ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్


Sun,January 21, 2018 12:42 AM

-ఇంటర్ అభ్యర్థులకు అవకాశం
-రాతపరీక్ష, ఇంటర్వూ ద్వారా ఎంపిక
-చివరితేదీ: ఫిబ్రవరి 5
-పరీక్షతేదీ: ఏప్రిల్ 22

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) & నేవల్ అకాడమీ (ఎన్‌ఏ) ఎగ్జామినేషన్ (I), 2018 కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.
UPSC-NDA

వివరాలు:

ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌ను ప్రతిఏటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది.
ఈ ఎగ్జామ్ ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవి, ఎయిర్‌ఫోర్స్‌లో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగంలో చేరి భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 415
-నేషనల్ డిఫెన్స్ అకాడమీ: 360 పోస్టులు (ఇండియన్ ఆర్మీ-208, ఇండియన్ నేవి-60, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్-92)
-ఇండియన్ నేవల్ అకాడమీ-55 పోస్టులు (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్)
అర్హతలు:
-ఆర్మీ విభాగం (ఎన్‌డీఏ): గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి ఇంటర్/10+2 లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-ఎయిర్ ఫోర్స్/నేవల్ (ఎన్‌డీఏ)/ఇండియన్ నేవల్ అకాడమీ: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా 10+2లో ఉత్తీర్ణత. ఇంటర్ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
శారీరక ప్రమాణాలు
-ఎత్తు: 157.5 సెం.మీ. (ఎయిర్‌ఫోర్స్ 162.5 సెం.మీ.)
-బరువు: ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-కంటిచూపు: 6/6, 6/9
-ఈ విధానంలో ఎంపికైనవారు ఉచితంగా బ్యాచిలర్ డిగ్రీ చదువుకోవచ్చు.
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో..
-15 నిమిషాల్లో 2.4 కి.మీ. దూరాన్ని పూర్తిచేయాలి
-స్కిప్పింగ్, 3-4 మీటర్ల రోప్ ైక్లెంబింగ్ చేయాలి.
-20 ఫుష్‌అప్‌లు, 8 చిన్‌అప్‌లు చేయాలి.
-వయస్సు: 1990, జూలై 2 నుంచి 2002, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/- జనరల్/ఓబీసీ (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు)
-జీతభత్యాలు: రూ. 56,100/- శిక్షణ సమయంలో స్టయిఫండ్ చెల్లిస్తారు.
-పదోన్నతులు: ఆర్మీ/నేవి/ ఎయిర్‌ఫోర్స్‌లో లెఫ్ట్‌నెంట్/సబ్ లెఫ్ట్‌నెంట్/ఫ్లయింగ్ ఆఫీసర్ నుంచి జనరల్/అడ్మిరల్/ఎయిర్ చీఫ్ మార్షల్ హోదా వరకు.
గమనిక: ఈ పోస్టులకు బాలురు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
-ఎంపిక: రాత పరీక్ష, సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ ద్వారా.
-రాత పరీక్ష విధానం: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. 1.రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ తరహా), 2. ఇంటెలిజెన్స్, పర్సనాలిటీ టెస్ట్
-రాత పరీక్షలో..మొత్తం మార్కులు 900. దీనిలో పేపర్1 (మ్యాథమెటిక్స్)-300 మార్కులు, పేపర్ 2 (జనరల్ ఎబిలిటీ టెస్ట్)- 600 మార్కులు, ప్రతి పేపర్‌కు 150 నిమిషాలు కేటాయించారు.
-నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
-ఎస్‌ఎస్‌బీ/ఇంటర్వ్యూ 900 మార్కులు
రాతపరీక్షలో అర్హత పొందినవారికి ఎస్‌ఎస్‌బీ ఆధ్వర్యంలో యూపీఎస్సీ రెండు దశల్లో ఇంటెలిజెన్స్, పర్సనాలిటీ టెస్ట్‌లు నిర్వహిస్తుంది.
-మొత్తం (రాతపరీక్ష+ఎస్‌ఎస్‌బీ టెస్ట్/ఇంటర్వ్యూ)-1800 మార్కులకుగాను ప్రతిభ చూపిన అభ్యర్థులను ఎంపిక చేసి ట్రెయినింగ్ ఇస్తారు.
-ట్రెయినింగ్ విజయవంతంగా పూర్తిచేసిన వారికి జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ డిగ్రీ సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు.
-ఆర్మీ క్యాడెట్స్- బీఎస్సీ/బీఎస్సీ (కంప్యూటర్)/ బీఏ
-నేవల్ క్యాడెట్స్- బీటెక్
-ఎయిర్ ఫోర్స్ క్యాడెట్స్- బీటెక్
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: ఫిబ్రవరి 5 (సాయంత్రం 6 గంటల వరకు)
-రాత పరీక్ష: ఏప్రిల్ 22
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, బెంగళూరు,చెన్నైతో సహా దేశవ్యాప్తం గా 41 కేంద్రాల్లో నిర్వహిస్తారు.
-ఇంటర్వ్యూలు: 2018 ఆగస్టు-సెప్టెంబర్ మధ్య
-వెబ్ సైట్: upsconline.nic.in

674
Tags

More News

VIRAL NEWS