అగ్రికల్చర్ పీజీ డిప్లొమా


Wed,January 17, 2018 12:16 AM

హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఏఏఆర్‌ఎం) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
naarm

వివరాలు:

ఎన్‌ఏఏఆర్‌ఎం అనేది ఏసీఏఆర్ పరిధిలో పనిచేసే సంస్థ. ఇది రాజేంద్రనగర్‌లో ఉంది.
-కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఇన్ అగ్రికల్చర్ (పీజీడీ - టీఎంఏ)
-ఈ కోర్సును ఎన్‌ఏఏఆర్‌ఎం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
-ఈ కోర్సు కాలపరిమితి ఏడాది. దీన్ని దూరవిద్యా విధానంలో అందిస్తారు.
-అర్హతలు: అగ్రికల్చర్/సోషల్ సైన్సెస్ లేదా ఫిజికల్ సైన్సెస్ లేదా మేనేజ్‌మెంట్ లేదా లైఫ్ సైన్సెస్/ఇంజినీరింగ్/లా కోర్సుల్లో పీజీ ఉత్తీర్ణత.
-లేదా అగ్రికల్చరల్ సైన్సెస్/సోషల్ సైన్సెస్ లేదా ఫిజికల్ సైన్సెస్ లేదా ఇంజినీరింగ్ సైన్సెస్/లా డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు రెండేండ్ల పని అనుభవం ఉండాలి.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 28
-వెబ్‌సైట్: www.naarm.org.in

530
Tags

More News

VIRAL NEWS