ఎన్‌ఎండీసీలో 44 ట్రెయినీలు


Wed,January 17, 2018 12:18 AM

హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) మెకానికల్ విభాగంలో ఖాళీగా ఉన్న మెయింటేనెన్స్ అసిస్టెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
nmdc

వివరాలు:

ఎన్‌ఎండీసీ లిమిటెడ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ పరిధిలో పనిచేస్తున్న నవరత్నహోదా కలిగిన సంస్థ
-మొత్తం పోస్టుల సంఖ్య: 44 (జనరల్-22, ఓబీసీ-3, ఎస్సీ-5, ఎస్టీ-14)
-పోస్టు పేరు: మెయింటేనెన్స్ అసిస్టెంట్ ట్రెయినీ
-అర్హతలు: వెల్డింగ్/మెషినిస్ట్, మోటారు/డీజిల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
-వయస్సు: 18 నుంచి 30 ఏండ్లకు మించరాదు.
-స్టయిఫండ్: మొదటి 12 నెలలకు రూ. 11,000/-, ఆ తర్వాత 6 నెలలకు రూ. 11,500/- శిక్షణ సమయంలో చెల్లిస్తారు. ప్రొబేషనరీ పీరియడ్ తర్వాత పే స్కేల్ రూ. 11,330-3%-20,000/- ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 150/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్ పరీక్ష
-రాతపరీక్షలో 100 మార్కులకు ఉంటుంది.
-దీనిలో సంబంధిత సబెక్టు -30, జనరల్ నాలెడ్జ్-50, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ -20 మార్కులకు ప్రశ్నపత్రం ఇస్తారు.
-రాతపరీక్షలో జనరల్-40 శాతం, ఓబీసీ-35 శాతం, ఎస్సీ/ఎస్టీ-33 శాతం కనీస అర్హత మార్కులను సాధించాలి.
-ట్రేడ్ పరీక్ష అనేది కేవలం అర్హత పరీక్ష మాత్రమే
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో.
-చిరునామా: Post Box No.1353, Post Office, Humayun Nagar, Hyderabad, Telangana State, Pin-500028
-చివరితేదీ: ఫిబ్రవరి 12
-వెబ్‌సైట్: www.nmdc.co.in.

573
Tags

More News

VIRAL NEWS