సశస్త్ర సీమాబల్‌లో 181 ఖాళీలు


Mon,August 13, 2018 11:16 PM

కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలోని సశస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బీ) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, హెచ్‌సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.
SSB-POLICE
-మొత్తం ఖాళీల సంఖ్య: 181
విభాగాలవారీగా ఖాళీలు:
-సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టాఫ్‌నర్స్ ఫిమేల్)-23, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫార్మసిస్ట్-18, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్-2, డెంటల్ టెక్నీషియన్-2, రేడియోగ్రాఫర్-8, స్టెనోగ్రాఫర్-54), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) -74
-అర్హతలు: ఏఎస్‌ఐ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (హెచ్‌సీ) పోస్టులకు ఇంటర్‌తోపాటు టైపింగ్ నైపుణ్యం ఉండాలి. మిగతా పోస్టులకు సైన్స్‌లో 10+2/ఇంటర్‌తోపాటు సంబంధిత విభాగాల్లో డిగ్రీ, డిప్లొమా ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
-వయస్సు: ఏఎస్‌ఐ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ 18 నుంచి 25 ఏండ్లు, ఎస్‌ఐ (స్టాఫ్‌నర్స్): 21 నుంచి 30 ఏండ్లు, మిగిలిన పోస్టులకు 20 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్ : ఎస్‌ఐ పోస్టులకు రూ. 35,400/-, ఏఎస్‌ఐ పోస్టులకు రూ.29,200/-, హెడ్ కానిస్టేబుల్‌కు రూ. 25,500/-, అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ తదితర సదుపాయాలు ఉంటాయి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/- ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక విధానం: పీఈటీ, పీఎస్‌టీ, రాతపరీక్ష
-రాతపరీక్ష: రెండు పేపర్లు ఉంటాయి.
-ఆబ్జెక్టివ్ రాతపరీక్ష (పేపర్1)-100 మార్కులు. దీనిలో జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్ /హిందీ, జనరల్ రీజనింగ్‌పై ప్రశ్నలు ఇస్తారు. 120 నిమిషాల్లో పూర్తిచేయాలి.
-సంబంధిత ఆబ్జెక్టివ్ టెక్నికల్ సబ్జెక్టు (పేపర్ 2)- 100 మార్కులకు ఉంటుంది.
-ఏఎస్‌ఐ (స్టెనో), హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు డిస్క్రిప్టివ్ (పేపర్ 2)- 100 మార్కులకు ఉంటుంది. స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (ఆగస్టు 11-17)లో వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
-వెబ్‌సైట్: www.ssbrectt.gov.in

610
Tags

More News

VIRAL NEWS