్రకరణలోని నిబంధనలను అలాగే ఉంచి దానికి మరికొన్ని కొత్త అంశాలను చేర్చారు. దీనిప్రకారం మంత్రిమండలి పంపిన సిఫారసులను రాష్ట్రపతికి కేవలం పునఃపరిశీలనకు పంపే హక్కును మాత్రమే కల్పించారు.
-ప్రకరణలు 132, 134లను సవరించి 134ఏ అనే కొత్త ప్రకరణను చేర్చారు. సత్వర న్యాయమందేలా జడ్జిమెంట్ లేదా తుది తీర్పు తర్వాత సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడానికి హైకోర్టు అనుమతివ్వాలి.

-42వ సవరణ ద్వారా హైకోర్టులకు కల్పించిన రెవెన్యూ అధికారాలను తొలగించారు. దీంతో ట్రిబ్యునళ్లపై హైకోర్టులకు ఉండే పర్యవేక్షణాధికారం మళ్లీ లభించింది.
-ఈ సవరణ ద్వారా ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి 19(1-ఎఫ్), 31వ ప్రకరణలను రద్దుచేశారు. ఆస్తిహక్కును 12వ భాగంలో ప్రకరణ 300-ఏలో కేవలం చట్టబద్ధమైన హక్కుగా చేర్చారు.
-ఈ సవరణ ద్వారా 352ను సవరించారు. దీనిద్వారా అంతర్గత అశాంతి (Internal disturbances) అనే పదాన్ని తొలగించి సాయుధ తిరుగుబాటు (Armed Rebellion) అనే పదాన్ని చేర్చారు.

-అత్యవసర పరిస్థితి ప్రకటన, క్యాబినెట్ రాతపూర్వక సిఫారసు ద్వారా మాత్రమే విధించాలని ఈ సవరణ సూచిస్తుంది. అంటే ప్రధానమంత్రి సిఫారసుపై కాకుండా మంత్రివర్గ (క్యాబినెట్ అనే పదం అంతకుముందు రాజ్యాంగంలో లేదు. ఈ సవవరణ ద్వారానే ఆ పదాన్ని మొదటిసారిగా చేర్చారు) సిఫారసుపై మాత్రమే రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటించాలి.
-అత్యవసర పరిస్థితి ప్రకటించిన మొదటి ఆరు నెళ్ల తర్వాత ప్రతి ఆరు నెలల పొడిగింపునకు పార్లమెంటు అనుమతి తప్పక ఉండాలి. అయితే ఎమర్జెన్సీ విధించిన నెలలోపు పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీతో ఆమోదం పొందాలి. గతంలో (44వ సవరణకు ముందు) ఇది సాధారణ మెజారిటీతో ఆమోదించాల్సి ఉండేది.

819
Tags

More News

VIRAL NEWS